• జీవితంలో ఏ అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. చిన్నప్పటినుంచి ఏడుపు ఒక బలహీనత ఎలాంటి పరిస్థితుల్లోనూ కనీరు ఆపెసుకోవటం అలవాటు చేసుకుంటాం. కానీ కనీళ్లకు ఒక హీలింగ్ పవర్ ఉంది. మనసారా కడుపారా పడేస్తే మనసుకి కలిగిన కష్టం ఎగిరిపోతుంది. ఇతరులను ఆదుకోవటం తో కలిగిన సంతోషం కనీళ్ళ రూపంలోనే ఉంటుంది. అంతులేని విజ్ఞానం పొందినపుడు జీవిత సత్యాన్ని కనుగొన్నప్పుడు కనీళ్లొస్తాయి. ప్రపంచాన్ని అర్ధం చేసుకుని మనం ఎంత స్వచంగా వెలుతురూ ప్రసరించే గాజులాగా ఉండాలని తేల్చుకున్నప్పుడు అలా ఉండగలిగినప్పుడు కనీళ్ళు వస్తాయి. కన్యా దానం ఇచ్చేసి అత్తవారింటికి పంపేస్తు ఏడుస్తారు. విదేశాలకు ఉన్నత చదువులకు పిల్లల్ని పంపుతూ పంపేది వాళ్ళ భవిష్యత్తు కోసం అని తెలిసినా ఏడ్చేస్తారు. చాలా కాలం తర్వాత బంధువులు కలిసినా స్నేహితులు కలిసినా కళ్ళనీళ్ళతో ఆహ్వానిస్తారు. ఏడుపు ఒక అద్భుతమైన ఉపశమన చర్య. అందుకే ఏడుపు ఎలాంటి సందర్భంలో వచ్చినా ఆపుకోనక్కర్లేదు. అవి శరీరం నుంచి బయటకి పోతు మనసులోని వేదనని పట్టుకు పోతాయి. మనసు తేలికై సంతోషం వస్తుంది.

    కనీళ్ళు రాలితే మనసు తేలికవుతుంది

    జీవితంలో ఏ  అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం…

  • సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి అలంటి సందర్భాల్లో ఏడిస్తే మనసు తేలికవుతుందికూడా కానీ మనం నిబ్బరంతో ఉండటం ఏడుపు మునిపంటితో నొక్కిపెట్టి కనీళ్ల్లు రాకుండా ఎంతో శ్రమతో నిగ్రహించుకుంటాం. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే కనీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని శరీరంలో విషతుల్యమైన వాటిని తొలగించి శరీరం స్వస్థత చెందేందుకు సాయపడతాయంటున్నారు. కొన్ని పరిశోధనలు చేస్తే హాయిగా ఏడవ గలిగిన వాళ్ళు శారీరికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫలితాలు తేలాయి. ఏడిస్తే ఒత్తిడి తగ్గిపోతుంది . మెదడులో నొప్పి నివారణ ఎంజైములు ఎక్కువగా విడుదలవుతాయి. కనుక మనసారా కడుపులో బాధ ఆవిరై పోయేలా హాయిగా ఏడవండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు.

    కలత పోగొట్టే కళ్ళ నీళ్లు

    సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి…