• ఆహారాన్ని బట్టే చక్కని రూపం.

    ఎంతో మందిని చూడగానే సరైన తీరులో వంపు సొంపుల శరీరంతో చూడగానే ఆకట్టుకునే రీతిలో, హుండానంతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలా వున్న వాళ్ళు జిమ్లో గంటల…

  • శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా నొప్పులు ఎక్కువవుతాయి . కూర్చోవటం మెట్లెక్కటం కూడా చేయలేక పోతారు. పాలు జున్ను పుట్ట గొడుగులు ఆరెంజ్ జ్యూస్ పెరుగు గుడ్డు సోన వంటి వాటిలో డి విటమిన్ ఉంటుంది. అలాగే ఐరన్ లోపిస్తే రక్త హీనత వచ్చే ప్రమాదం వుంది . పాలకూర ఎర్ర కందిపప్పు ఓట్స్ చేపలు బీన్స్ నుంచి ఇనుమును అత్యధికంగా పొందవచ్చు. నిమ్మజాతి పండ్లు ఆకుకూరల తో విటమిన్ సి శరీరానికి లభిస్తుంది. మాంసకృతులు శరీరంలో కొత్త కణాల అభివృద్ధి కి తోడ్పడతాయి. గుడ్లు మాంసం నట్స్ డైరీ పదార్ధాల నుంచి మాంస కృతులు అందుతాయి. బరువు పెరుగుతామనే భయంతో కొవ్వుల్ని దగ్గరకు రానివ్వడు కానీ ప్రతిరోజు ఇరవై శాతం కేలరీలు కొవ్వుల నుంచే లభించాలి. విటమిన్ బి లోపిస్తే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుడ్లు పాలు బీన్స్ మాంసాహారం రోజు తీసుకోవాలి. ఇవన్నీ సరైన నిష్పత్తి లో అందితే శరీరంలో అందం ఆరోగ్యం రెండు భద్రంగా ఉంటాయి.

    వీటితో ఆరోగ్యం అందంరెండు భద్రం

    శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా…

  • మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇవి గోరువెచ్చగా ఉండేలా నిద్రకు ఉపక్రమించేముందర తీసుకోవాలి. అలాగే ఓట్ మీల్ వరి వంటి కార్బోహైడ్రేట్స్ తిన్నాక కూడా నిద్రవస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే పదార్ధం కండరాలకు రిలాక్స్ చేసి నిద్రను ఇస్తుంది. అలాగే విటమిన్ సి వుండే బొప్పాయి అనాస నిమ్మజాతి పండ్లు సెలెరియం ఎక్కువగా వుండే చేపలు బాదాం వంటి నట్స్ కూడా ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తాయి. బెడ్ రూమ్ నిశబ్ధంగా ప్రశాంతంగా వుంది. మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా ఉండాలి. ఎక్కువ వెలుగు లేకుండా ఉండాలి మసక చీకట్లో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతోంది.

    మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం

    మంచి నిద్రకు ఆహారానికీ  సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా…