Saturday, 28 Nov, 2026

హైహీల్స్ వాడకం తగ్గించండి

హై హీల్స్ తో స్టైల్ గా ఫ్యాష న్ గా నడవడం బావుంటుంది. కానీ ఈ ఫ్యాషన్ పోకడ తిప్పలు తెస్తాయి అంటున్నారు నిపుణులు. రెండు అంగుళాలు అంతకు మించిన ఎత్తు మడమల చెప్పుల్ని వారంలో 50 గంటల పాటు ధరించి మహిళలు రెండేళ్ళు అయ్యే సరికి అందుకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ప్లాట్స్ ధరించిన వాళ్ళ తో పోలిస్తే హై హీల్స్ తో నడక పట్టీ పట్టీ నడవడం వల్ల భిన్నంగా ఉంటుందని ఈ పట్టి […]

అతి ప్రేమ వెగటే

నీహారికా , పిల్లలను ఎంతో పేమించటం మంచిదే కానీ అలా ప్రేమ పేరుతో అస్తమానం కనిపెట్టుకుని ఉండటం వల్ల  ఆ పిల్లలకు ఆశించిన మేలు కలుగదంటున్నాయి పరిశోధనలు. పిల్లలను ఎంతవరకు ప్రేమించాలి అన్నావు . సాధారణ శ్రద్ధ  తీసుకుని ప్రేమించాలన్నది నా సమాధానం. అతి శ్రద్ధ వద్దు. ప్రతి పనికీ ఇతరుల పైన ఆధారపడే అలవాటు చేయకూడదు. పిల్లలకు అవసరాలు సమకూర్చుతూ బాధ్యతలు తీసుకుంటూ వాళ్ళ ముందు స్పష్టమైన లక్ష్యం ఉంచాలి. వాళ్ళని స్వతంత్రంగా ఎదిగే అవకాశం […]

కొవ్వుంటే ఉలిక్కి పడద్దు

కొవ్వు అన్న పదం వింటేనే సాధారణంగా కంగారుపడిపోతుంటాం. కానీ అన్ని ఫ్యాట్లు చెడ్డని కావు. కొన్ని శరీరానికి చాలా అవసరం. పూర్తిస్థాయి ఆరోగ్యం కోసం ఫ్యాట్స్ అవసరం అంటారు డాక్టర్లు. మెనో ఆన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (MUFA ) ఒమేగా 3 లు గొప్ప ఎనర్జీ ఆధారాలు.అత్యవసర విటమిన్లు పోషకాలను శరీరం గ్రహించటానికి ఇవి సహకరిస్తాయి. ఇవే బరువు తగ్గటానికి సహకరించి గుండెకు ఆరోగ్యంగా ఉంచుతాయి. చేదు ఫ్యాట్స్ అంటే సాచ్యురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎల్ డి […]

ఈ సీజన్ కి పనికొచ్చే వస్త్రాలివే

భానుడి ప్రతాపం మొదలైంది . ఇప్పటివరకు షిఫాన్ లు జార్జెట్ రాసిల్క్ లు పక్కన పడేసి ఎండ వేడి తట్టుకునేందుకు ఇక మెత్తని చీరలు సౌకర్యం సొగసైన దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఖద్దరు మంగళగిరి కాటన్స్ నూలు లెనిన్ రేయాన్ పోచంపల్లి వంటివి ఇక కొలువు దీరతాయి. మంగళగిరి నూలు కలంకారీ అద్దకాలు ఇకత్ తో మెర్సీ డైజ్డ్ కాటన్ కాటన్ సిల్క్ తో కుర్తీలు స్కర్టులు టాప్ లు చక్కగా ఉంటాయి . ఇవే కాస్త […]

సంక్షోభిత వార్తల వల్ల ఆందోళన

కొందరు ఇంటికి రాగానే వార్తల్లో పడిపోతారు. నిమిష  నిమిషం ప్రపంచపు నలుమూలల ఏం  జరుగుతుందో తెలుసుకోవటం నూటికి 86 మంది చేసేపని. ఇది తప్పేంకాదు కానీ . ఆ వార్తల్లో టెన్షన్ తెచ్చే క్రీడలు ఆర్ధిక సంక్షోభాలు ప్రమాదాలు మరణాలు ఇలాంటివి రాత్రివేళ చూసి పడుకుంటే అది మెదడు కు విశ్రాంతి లేకుండా చేసి ఉదయం లేచేసరికి ఆందోళనగా ఉంటుంది. ఈ టెన్షన్ తో ఎదో ఒకటి అతిగా తినేస్తారని ఇది శరీరానికి అత్యధిక క్యాలరీలను మోస్తుందనీ […]

ఎండ వేడికి మొహం కమిలితే

ఎండా పెరిగితే చాలు ఆ ప్రభావం తో ముఖం నల్లగా అయిపోతుంది. ఇంట్లో దొరికే వస్తువులే రసాయన ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఒక చిన్న బొప్పాయి ముక్కను మొహానికి రాసుకుని పది నిముషాలు తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే మురికి నలుపుతనం తగ్గి చర్మం కాంతివంతంగా అయిపోతుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో కాసిని పాలు పోసి మర్దనా చేసి ముఖానికి మర్దనా చేయాలి. కాసేపాటికీ కడిగేస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా […]

అక్క ప్రాణం కోసం చెల్లెలి ఆరాటం

500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో కాపాడుకున్నారు. ఆమె బరువుకు కారణం చేరి యాట్రిక్ ఇన్ఫెక్షన్ అన్నారు. వైద్యులు అంచేతనంగా అయిపొయింది ఏమాన్. షాయ్ మా ఏమాన్ చెల్లెలు అక్క కోసం ఎందరో వైద్యులను సంప్రదించింది . అలా భారత్  లో ప్రసిద్ధ బేరియా ట్రెక్ సర్జన్ […]

బిగ్ బీ మెచ్చిన రచయిత్రి నీలమ్

కేన్సర్ తో పోరాడి గెలిచింది రచయిత్రి  నీలమ్ కుమార్. అనారోగ్యానికి గురైతే ఎంత మాత్రం నిరాశపడకూడదు. అన్న విషయాన్నీ చెప్పేందుకు ఆమె కలం పట్టారు. కేన్సర్ రోగిగా తన అనుభవాలు పుస్తకాలుగా రాసారు. తన అనుభవాలే కాక ఈ కేన్సర్ మహమ్మారిని జయించిన ఎంతోమంది కధలను పుస్తకాలుగా ప్రచురించారు. ఆమె రాసిన పుస్తకాలకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాపార దిగ్గజం రతన్  టాటా ముగ్ధులయ్యారు. ఆమె రాసిన పుస్తకాల ప్రచురణ కు విరాళాలు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. […]

వీటితో ఆరోగ్యం అందంరెండు భద్రం

శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా నొప్పులు ఎక్కువవుతాయి . కూర్చోవటం మెట్లెక్కటం కూడా చేయలేక పోతారు. పాలు జున్ను పుట్ట గొడుగులు ఆరెంజ్ జ్యూస్ పెరుగు గుడ్డు సోన వంటి వాటిలో డి విటమిన్ ఉంటుంది. అలాగే ఐరన్  లోపిస్తే రక్త హీనత వచ్చే ప్రమాదం వుంది . పాలకూర ఎర్ర కందిపప్పు ఓట్స్ […]

సంతోషానికి ఎనిమిది అంశాలు కారణం

కొలెస్ట్రాల్ స్థాయిల్ని రక్తపోటును కొలతలు వేసినట్లు ఎమోషనల్ ఆరోగ్యాన్ని కొలతలు వేయటం సాధ్యం కాదు. అయితే భావోద్వేగ అనుకూలత ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అందరికీ తెలుసు. డిప్రెషన్ కు కార్డియో వ్యాస్కులర్ రుగ్మతలను నడుమ ఎక్కువ సంభంధం ఉంటుంది. జీవితం పట్ల గల సంతృప్తి గుండె జబ్బుల ముప్పు తగ్గిస్తుందా ? ఈ విషయమై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించారు . హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు. సంతోషానికి సంబంధించిన ఎనిమిది అంశాలు వారు సృజించారు. […]

మొబైల్ మానర్స్ తప్పనిసరి

ఇప్పుడందరి చేతుల్లో ఫోన్లే . సెల్ ఫోన్ ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా వాడుకుంటే ప్రాబ్లమే  లేదు. సినిమాలో మునిగిపోయి హాయిగా చూస్తూ ఉంటాం… మన వెనక నుంచీ వెనకట లక్ష్మి బేబి సినిమా హల్లో ఉన్నానే అని ఎవరో మహానుభావుడు వీళ్ళావిడ తో పెద్దగా అరిచి చెపుతుంటే చుట్టూ పక్కలవాళ్ళు జడుచుకోరూ… అందుకే కొన్ని మర్యాదలు పాటిస్తే గౌరవంగా ఉంటుంది . మొదటిది సెల్ ఫోన్ లో పాటలు వినటం మంచి అభిరుచే. కానీ అది […]

సానుకూల దృక్పదం పేరే సంతోషం

నిహారిక, సంతోషం సగం బలం అన్న నానుడి కరక్టేనా అన్నావు. దాని చరిత్ర అనంతరం ఉత్సాహం, కృతజ్ఞత వంటి పాజిటివ్ అంశాలు, ఏమోషన్ లతో ఎప్పుడైతే ఉంటామో అదే సంతోషం. పరిపూర్ణమైన భావాలు వున్నప్పుడు కలిగేది సంతోషం. మంచి జాబ్, జీతం,జీవిత భాగస్వామి, సమృద్దిగా సంపద, చెక్కని సౌష్టవం, మంచి ఆరోగ్యం ఇవన్నీ వుంటే ఆరోగ్యంగా ఉండగలరా అనే, ఇవి సంతోషపు చిరునామా కాదు. జీవితం లోని ప్రతి అంశం పట్ల సానుకూల దృక్పదం వుంటే సంతోషం […]

దోషులకు శిక్ష పడేదాకా సినిమాల్లేవ్!

ఒంటరి, మహాత్మా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన భావన ఇవ్వాల వార్తల్లో వ్యక్తి. మలయాళీ కధానాయిక మంజువారియిర్ భావన కి ప్రాణ స్నేహితురాలు. ఓ నటుడ్ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్ళల్లో ఆయన మంజు ని వదిలేసి ఇంకో ఆమెను పెళ్ళాడతానన్నప్పుడు మంజు భావన తో ఈ అన్యాయం గురించి చెప్పుకుంది. భావన ధైర్యం వున్న యువతి. ఈ అన్యాయాన్ని మలయాళ సినిమా పెద్దల దృష్టికి తీసుకుపోయింది, పేపర్లకు ఎక్కేలా చూసింది. దీనితో ఆమె ఒక […]

వీపు విషయంలోనూ శ్రద్ధ చాలా అవసరం

కాంతివంతమైన చర్మం కోసం ఎన్నో రకాల క్రీములు, లోషన్లు, యాంటి ఏజింగ్ సీరమ్ లు, నైట్ క్రీములు, తెలిసినవాన్ని వాడేసి ముఖం అందంగా వుండేలా శ్రద్ధ తీసుకుంటారు కానీ మెడ వెనక నుంచి వీపు దాకా వుండే చర్మం మాటేమిటి? ఇప్పుడు ఫ్యాషన్ దుస్తులు వేసుకునే టప్పుడు ఎన్నో రకాల బ్యాక్ లెస్ టాప్ లు ధరించినప్పుడు మెడ వెనుక నల్లని మరకలతో ట్యాన్ తో, చిన్న పొక్కులు, మచ్చలు, మోటిమల తో కనిపిస్తూ వుంటే, వేసుకున్న […]

నవ్వు మొహం తో నే పనులవ్వుతాయి

అస్సలు నవ్వకుండా, సీరియస్ గా మేధావి మొహం తో వుంటే డిగ్నిఫైడ్ గా ఉంటుందని చాలా మంది భావించి అలా ఎప్పుడూ నవోచ్చినా నవ్వకుండా మైంటైన్ చేస్తారు. కానీ నవ్వు మొహం తో వుండే వాళ్ళు హుందాగా కనిపిస్తారని అలా నవ్వుతూ పలకరించే వాళ్ళని అందరు నమ్ముతారని ఒక అధ్యాయినం రిపోర్టు. ఈ అధ్యాయినం లో కిక్ స్టార్టర్ ప్రచారం తీరుల్ని పరిశీలించారు. అందులో వ్యవస్థాపకులు మరీ ఎక్కువగా నవ్వుతు వుంటే ఇలాంటి వాళ్ళను విశ్వాసం లోకి […]

పగిలినా విరిగినా వాడుకోవచ్చు

మేకప్ కోసం ఉపయోగించే కొన్ని వస్తువులు చాలా ఖరీదు గా ఉంటాయి. అవి చేయి జారి కింద పడిందో, మిగతా సామాన్ల మద్యని నొక్కుకునో ముక్కలైపోతేనో అవి ఎలా వాడుకోవాలో తెలియక చాలా కష్టంగా వుంటుంది. కానీ కాస్త శ్రద్ధగా వాటిని ఒక రూపంలోకి తెచ్చి వాడుకో వచ్చు. ఉదాహరణకు పెదవులకు వేసుకునే లిప్స్టిక్ పై దాకా ఓపెన్ చేస్తే ఒక్కోసారి విరిగిపోవచ్చు. దాన్ని తిరిగి ఉపయోగించుకోవాలంటే ఆ ముక్క అడుగున సన్నటి సెగపై వేడి చేసి […]

ఆరోగ్యానిచ్చే రకరకాల ‘టీ’ లు

మనకు టీ అంటే టీ నే. టీ పొడి, పంచదార, ఓ యలక్కాయో, అల్లమో ఇంతే కదా. కానీ ఆకులు, పువ్వులు, గింజలు, వేళ్ళతో కూడా రకరకాల టీలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలని పోగొడతాయి. నిద్ర సరిగా పట్టక పొతే రెండు స్పూన్ల ఎండిపోయిన చమేలి ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి చమేలి టీ తాగితే మంచి నిద్ర పడుతుందిట. బ్లాక్ టీ లో వుండే కెఫిన్ వల్ల అలసట తగ్గిపోతుందిట. రోజు రెండు సార్లు తాగితే […]

మనసైన వారికీ సొగసైన కానుక

పుట్టిన రోజు వేడుక కోసం ఎంత ప్రేమగా  అతిధులని ఆహ్వానిస్తారు. ఆ రోజును ఎంత ప్రేత్యేకం గా తీర్చి దిద్దుకుంటారు. వేసుకునే దుస్తులు, ఇంటి అలంకరణ, అనట్లు ఇప్పుడు కేకుల అలంకరణ కూడా చాలా ముఖ్యం ఫ్లవర్ బోకే కేక్ గురించి ఒక్క సారి ఇవి చూస్తే అదెంత స్పెషల్ గా వుందో అర్ధం అవుతుంది. కేకు మొత్తంగా ఒక పూల కుండీ లేదా బోకే. మనకి ఇష్టమైన ప్లవర్స్ తో, చాక్లేట్స్ తో, స్ట్రాబెర్రీ, వెనిలా […]

రాజస్థానీ కూడా అందమే అందం

సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ రాజ్ పుత్ కాడ గాజులు వెరైటిగా ఉంటాయి. మాములుగా వెడల్పుగా వుండే గాజుల పైన డిజైన్ నిలువు గా గొపురంలా ఎత్తుగా వుంటుంది. కుందన్ కారీ మీనాకారీ పనితనంలో బంగారం వజ్రాలు ఇమిడ్చి చాలా బాగుంటాయి కానీ అవి గాజు మీద గోదా కట్టినట్లు పైకి ఎత్తుగా డిజైన్ […]

రోజు బరువు చెక్ చేసుకోవడం కరెక్ట్ పద్దతి

శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళ విషయం మరీ అధ్వాన్నం గా వుంటుంది. ఇంక ఇదే చింత అయితే ఒక చిన్న వ్యూహం పాటించ మంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు బరువు చూసుకుంటూ వుంటే కొన్నాళ్ళకు ఫలితం అర్ధం అయిపోతూ వుంటుంది.ప్రతి రోజు బరువు చూసుకుంటూ చార్ట్ పైన ఫలితాలు […]