• దక్షిణాది తో పాటు హిందీ లో కూడా నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకుంటోంది శృతి హాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటోంది. మనం చేసే పనుల్లో మార్పు కనిపించాలి నిన్న కంటే ఈ రోజు ఇవాళ్టి కంటే రేపు కొత్తదనం చూపించాలి ఇది సినిమాల ముచ్చట. వ్యక్తిగత జీవితం నేను మార్పు కోరుకొను. డబ్బు పేరు విజయం నన్ను మార్చలేవు. కేవలం నేను శృతి హాసన్ నే . నన్ను ఏవీ ప్రభవితం చేయవు. అంటోంది శృతి. కెరీర్ ఆరంభంలో పోలిస్తే ఏమైనా మార్పు లొచ్చాయా అన్న ప్రశ్నకు శ్రుతీ ఏవీ లేదండి. నేనంటే నేనొక్కదాన్నే కాదు. నాలో ఇద్దరున్నారు. ఒకరు కధానాయిక శృతి హాసన్ నేను చేసే శ్రమ గుర్తింపు ఆదరణ అన్నీ సెట్ లోంచి నేను ఇంటికెళ్ళేదాకే. ఇంటికెళితే ఇంకో శృతి . బయట విషయాలతో సంభంధం లేని శృతి. బయట కూడా ఇంట్లో గురించి మాట్లాడాను. చిన్నపటినుంచి సిఎంమా వాతావరణం లో పెరగటం వల్ల వృత్తిని వ్యక్తిగత జీవితాన్ని నేరుగా వంచుకోవటం అలవాటైంది. ఈ రెండిటినీ వేరు వేరుగానే చూస్తానంటోంది శృతి హాసన్. ఇంటికి వెళుతూ ఆఫీస్ లో బర్డెన్నంత ఇంట్లో వాళ్ళ పైన మోపే ఎంతో మందికి శృతి హాసన్ ఆదర్శం కావాలి.

    నాలో ఇంకో శృతి హాసన్

    దక్షిణాది తో  పాటు హిందీ లో కూడా నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకుంటోంది శృతి హాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తన కెరీర్ ను…

  • ఏ అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడుకొన్నట్లు ప్రతిబందాన్ని కాపాడుకోవాలి. శృతిహాసన్ కూడా ఇదే చెపుతోంది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తం. ఎక్కువ రాజీపడాలో ఎక్కడ పడితేనే బావుంటుంది. బంధాలను కాపాడుకోవలిసిన విషయంలో రాజీపడాలి. గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. స్నేహంలో అయినా వివాహ బంధంలో అయినా ఒకప్పుడు రాజీలుండేవి. ఇప్పుడిలా లేవు కనుకనే విడిపోవటాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న రాజీ వల్ల బంధం నిలబడితే కట్టుబడాలి. లేదా ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందుల పాతేనని తేలితే ఎప్పుడు రాజీల మాటే వద్దు. అంటోంది. రేలషన్ షిప్స్ గురించి శృతి హాసన్ మాట్లాడుతూ ఇప్పటిదంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చటుక్కున తినేయాలి. చిటుక్కున పనిలో పడిపోవాలి. అంతే వేగం బంధాలకు ప్రాధాన్యత ఇవ్వలేనంత వేగం. ఈజీగా లవ్ లో అసలు అంత సులువుగా విడిపోవటం మొత్తం మీద అసలు బంధాలకు విలువే లేకుండా పోతుంది అంటుందామె. ఎదిగే వయసులో మొత్తం చూసిందంతా ఇదే ఈ అమ్మాయి. మానవ సంబంధాలకు గురించి శృతి కంటే చక్కగా చెప్పగలిగేదెవరు ?

    రాజీ పడకుంటే సమస్య

    ఏ  అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడుకొన్నట్లు ప్రతిబందాన్ని కాపాడుకోవాలి. శృతిహాసన్ కూడా ఇదే చెపుతోంది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం…

  • ఫలానా అని ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా ఈమెది బంగారు పాద ముద్ర స్థాయికి చేరుకుంది. శృతి హాసన్. తెలుగు తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ పరుగు అందుకుంటోంది. ఈ సంవత్సరం తెలుగులో తెలుగులో కాటమరాయుడు మినహా మరే సినిమాకు శృతి హాసన్ డేట్లు లేవు. ఇదే చెపుతోంది శృతి హాసన్. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నా కెరీర్ ను మార్చింది తెలుగు పరిశ్రమే. గబ్బర్ సింగ్ కు ముందు అన్నీ పరాజయాలే. అందుకే నేనెప్పుడూ తెలుగు చిత్ర సీమకు రుణపడిఉంటానంటోంది శృతి హాసన్. ఒకప్పుడు నన్ను ఐరెన్ లెగ్ అన్నారు ఇవ్వాళ స్టార్ హీరోయిన్ అంటున్నారు. మా నాన్న దగ్గర నుండి అమ్మ దగ్గర నుండి నేను ఫీల్డ్ ను చూస్తూనే ఉన్నా. వాళ్ళ లాగే నేనూ భాషా బేధాలతో కెరీర్ ను చూడలేదు. న దృష్టలో సినిమాకు భాష లేదు. అలా అనుకుంటే అసలు మాటలే లేని పుష్పక విమానంలో మా నాన్న ఎలా సక్సెస్ సంపాదించాడు. అంటోంది శృతి. తాను తానుగా స్టార్ గా ఎదగటం ఒక్కటే తాను ఆనందించే విషయం అంటోంది శృతి హాసన్.

    సినిమాలకు భాషా బేధం ఏమిటి ?

    ఫలానా అని  ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా   ఈమెది బంగారు పాద  ముద్ర స్థాయికి  చేరుకుంది. శృతి హాసన్. తెలుగు తమిళ   చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ పరుగు…

  • సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. చెన్నయ్ సైబర్ క్రైమ్ కు శృతి తరఫున వ్యక్తులు వచ్చి ఆ డాక్టర్ వేధిస్తున్న ఆధారాలు చూపెట్టి అతని మెయిల్ ఐడి ఫోన్ నంబర్ పోలీసులకు ఇచ్చారట. శృతి హాసన్ ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు డాక్టరు గురించి విచారించే పనిలో వున్నారు. ఎవరి పనివాళ్లని చేసుకోనిస్తే ప్రాబ్లమే ఉండదు.

    శృతికి ట్విట్టర్ బెదిరింపులు

    సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు…