• చక్కగా తయ్యారవ్వాలి తక్కువే తినాలి

    పనిచేస్తూ తినకండి. వేగంగా తినడం వల్ల సరిగా అరగదు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న ధ్యాసలేకపోవడం వల్ల ఎక్కువ కేలరీలు చేరతాయి. అందుకే ఎంత తొందర…

  • శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళ విషయం మరీ అధ్వాన్నం గా వుంటుంది. ఇంక ఇదే చింత అయితే ఒక చిన్న వ్యూహం పాటించ మంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు బరువు చూసుకుంటూ వుంటే కొన్నాళ్ళకు ఫలితం అర్ధం అయిపోతూ వుంటుంది.ప్రతి రోజు బరువు చూసుకుంటూ చార్ట్ పైన ఫలితాలు చెక్ చేసుకుంటూ వుంటే బరువు తగ్గే క్రమం లో ఫలితం బాగుంటుంది అంటున్నారు. ఇలా ప్రతి రోజు చెక్ చేసుకునే వాళ్ళు బరువు పెరగకుండా మెయిన్ టైన్ చేసుకో గలుగుతారు. అదే భోజనం విషయం లోను పరిపూర్ణ ఆరోగ్యం చూసుకోవాలని, ఆహార పానీయాలు సక్రమంగా అనుసరించ మంటున్నారు. తినే వాటిని సరిగ్గా ఎంచుకుని స్థిమితంగా భోజనం చేయాలని నిపుణులు చెప్పుతున్నారు.

    రోజు బరువు చెక్ చేసుకోవడం కరెక్ట్ పద్దతి

    శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక…

  • ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో అనారోగ్యాల బారిన పడి ఉన్నారని, ఒత్తిడితో గుండెపోటు తెచ్చుకునే వారి శాతం అధికంగా ఉందని తేలింది. అధ్యయనాన్ని విశ్లేషిస్తే చదువుకొన్నవారు మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడితే, ఇంటర్ లో ఆపేసిన వారిలో అభద్రతా భావం ఎక్కువగా ఉండటం, మంచి ఆహారం తీసుకునే అవకాశం లేకపోవడం, ఇక వైద్య భద్రత, కుటుంబ సంక్షేమం ఏదీ లేని కారణం గా ప్రతి చిన్న విషయానికీ ఒత్తిడి కి లోనయ్యారని తేలింది. తక్కువ చదువు, తక్కువ సంపాదన జీవితంలో అభద్రతకు దారి తీశాయని అధ్యయనాలు తేల్చాయి. అంటే చదువుకోవడం అన్ని విధాలా లాభదాయకం అని తేలింది. సో.. పిల్లల చదువు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలో అర్ధం చేసుకోవచ్చు.

    చదువు తోనే ఆరోగ్యం

    ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా.…