• ఏరో బిక్స్ తో నవ యవ్వనం.

    యవ్వనంలో ఫిట్ నెస్ తో ఉండాలని ఎన్నెన్నో సౌందర్య సాధనాలు, చికిత్సలు తీసుకొంటారు. కానీ వీటన్నిటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరో బిక్ వ్యాయామ ఫలితాలు మరింత…

  • సరైన ఫిట్నెస్ తో వుండాలంటే.

    ఫిట్ నెస్ కు కొన్ని ప్రధాన సూత్రాలు పాటించాలి. వ్యాయామాలు డైట్ విషయంలో శ్రద్ధ చూపిస్తూ కూడా కొన్ని జాగ్రత్తలు తప్పవు. వారంలో ఐడు రోజులు ౩౦,…

  • ఆరోగ్యానికి ఫిట్నెస్ కీలకం.

    ఆరోగ్యంగా వుండటం అన్నది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఎవ్వరికి వాళ్ళు అలవరచుకోవలసిన ఒక మంచి అలవాటు వంటిది. ఎంత పద్దతిగా తినొద్దూ అనుకున్నా పండగలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు…

  • నెలల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నా ఏమాత్రం బరువు తగ్గకపోతే ఎంతో నిరాశగా వుంటుంది. దానికి ఫిట్ నెస్ శిక్షకులు ఏమంటారంటే ఒకే రకమైన వ్యాయామాలు ఏళ్ల తరబడి చేస్తే దాని వల్ల శరీరం వాటికి అలవాటు పడిపోయి కేలరీలు తగ్గడం మానేస్తాయి. అందుకే మేం ఎప్పటికప్పుడు శరీరం బరువు శరీర స్థితిని బట్టి రకరకాల వ్యాయామాలు మారుస్తూ వుంటాం అంటారు. అలాగే బరువులు ఎత్తే వ్యాయామాల వల్ల కండలు తిరిగి చూసేందుకు బావుండమని అమ్మాయిలు అపోహ పడతారంటారు. అసలు సాధరణంగా ఆడవాళ్ళలో టెస్టో స్టేరాన్ హార్మోన్ తక్కువగా వుంటుంది కాబట్టి ఎంత బరువులెత్తినా కండలు పెరగవు. బరువు తగ్గలనుకొంటే కండరాల రాశి పెంచుకోవాలి. వాటి వల్ల కొవ్వు పెరిగే ఆస్కారం వుండదు. వేగవంతమైన పరుగూ, నడక వంటి వ్యాయామాలకు పరిమితమైతే గుండె ఆరోగ్యం బావుంటుంది కానీ ఇవి మానేస్తే శరీరం యధావిధిగా తయారవుతుంది. శక్తిని పెంచేవి, కండరాల రాసిని పెంచేవి, శ్రమతో, సహనంతో చేయవలిసిన వ్యాయామాలను శిక్షకుల సాయంతోనే చేస్తే తగిన ఫలితం ఉంటుందంటున్నారు.

    ఏళ్ల తరబడి ఒకే వ్యాయామం వేస్టే

    నెలల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నా ఏమాత్రం బరువు తగ్గకపోతే ఎంతో నిరాశగా వుంటుంది. దానికి ఫిట్ నెస్ శిక్షకులు ఏమంటారంటే ఒకే రకమైన వ్యాయామాలు…

  • టీనేజర్స్ అమ్మాయిలు బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వర్క్ అవుట్స్, డాన్స్, తినే పదార్ధాల పైన అదుపు, ఆమంచి ట్రైనర్ వుంటే రెండు మూడు నెలల్లో కావాల్సిన వెయిట్ తాగొచ్చు అంటున్నారు నిపుణులు. ముంజేతులు, పిరుదులు, దైస్ బరువు తగ్గాలి అంటే జింమ్ కు వెళ్ళడం బెటర్. క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీసు వల్ల లీన్ లుక్ వస్తుంది. అలాగే డాన్స్ కూడా రొటీన్ కు అదనంగా ప్రయోజనం కలుగ జేస్తుంది. యోగా డాన్స్ వల్ల శరీరానికి ఫ్లేక్సిబిలిటీ వస్తుంది. బరువు తగ్గే క్రమంలో ట్రైనర్ పర్యవేక్షణ చాలా అవసరం. అన్నింటికంటే సేఫ్టీ ముఖ్యం. ఏ వర్క్అవుట్ వల్ల ఏ ప్రయోజనం వుంటుందో ట్రైనర్ చెప్పాలి. అలాగే శరీర సామధ్యం విస్మరించవద్దు. ఇంట్లో సొంత వర్క్ ఔట్స్ వల్ల అంట త్వరగా లక్ష్యం చేరుకోరు. జిమ్ లేదా ట్రైనర్ సహాయం తో వర్క్ అవుట్స్ చేయాలి. కొవ్వు స్పైసి పదార్ధాలు తినకుండా ట్రైనర్ సుచించినవే తీసుకోవాలి. డాన్స్, యోగా, ఇతర వ్యాయామాలతో అనుకున్న బరువు తగ్గడం కష్టం కాదు.

    మంచి ట్రైనర్ అద్వర్యం లో బరువు తగొచ్చు

    టీనేజర్స్ అమ్మాయిలు బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వర్క్ అవుట్స్, డాన్స్, తినే పదార్ధాల పైన అదుపు, ఆమంచి ట్రైనర్ వుంటే రెండు మూడు నెలల్లో కావాల్సిన…

  • తెలిసినా పట్టించుకోని తెలుసుకుని తీరవలసిన చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద చర్యలు చేపట్టే వీలుంటుంది. బాగా అలసిపోతే శరీరం శక్తీ సన్నగిల్లి పోతే ఓ కప్పు ఎనర్జీ డ్రింక్ తాగాలని అనుకుంటారు కానీ ఒక్క అరటిపండు చక్కని వర్కవుట్ ఇంధనం ,ఎనర్జీ డ్రింక్ తాగినా పదిహేను నిమిషాలోకసారి మంచి నీళ్లు తాగినా అదే ఫలితం. గ్లూకోజ్ స్థాయిలు అంటే ఎనర్జీ స్టోర్స్ రెండింటికీ ఒకే మాదిరి ఉంటాయి . ఒక్క అరటిపండులా కార్బోహైడ్రేట్స్ పొటాషియం విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు కలగలిసి ఉంటాయి. ఇందులోనే సహజ శక్తీ ఉంటుంది . అలాగే గాసిప్ లు మాట్లాడుకోవటం పాపం అనుకుంటాం. ఈ మాటలకూ ప్రాణాల్ని కాపాడే శక్తీ వుంటుందంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . ఎవ్వరితోను సంబంధం లేని జాబ్స్ చేసే వాళ్ళు 2.4 రేట్లు ముందుగా చనిపోతారట. వాళ్లకు ఎవ్వళ్లతో కబుర్లకి మనసు విప్పి మాట్లాడు కొనేందుకు అవకాశం లేదు అదే సహారోగ్యాలు ఓ పదిమంది వుంది వాళ్ళతో గాసిప్ లు మాట్లాడుతూ రిలాక్స్ పొందుతూ ఉంటే ఒత్తిడి తగ్గించే హార్మోన్లు విడుదల అవుతుంటాయట. వీళ్ళలో జబ్బుల రిస్క్ తక్కువ. కానీ ఒక ముఖ్య విషయం గాసిప్ లు ఏ రిస్క్ నయినా తగ్గించవచ్చు కానీ మనం మాత్రం ఎదుటి వాళ్ళకి హాని చేయని నొప్పించని గాసిప్ లే ఎంజాయ్ చేయాలి. లేకపోతే నిజంగానే పాపం.

    తెలుసుకోవాల్సిన విషయాలెన్నో

    తెలిసినా పట్టించుకోని తెలుసుకుని తీరవలసిన చిన్న చిన్న విషయాల వల్ల  పెద్ద చర్యలు చేపట్టే వీలుంటుంది. బాగా అలసిపోతే శరీరం శక్తీ సన్నగిల్లి పోతే ఓ కప్పు…

  • నైట్ జాబ్స్ వచ్చాక పగటి నిద్ర అవసరమై ఆడపిల్లలు 30 ఏళ్ళుదాటేసరికే పొట్ట బరువు పెరుగుతున్నారు. ఇక బయటి భోజనాలు ఏటా తప్పవు గనుక సమస్య ఎదురుగ వచ్చి నిలబడుతోంది . ఫిట్ నెస్ సెంటర్ కు వెళ్లాలంటే ఎన్నో ప్యాకేజీలు. ఏది ఎంచుకోవాలి. అన్న సందేహం వచ్చినప్పుడు ముందర ఆ ప్యాకేజీ బరువు తగ్గటం అన్న ప్రధాన లక్ష్యంతో ఉండాలి. వెళ్లే ముందే ప్రాధమిక ఆరోగ్య అంచనాలు ముఖ్యం. కార్బోహైడ్రాట్స్ తగ్గించుకోవటం వేపుడు పదార్ధాలు మానేయటం వంటి ప్రాధమిక సూత్రాలకు కట్టుబడాలి. పండ్ల కూరగాయలు ఎక్కువగా తినాలి . ముఖ్యంగా ప్రోటీన్ పదార్ధాల పైన దృష్టి పెట్టాలి. ఉద్యోగం చేసే చోటికి దగ్గరగా వున్న జిమ్ ఎంచుకోవాలి. ఎదో ఒక సాకుతో ఎగ్గొట్టకుండా తప్పనిసరిగా రెగ్యులర్ గా వెళ్ళాలి. కార్డియో ఎక్సర్ సైజు లు కొవ్వు కరిగేందుకు ఎక్కువగా తోడ్పడతాయి. స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ కూడా అందులో భాగంగా ఉండాలి . ఫ్లెక్సిబిలిటీ సెషన్స్ ఉండాలి. ఆడ మగ అన్న తేడా లేకుండా మజిల్ స్త్రెంగ్థ్స్ పైకి దృష్టి వెళ్ళాలి. అస్తమానం కూర్చుని కూడా తొడలు కాళ్ళ బలం తగ్గిపోతుంది. యోగా క్లాసులు ఫ్లెక్సిబిలిటీ ని బ్యాలెన్స్ ను మెరుగు పరుస్తాయి.

    కొన్ని ప్రాధమిక సూత్రాలతోనే ఫిట్ నెస్

    నైట్ జాబ్స్ వచ్చాక పగటి నిద్ర అవసరమై ఆడపిల్లలు 30 ఏళ్ళుదాటేసరికే  పొట్ట బరువు పెరుగుతున్నారు. ఇక బయటి భోజనాలు ఏటా తప్పవు గనుక సమస్య ఎదురుగ…

  • రోజంతా పరుగులతో సరైన భోజనం అమరణి ఉద్యోగినుల కోసం ఒక మెనూ ఇచ్చారు. పోషకాహార నిపుణులు. ఉదయం వేళ ధాన్యంతో వండిన పదార్ధాలు తీసుకోవాలి. ఓట్స్ తో పల్చని గంజిలా చేసి అందులో పండ్లు చెర్రీ ముక్కలు వేసుకుని తాగచ్చు. హాల్ గ్రేయిన్ లేదా మల్టీ గ్రేయిన్ బ్రేడ్ తో శాండ్ విచ్ తయారుచేసుకుని తినాలి. పాన్ కేకులు చేయుకుంటే మైదా పిండి బదులు గోధుమపండి వాడాలి. చపాతీలను గోధుమపిండి తో మల్టీ గ్రేయిన్ ఆటా తో పప్పులపిండి కూరగాయలు కలిపి తయారు చేసుకోవాలి . కూరగాయలు పండ్ల ముక్కలు కలిపి రుచికరమైన సలాడ్స్ చేసుకోవాలి. లంచ్ బాక్స్ లో పండ్లు ఉండాలి. సన్నగా తరిగిన కూరముక్కలను పండ్లను కలిపి లంచ్ బాక్స్ లో రెడీ చేసుకోవాలి . గోధుమపిండితో సెనగలు రాజ్మా చిక్కుడుగింజలు కలిపి చపాతీలు చేసుకోవాలి. క్యారెట్లు బాగా తురిమి గ్రేవీ గానో శాండ్ విచ్ గానో చేసుకోవాలి. కూరగాయల్ ముక్కలు బీన్స్ కలిపి ఈ శాండ్ విచ్ లో నింపాలి . పప్పు ధాన్యాలు, గోధుమలు దంపుడు బియ్యం పండ్ల కూరగాయలు అన్నీ ఆహారంలో రోజూ వుండేలా చూసుకోవాలి. ఉదయం తయారు చేసుకోగలిగే భీజనంలో వీటిల్లో కొన్నయినా ఉంటే రోజంతా నీరసం లేకుండా ఉంటుంది.

    ఉద్యోగినుల కోసం మెనూ

    రోజంతా పరుగులతో సరైన భోజనం అమరణి ఉద్యోగినుల కోసం ఒక మెనూ ఇచ్చారు. పోషకాహార నిపుణులు. ఉదయం వేళ  ధాన్యంతో వండిన పదార్ధాలు తీసుకోవాలి. ఓట్స్ తో…

  • CRAWLING ఇప్పుడో గొప్ప ఫిట్ నెస్ ఎక్సర్ సైజు . ప్రొఫెషనల్ అథ్లెట్స్ కూడా ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది భారీ వ్యాయామం కానే కాదు . అదే చిన్నపిల్లలు నేల పైన పాకటం ప్రాక్టీస్ చేయటం దెస విదేశాల్లో ఇప్పుడీ వ్యాయామానికి ఎంతో క్రేజ్ ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా ఆడుతూ పాడుతూ చేయాలన్నది ఇప్పుడో కొత్త నియమం. శరీరంలో నడుము పైన ఉన్న భాగాలకు నడుము కింద ఉన్న భాగాలకు మధ్య సమన్వయం లోపిస్తే సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. పాకటం ద్వారా ఈ సమస్య పోతుంది . దీనివల్ల వెన్నుముక్క కు స్థిరత్వం సమన్వయం చురుకుదనం తో పాటు ఎన్నో ప్రయోజనాలున్నాయి . ఈ క్రాలింగ్ తో శారీరిక మానసిక దృఢత్వం వస్తుంది. శరీరంలో ప్రతి కదలిక కేంద్రీయ నాడీ వ్యవస్థ తో ముడిపడి ఉంటుంది. బిగుసుకుపోన కీళ్ల కండరాలు సాగేలా చేస్తుంది. పాకటం వల్ల జాయింట్ పెయిన్ పోతాయి. శరీరంలో కీలక కండరాలు భుజాలు తొడలు మోకాళ్ళు కీళ్ళు ఈ వ్యాయామం బలోపేతం చేస్తుందని నిపుణులు చెపుతున్నారు. ఇందులో బియర్ట్ క్రాల్ క్రీచ క్రాల్ స్పైడర్ మాన్ క్రాల్ ఆర్మ్ క్రాల్ ఇన్ వామ్ క్రాల్ ఎన్నో రకాలున్నాయి.

    పాకటం కూడా వ్యాయామమే

    CRAWLING  ఇప్పుడో గొప్ప ఫిట్ నెస్ ఎక్సర్ సైజు . ప్రొఫెషనల్ అథ్లెట్స్ కూడా ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది భారీ వ్యాయామం కానే కాదు…

  • మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి ఖర్చవుతోంది. శరీరం ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ తోనే ఉంటారు. ఇల్లు దుమ్ము దులిపితేనూ వ్యాక్యూమ్ క్లీన్ చేస్తేనూ ఇంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతి కందిన వందలాది పనులు చేస్తుంటేనూ ఎక్సర్ సైజ్ చేసినట్టు కాదంటారు నిపుణులు . ఈ ఇంటి పనులన్నీ వారానికి 150 నిమిషాల తగు మాత్రం వ్యాయామం తో సాటిరావు. తాము చేసే ఈ పద్ధతి లేని పనుల వల్ల కొవ్వు కరిగి శరీరం స్లిమ్ గా అవుతోందని ఊహించటం. శరీరం యధాతధంగా ఎప్పటిలా స్పూను కొవ్వు కూడా కరగకుండా ఉండటం చూసి దిగులుపడటం మామూలే. సైక్లింగ్ వాకింగ్ రన్నింగ్ తదితర వ్యాయామాలు పోలిస్తే ఇంటిపని ఎక్సర్ సైజ్ కిందకి రానే రాదు . ఉదాహరణకు 30 నిమిషాల వ్యాక్యూమింగ్ వల్ల 130 క్యాలరీలు ఖర్చయితే 30 నిముషాల సైక్లింగ్ వల్ల 400 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇంటి పనులు శారీరిక చురుకుదనం ఇస్తాయి. కానీ వ్యాయామాలకు సమానం రావు.

    ఇంటిపని వ్యాయామం కానే కాదు

    మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి  ఖర్చవుతోంది. శరీరం  ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ…

  • శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో ఇప్పటి పిల్లల్లో శారీరిక సామర్ధ్యం తగ్గిపోతోంది. ఈ విశ్లేషణ ప్రకారం తిండి పుష్టి తగ్గిపోయింది. శారీరిక శ్రమ తగ్గింది . ఇళ్లల్లో వంట పాత్రల సైజు కూడా తగ్గింది. ఆరునుంచి 17 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలో తల్లితండ్రుల్లో ఉన్న ఫిట్ నెస్ కూడా లేకపోవటానికి కారణం ఎక్కువసేపు టీవీ చూడటం వీడియో గేమ్స్ శారీరిక శ్రమ ఎంత మాత్రం లేకపోవటం వ్యాయామాలు క్రీడలు ఏవీ లేకపోవటం వల్ల బరువుగా ఉండటం కారణాలంటున్నారు. 26 దేశాల నుంచి రెండు కోట్ల మంది పిలల్లపై ఈ అధ్యయనం జరిగింది. 5 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఈ పిలల్లు ఎంత దూరం పరిగెత్తుతారు? వారి వయసు తిండి వివరాలు పరిగెత్తే సమయంలో హృదయ స్పందన హృదయ నాళికలో పనిచేసే తీరు రికార్డు చేసారు. ఫిట్ నెస్ లో తల్లితండ్రుల కంటే 1. 5 శాతం తక్కువగా వున్నారని బాల బాలికల విషయం పెద్ద తేడా ఏమీ లేదని తేల్చారు. మానవ శక్తీ సామర్ధ్యాలకు సంబంధించి శాస్త్ర వెతలు ఎప్పటికప్పుడు నివేదికలు తయారుచేస్తూనే ఉంటారు.

    పిల్లల్లో క్షీణిస్తున్న శారీరిక సామర్ధ్యం

    శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో…