• సమస్యంతా ఒత్తిడి తోనే.

    డైట్ చార్ట్ ని చుసుకుంటూనే తింటున్నాను. అన్నం మానేసాను సెరల్స్ తీసుకుంటున్నాను అయినా ఇలా బరువు పెరిగి పోతున్నాను అని వాపోయే వాళ్ళు చాలామంది. అయితే అధ్యాయినాలు…

  • ఉల్లాస భరితం……. ఆనంద మాయం.

    సంతోషంగా, ఆనందంతో తుళ్ళుతూ వుండే సగం ఆరోగ్యం వున్నట్లే మరి ఆనందం ఎక్కడ మంచి అంటే…… మన చుట్టూ వున్న ప్రకృతి లోనే అంటారు ఎక్స్ పర్ట్స్.…

  • సైక్లింగ్ తో వత్తిడి మాయం.

    సైక్లింగ్ చేయడం వల్ల వత్తిడి తగ్గిపోతుందని తాజా పరిశోధనలు చెప్పుతున్నాయి. సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి ఆరోగ్యం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పరిశోధనలు వత్తిడి తగ్గించుకునే…

  • నిరంతర వత్తిడి వల్లే ఈ సమస్య.

    బార్నెట్ సిండ్రోమ్ సమస్యకు పనివత్తిడి జీవన శైలి ప్రధాన కారణాలు అంటారు ఎక్స్ పర్ట్స్. దైనందన జీవితంలో ఎన్నూ డిమాండ్స్ ఎదురవ్వుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం కుటుంబ…

  • రోజుకు ఆ కాస్త బ్రేక్ చాలు.

    రోజంతా ఎన్ని పనులు చేసినా ఇంకా ఎడతెరిపి లేకుండా ఉంటూనే ఉంటాయి. అయితే ఎన్ని గంటల పాటు పని చేసినా ఓ నలబై నిమిషాలు మైండ్ హోలీడే…

  • ఆందోళన తగ్గించే మెడిటేషన్.

    దైనందన పని వత్తిడుల మధ్య, ఈ మధ్య కాలంలో యాంగ్జయిటీ డిప్రెషన్ వంటి మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. అరగంట పాటు చేసే ధ్యానంతో వీటి నుంచి బయట…

  • ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అన్న సామెత తెలిసిందే. గాఢ నిద్ర కోసం విలాసవంతమైన పరుపులు అక్కర్లేదు, కష్ట జీవి అలసిపోయి పడుకొంటే నిద్ర చెప్పా పెట్టకుండా వచ్చి సేదదీరుస్తుందని అర్ధం చేసుకొoటాం, కానీ నిద్రాదేవి ఎక్కువ సంపాదనా పరులను, జీవితంలో అన్ని ఐశ్వర్యాలను అనుభవించే వాళ్ళనే వరిస్తుందని ఇప్పటి రిపోర్ట్. మంచి జీతంతో పనిచేసే ఉద్యోగులు, బాగా ధనవంతులు ఏడెనిమిది గంటల నిద్ర పోగలిగితే ఆదాయం లేని, పేదరికంతో బాధపడేవాళ్ళు అంత సుఖంగా ఏమీ నిద్రపోలేరంటున్నారు. పేదరికంతో ఇబ్బందులు, వాటి వల్ల ఆలోచనలు, అనారోగ్యాలు, చుట్టుముడతాయని, వాళ్ళ జీవితంలో సుఖ శాంతులకు అంత చోటేమీ వుండదని పరిశోధనా సారం. నిద్రలేమికి వేరే ఇతరత్రా అనారోగ్య కారణాలు తీసి పక్కన పెడితే సుఖ నిద్ర మాత్రం ఏ చీకుచింతా లేని వాళ్ళనే వరిస్తుందని పరిశోధకుల రిపోర్ట్ సమర్పించారు.

    చీకు చింత లేని వాళ్ళకే సుఖ నిద్ర

    ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అన్న సామెత తెలిసిందే. గాఢ నిద్ర కోసం విలాసవంతమైన పరుపులు అక్కర్లేదు, కష్ట జీవి అలసిపోయి పడుకొంటే నిద్ర…

  • ఇవే వత్తిడికి చెక్ పెట్టే పనులు

    ప్రతి రోజు చేయ వలసిన పనుల్లో ఎదో ఒక సమస్య తో వత్తిడి వేదిస్తుంది. చిన్ని చిన్ని చర్యల తో వత్తిని ఇట్టే తగ్గించ వచ్చు. కామెడీ …

  • వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో కధనమైన వ్యయామాలు అస్సలు చేయకుడదట అప్సెట్ అయ్యి వున్నప్పుడు, తట్టుకోలేని ఆగ్రహం వుపేస్తుంటే వ్యయామం మొదలు పెడితే హార్ట్ ఎటాక్ ప్రాబ్లం వస్తుందిట. ఎమోషనల్ స్ట్రెస్, ఆగ్రహం రక్త పోటును పెంచుతాయి. రక్త నాణాల్లో ఫ్లో మారడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పటికే ప్లెక్ తో ఆర్టరీ క్లాగ్ అయ్యి వుంటే రక్త సరఫరా బ్లాక్ అయ్యి వ్యయామం చేస్తుంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలుంటాయని నిపుణుల హెచ్చరిక. ముఖ్యంగా ఇలాంటి రిస్క్ సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు వుంటుంది. రక్త పోతూ స్థూలకాయం సమస్యలు ఇంకా పెంచుతాయి. కాబట్టి ఎలాంటి ఒత్తిడి కోపం లేనప్పుడే ప్రశాంతమైన మనస్సుతోనే వ్యయామాలు చేయాలి.

    ఒత్తిడి కోపం తో వ్యయామాలు వద్దు

    వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో…

  • కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు ఉంటే ఎలాంటి వత్తిడినైనా ఇట్టే అధిగమించ వచ్చు. ఆలోచనలు అదుపు చేయవచ్చు. ఉద్వేగాలని అపవచ్చు, ఒత్తిడి అనిపిస్తే రెండు నిమిషాల ప్రాణాయామం చాలు. బ్లాక్ టీ తాగితే ఇది వత్తిడిని పెంచే కర్టసాల్ హార్మోన్ పైన ప్రభావం చూపెడుతుందిట. బ్లాక్ టీ రోజుకు ఒక్క సరైనా తాగాలి. అలంటి నవ్వుకి ఏర్పడే ఎండార్ఫిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. నవ్వుకోసం నవోచ్చే పుస్తకాలు చుసినా సినిమా చూసినా, ఫ్రెండ్స్ తో నవ్వులలో మునిగి తేలిన ఎలాగైనా నవ్వాలి. అలాగే ఒక ఆత్మీయి స్పర్శే ఎంతో సేద తీరుస్తుంది. ఒక్క కౌగిలింత రక్త పోతూ ను తగ్గిస్తుంది, హార్మోన్ల హెచ్చు తగ్గులను అదుపు చేస్తుంది. కార్టిసాల్ ని నియంత్రిస్తుంది.

    ఆత్మీయి స్పర్శే మంచి మెడిసిన్

    కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు…

  • ఆఫీస్ పనితో చాలా ఉద్రిక్తత ఉంటుంది. పని వత్తిడి పై అధికారి అజమాయిషీ తోటి ఉద్యోగులతో ఇమడలేకపోవటం పని గంటలు ఏదైనా కావచ్చు. ఆ అసహనం ఇంటిదాకా టీయూస్కుపోతే నష్టమే అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఆ విసుగు కోపం ఇంటికి వెళ్ళగానే భాగస్వామి పైనో. పిల్లల పైనో వెళ్లగక్కితే ఇంకా ఇంటి వాతావరణం గందరగోళం అయిపోతుంది. అలా ఆఫీస్ సమస్యల్ని ఇంటివరకుతేకుండా చిన్న పరిష్కారం చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. రోజు కనీసం ఐదొందల కేలరీలు ఖర్చు చేసేలా ఎదో ఒక వ్యాయామం చేయగలిగితే ముందుగా మనసులో వత్తిడీ నిస్పృహ ఉండదంటున్నారు. రోజుకి ఎదో రకంగా పదివేల అడుగులు వేసి వేలకు నిద్ర పోకపోతే మనసు అలజడికి గురికాక తప్పదంటున్నారు. ఆఫీస్ లో వుండే ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కో గలిగే శక్తి సామర్ధ్యాలు వ్యాయామం యోగా వల్లనే సమకూరుతాయంటున్నారు . ఒకేసారి నడవటం కష్టం అయింది. మధ్యలో బ్రేక్ తీసుకుంటూ అయినా సరే నడవాలి. శరీరానికి కాస్త శ్రమ ఇవ్వాలి. అలాగే కోపమొచ్చినా అంతే. పని పక్కన బెట్టి కాసేపు బయటకివచ్చి నడవమంటున్నారు.

    కోపం విసుగు కు గొప్ప మందు

    ఆఫీస్ పనితో చాలా  ఉద్రిక్తత ఉంటుంది. పని వత్తిడి పై అధికారి అజమాయిషీ తోటి ఉద్యోగులతో ఇమడలేకపోవటం పని గంటలు ఏదైనా కావచ్చు. ఆ అసహనం ఇంటిదాకా…

  • కొందరు ఇంటికి రాగానే వార్తల్లో పడిపోతారు. నిమిష నిమిషం ప్రపంచపు నలుమూలల ఏం జరుగుతుందో తెలుసుకోవటం నూటికి 86 మంది చేసేపని. ఇది తప్పేంకాదు కానీ . ఆ వార్తల్లో టెన్షన్ తెచ్చే క్రీడలు ఆర్ధిక సంక్షోభాలు ప్రమాదాలు మరణాలు ఇలాంటివి రాత్రివేళ చూసి పడుకుంటే అది మెదడు కు విశ్రాంతి లేకుండా చేసి ఉదయం లేచేసరికి ఆందోళనగా ఉంటుంది. ఈ టెన్షన్ తో ఎదో ఒకటి అతిగా తినేస్తారని ఇది శరీరానికి అత్యధిక క్యాలరీలను మోస్తుందనీ డాక్టర్లు చెపుతున్నారు. కఠినమైన ప్రపంచంలో జీవిస్తున్నామన్న భావం మనుషుల్లో తెలియకుండానే కలుగుతుంది. వనరుల కొరత వస్తుందని ఆర్ధిక సంక్షోభం వస్తుందని మెదడు గుర్తించటంతో మనసు చిరుతిండ్ల వైపు లాగుతోందిట అంచేత వార్తల్లోనుంచి కాస్త బయటకు వచ్చి శాంతిగా ఓ సంగీతం వినటమే పుస్తకం చదవటమో చేయాలి.

    సంక్షోభిత వార్తల వల్ల ఆందోళన

    కొందరు ఇంటికి రాగానే వార్తల్లో పడిపోతారు. నిమిష  నిమిషం ప్రపంచపు నలుమూలల ఏం  జరుగుతుందో తెలుసుకోవటం నూటికి 86 మంది చేసేపని. ఇది తప్పేంకాదు కానీ .…

  • రిలాక్సింగ్ టెక్నీక్స్ చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె వాసన చాలా బావుంటాయి. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. నీళ్లలో కొన్నిచుక్కల లావెండర్ నూనె అరకప్పు ఎప్పంసాల్ట్ . కప్పు వంట సోడా కలిపి స్నానం చేయాలి. ఒక వేళ టబ్ లో స్నానం చేస్తే ఇవన్నీ కలిపి టబ్ లో పోసి ఆ నీళ్లలో సేద తీరితే ఇంకా మంచిది. ఒత్తిడీ అలసటా తగ్గిపోతుంది. ఇలాంటి స్నానాన్ని వారానికి రెండు సార్లు చేసినా చాలు. చర్మం ఆరోగ్యాంగా అయిపోతుంది. చెంచా దాల్చిన చెక్క పొడి చెంచా పసుపు కలిపిన నీళల్లో స్నానం చేసినా అలసట దూరం అవుతుంది. చర్మం తాజాగా మెరుస్తుంది. పసుపు లోని యాంటీ సెప్టిక్ గుణాలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి. స్నానం చేసే నీళ్లలో మూడు చెంచాల ఆలివ్ నూనె చెంచా ఎప్పమ్ సాల్ట్ కలపాలి. ఈ నూనె లో ఏ , డి , కె విటమిన్లు యాంటీ ఏజింగ్ కారకాలు చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. అలాగే ఆలివ్ నూనె ఎప్పమ్ సాల్ట్ లో కొద్దిగా చక్కెర కలిపి ముఖానికి చేతులకు మర్దన చేసుకున్నా మంచి ఫలితం వుంటుంది. గ్రీన్ టీ కూడా చర్మ ఆరోగ్యానికి మేలు. వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బాగ్స్ వుంచి ఆ నీళ్లలో స్నానం చేస్తే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి అంది ఒత్తిడి అలసట మాయం చేస్తాయి.

    అలసట పోగొట్టే స్నానం

    రిలాక్సింగ్ టెక్నీక్స్  చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే  స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె…

  • చైనా సంస్కృతి నుంచి వచ్చిన చికిత్స విధానం ఆక్యుపేజర్ శరీరం మరున్న భాగాల పైనచేతివేళ్ళ తో నెమ్మదిగా నొక్కటం వల్ల ఆ ప్రాంతలో పెట్టె ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వదిలించుకోవచ్చని ఆక్యుపేజర్ నిపుణులు చెపుతారు. ఆక్యుపేజర్ వెనక ఓ సిద్ధాంతం చెపుతున్నారు . మానవ శరీరంలో చి అనే శక్తి ప్రవహిస్తూ వుంటుంది. అటువంటి శక్తి ప్రవాహానికి ఏదైనా అడ్డుపడితే ఆనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఎపుడైతీ శక్తీ ప్రవాహం అడ్డుకోబడుతుందో ఆ ప్రదేశంలో వత్తిడి పెడితే ఆ శక్తి ప్రవాహం మళ్ళీ ప్రవహించటం మొదలవుతుంది. ఆక్యుపేజర్ లో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై బాధను తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. శరీరం పైన కీలకమైన ప్రదేశాలు గుర్తించి ఆ ప్రదేశం పైన తగిన విధంగా వత్తిడి పెట్టాలి. ఆ ఒత్తిడి ఏ స్థాయిలో వుండాలి ఎంతసేపు పెట్టాలి అన్నది శరీరం అనుభవిస్తున్న అసౌకర్యన్ని బట్టివుంటుంది. ఉదాహరణకు నిద్ర రాకపోతే కనుబొమ్మల మధ్య భాగంలో వేళ్ళలో వత్తిడి పెడితే మనసు తేలిక పది నిద్ర వస్తుంది. ఇది ట్రయ్ చేసి చూసి నిద్ర వస్తే అప్పుడు దీన్ని నమ్మి ఏదైనా సమస్య కోసం ఆక్యుప్రేజర్ స్పెషలిస్ట్ ని సంప్రదించండి.

    ఒత్తిడితో చికిత్స ఆక్యుపెజర్

    చైనా సంస్కృతి నుంచి వచ్చిన చికిత్స విధానం ఆక్యుపేజర్ శరీరం మరున్న భాగాల పైనచేతివేళ్ళ తో నెమ్మదిగా నొక్కటం వల్ల  ఆ ప్రాంతలో పెట్టె ఒత్తిడి వల్ల…

  • గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని మంచి వాతావరణం మంచి పరిసరాలు ఉండాలని మంచి పుస్తకాలూ చదువుకోవాలని మంచి సంగీతం వినాలని చెప్తుంటారు. వీటన్నింటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని వారి అభిప్రాయం. ఇటీవల పరిశోధనలు ప్రాచీన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. తల్లిలోని భావోద్వేగ సంబంధిత హార్మోన్లు బిడ్డకు ట్రాన్స్మిట్ కావటమే ఇందుకు కారణం గర్భంలో వున్నప్పుడు తల్లి తీవ్రమైన వత్తిడి ఎదుర్కుంటున్నట్లైతే ఆ బిడ్డలు హైపరాక్టీవ్ లేదా ఎమోషనల్ సమస్యలతో ఉంటారని సగటు ఐక్యూ కంటే తక్కువ కలిగి ఉంటారని అధ్యయనం లో పేర్కొన్నారు. కాబట్టి తల్లి ఎంత మానసిక ప్రశాంతతతో వుంటే బిడ్డకు అంత మంచిది.

    బిడ్డ పై తల్లి ప్రభావం

    గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం  ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని…

  • మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం శాతం, ఇష్టం ఇవన్నీ మన భాష లోనే తలిసిపోతాయి. మన మాటల్లో నిత్యం వండర్ ఫుల్, ఫ్రెండ్స్, బావున్నాం, బావున్నారా, సంతోషం, ఎంత చెక్కని పాట, ఎంత అందమైన ప్రకృతి వంటి భావజాలాలకు సంబందించిన మాతలుంటే మనం ఆశావాద దృక్పదంతో ఉన్నట్లు అర్ధం. అలా శాతంగా వుండే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు.

    శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

    మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో…

  • నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్దమైన తలనొప్పి నివారిణి. బెనుకులు రాకుండా ఆపుతుంది. మంచి మూడ్ లో ఉంచుతుంది. ఇన్ని మంచి లక్షణాలు వున్న నీటిని ప్రతి రోజు ఒకటి రెండు గ్లాసుల నీటిని తాగడం మొదలు పెట్టాలి. కావలసినంత నీరు వుంది. జీవనానికి నీరే మూలం. మన శరీర కండరాలలో 75 శాతం నీరే. పోషకాలను శరీరం అంతటికీ సరఫరా చేసే రక్తంలో 82 శాతం నీరే. నీటిని అపురుపంగా వినియోగించుకొండి.

    అపురూపమైన పానీయం నీరు

    నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు.…