Saturday, 28 Nov, 2026

నిశ్చింత గా తినేయొచ్చు

చింతపండంటే పళ్ళు జివ్వుమనేంతగా చూడకుండానే అనిపిస్తుంది కదా, కనీ ధాయ్ లాండ్ చింతకాయలు ప్యాక్ చేసి చేసి వస్తున్నాయి. అవి తియ్యగా ఉన్నాయి. వీటితో అక్కడ క్యాండిలు, మిటాయిలు తయ్యారు చేస్తారట. మనకైతే చింతపండు లేని వంటకం అసాధ్యం సాంబారు, చారు, పులిహోర, నిల్వ పచ్చళ్ళు అన్ని చింతపండు మయం. చింత చిగురు పప్పు, పచ్చడి నోరురిపోయెంత రుచి. సైనస్ వున్న వాళ్ళు, గ్యాస్ ట్రబుల్  వున్న వాళ్ళకి చింతపండు బదులు టొమాటో, నిమ్మ, వాడమంటారు కానీ […]

ఎవ్వరితోనూ పోచుకోవద్దు

నిహారికా , అందమైన రోల్స్ మోడల్స్ ఉంటారు. నాజూగ్గా అందంగా హుషారుగా ఉత్సాహంగా ….! అలా ఎప్పుడూ వాళ్ళని చూస్తూ వాళ్ళు మాత్రమే అలా ఉండాలి అనుకుంటే అన్యాయం. వీళ్ళు అలా  ఎలా ఉండగలిగారు మనకు స్పష్టమైన అవగాహన ఉంటే మనకు అలాగే వున్నామని తెలుస్తుంది. ఎలాగంటే ఎవరికి వాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. కొందరి కళ్ళు బావుంటాయి . కొందరు బాగా మాట్లాడతారు కొందరు బాగా చదువుతారు. ఇవన్నీ మనిషిలో అందం కంటే ఎక్కువైనవి . వీటికి […]

వయసుని బట్టి అంచనా వేసుకోండి

సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల  కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో  బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు […]

ఈ పరిమళాలు బావుంటాయి

సెంట్లు పెర్ ఫ్యూమ్స్ వాడటం కామనే. ఏదైనా వేడుక కోసం బయటకు వెళ్ళేటప్పుడు అలంకరణ తర్వాత ఎదో మంచి పరిమళం రావాలనే ఉద్ద్యేశంతో రకరకాల సెంట్లు ట్రై చేస్తాం. ఇప్పుడు ఎక్స్ పెర్ట్లు ఇలా పార్టీలకు పెళ్లిళ్లకు వెళ్ళేటప్పుడు నిమ్మ గుణాలున్న సెంట్ ఎంచుకోమంటున్నారు. ఈ  సిట్రస్ పరిమళంతో నిమ్మ నారింజ ద్రాక్ష ను గుణాలు ఉంటాయి. ఏ షాపింగ్ కు వెళుతుంటే కూడా ఎక్కువసేపు తిరిగినా ఈ పరిమళం చుట్టుముట్టే ఉంటుంది. అలాగే గంధపు చెక్కతో […]

పోషకాల నిలయం మష్రూమ్స్

చాలామందికి మష్రూమ్స్ నచ్చవు గానీ ఇవి అపారమైన పోషక విలువలకు ఆధారం. వీటిల్లో హెపటో ప్రొటెక్టివ్ కార్డియో యాంటీవైరల్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కాన్సర్ యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలున్నాయి. కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు తక్కువగా ఫైబర్ పాళ్ళు ఎక్కువగా ప్రోటీన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి . రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటానికి ఈ పోషకాలు ఎంతో ఉపకరిస్తాయి. అర కప్పు ఉడికించిన మష్రూమ్స్ 20 గ్రాముల క్యాలరీలు 1. 7 గ్రాముల ప్రోటీన్స్ 17 […]

హార్మోన్ల స్థాయిల్ని బట్టే ఈ ప్రాబ్లమ్

ఎలాంటి విపత్కరమైన సమయంలో నైనా మహిళలు చాలా మంది డెసిషన్స్ అతివేగంగా తీసుకోగలుగుతారు. సమస్యని పరిష్కరించుకోవటంలో చురుగ్గా వుంటారు . ఏ నిర్ణయాన్నైనా తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలిగే శక్తీ గలవాళ్ళు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకిలా జరిగిందీ మైండ్ బ్లాంక్ గా అయిపోతుంది అని కన్ఫ్యూజ్ అవుతారు , ఎక్సపర్స్ ఎంచెపుతున్నారంటే రుతుక్రమ సమయాల్లో వారిలో వచ్చే  మార్పులే ఇందుకు కారణం అంటారు . సమస్యలు పరిష్కరించుకోవటంలో వాళ్ళ దృక్పధాన్ని ఈ మార్పులు […]

సామాజికంగా చురుగ్గా ఉంటేనే ఆరోగ్యం

అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ అద్భుతమైన ప్రకృతి ఎప్పుడూ వంటరిగా ఎడారిలో మొలిచే జిల్లేడు మొక్కలా వంటరిగా ఉండదు. అలాగే చుక్క నీళ్లు పడని  ఎడారిలో కూడా అందుకు తట్టుకు బతికే చెట్లుంటాయి. ఇంత పచ్చ దనం  ఇంతటి అందం మానవసమూహాల్లో ఉంటుంది. చాలా మంది కలిసిన చోట ఎంతో సందడి స్నేహం మాట […]

తెలుసుకోవాల్సిన విషయాలెన్నో

తెలిసినా పట్టించుకోని తెలుసుకుని తీరవలసిన చిన్న చిన్న విషయాల వల్ల  పెద్ద చర్యలు చేపట్టే వీలుంటుంది. బాగా అలసిపోతే శరీరం శక్తీ సన్నగిల్లి పోతే ఓ కప్పు ఎనర్జీ డ్రింక్ తాగాలని అనుకుంటారు కానీ ఒక్క అరటిపండు చక్కని వర్కవుట్ ఇంధనం ,ఎనర్జీ డ్రింక్ తాగినా పదిహేను నిమిషాలోకసారి మంచి నీళ్లు తాగినా అదే ఫలితం. గ్లూకోజ్ స్థాయిలు అంటే ఎనర్జీ స్టోర్స్ రెండింటికీ ఒకే మాదిరి ఉంటాయి . ఒక్క అరటిపండులా కార్బోహైడ్రేట్స్  పొటాషియం విటమిన్లు […]

వంటిల్లే ఒక మందుల పెట్టె

పార్శ్యపు నొప్పి చాలా మందిని వేదించే సమస్య చిరాగ్గా అసహనంగా ఏ పని చేయనీక వికారపెట్టి విసిగిస్తూ ఉంటుంది. ఎంతో ఖరీదైన నెప్పి ఉపశమన మాత్రలు వాడుతూ వుంటారు. ఈ నొప్పి నివారణ మాత్రలు కూడా ఒక్కసారి అలవాటై పనిచేయకుండా పోతాయి కూడా. కొన్ని ఇంటి వడియాలు కూడా వాడితే కొంత ఉపశమనం పొందే  అవకాశం వుంది. రాళ్ళుప్పు  నిప్పచెక్క నిమ్మరసం తీసుకోవాలి. నాణ్యమైన ఉప్పు  కావాలి. దీనిలోనే ఖనిజాలు రోగనిరోధక శక్తి ని దృఢం చేస్తాయి. […]

40 దాటితే ఎత్తు తగ్గిపోతారు

నలభై ఏళ్ళు దాటుతుంటే చాలా మంది కొద్దిగా ఎత్తు తగ్గుతారు అంటే ఆశ్చర్యంగా వుంటుంది కదూ. నిజంగానే తగ్గుతుంటారు టిస్యూల మాస్  ఎముకల సాంత్రత  పోవటంలో ఆ లాస్ ఎక్కువగా వెన్నుముక్కలో కనిపిస్తుంది. అందుకే వ్యాయామాలు చేయండి. వెన్ను ను బలంగా ఉంచుకోండి  పోశ్చర్ ను కుదురుగా నిటారుగా ఉండేట్లు కూర్చోవడం నడవటం చేయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే వెన్నుకు కుషన్ గా వుండే డిస్క్ లు ఎత్తు తగ్గుతాయి. అంటే కొన్నాళ్ళు తలగడలు వాడితే అవి […]

మనస్సుకి కట్టలు వేస్తే విజయం తధ్యం

నీహారికా , సక్సెస్ కీ ఫెయిల్యూర్స్ కి ప్రత్యేకమైన కోణాలు ఉంటాయా ? అన్నావు. ఉంటుంది. అత్యంత ముఖ్యమైంది కార్యాచరణ. దాని ఫలితంగానే విజయమైన అపజయమైన మనం ఫలితం వైపే చూస్తాము కానీ అసలా పని ఎంత బాగా చేసాం దానికి విజయం సాధించే బలం వుందా లేదా అని ఆత్మ విమర్శ ముందే చేసుకొం. అసలు చేసే పని పట్ల శ్రద్ధ  మొత్తం పెట్టేస్తే అప్పుడు ఫలితం విజయం వైపే ఉంటుంది. శరీరం ఒక టూల్ […]

అపూర్వమైన వర్ణాలతో దారపు నగలు

ఇజ్రాయిల్ కు చెందిన డోరీ సీసెరా అన్నావిడ సీటెచ్  బ్రెయిడ్ దారంతో ఎంబ్రాయిడరీ నగలు సృష్టించి మ్యూజియంలో గ్యాలరీలో డిస్ప్లేచేసిందిట. అలా అవన్నీ ఆన్ లైన్ లోంచి అందరి దగ్గరకు చేరాయి. చెవిపోగులు నెక్లెస్ లు పెండెంట్లు ఇలా ఎన్నోరకాల సీటెచ్  దారంతో ఎంబ్రాయిడరీ పద్దతి తో రకరకాల పూసలు రాళ్ళూ గుచ్చి  రత్నాభరణాలంత భారీగా రూపం దిద్దుకుని వస్తున్నాయి . ఇది సాధారణంగా దుస్తుల ఎంబ్రాయిడరీ పద్ధతి. రెండుమూడు రంగుల దారాల్ని  పక్కపక్కన పేర్చి  కావాల్సిన […]

గోళ్ళ ఆరోగ్యం కోసం వంటింటి చిట్కాలు

చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో గోళ్లకు మర్దనా చేసి చేతులకు గ్లౌజ్ లు వేసుకుని నిద్రపోతే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినూనె తేనే సమపాళ్లలో తీసుకుని సన్నటి సెగ పైన ఉంచితే ఈ మిశ్రమం చక్కగా అవుతుంది. ఇది ఓ కప్పులోకి తీసుకుని గోళ్ళను అందులో ముంచి ఓ పావు గంట పాటు అలాగే […]

మనసు దోచే బహుమతులు

మనకి చాలామంది పైన ఇష్టం ఉంటుంది గౌరవం ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎక్సప్రెస్ చేసే పద్ధతులు చాలా వచ్చాయి. పర్సనలైజ్ గిఫ్టులు  చూడండి. ఒక త్రీడీ క్రిస్టల్ క్యూబ్ లో మనం ఇష్టపడే వ్యక్తి బొమ్మ చేస్తారు. ఇలాంటి కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ బహుమతుల నమూనాలని ఎన్నో సైట్స్ లో ఇమేజ్లను చూడచ్చు. మనం ఇవ్వాలనుకున్న బహుమతులు నచ్చిన డిజైన్ అందులో రాయవలిసిన కొటేషన్ ఫోటోని ఇస్తే చాలు. దాన్ని అలాగే ముద్రించి ఇచ్చేస్తారు . ఒక ఈవెంట్ […]

కూరగాయల్లో కీరాది నాలుగో స్థానం

కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది. బి విటమిన్ మెండుగా వుండే కీరా దోస తక్షణ శక్తీ కరకం. 95 శాతం నీరే. చర్మం శిరోజాల రక్షణకు ఇది ఔషధం. కళ్ళ కింద నల్లని వలయాలు ముడతలు కీరా దోస గుజ్జు అప్లయ్  చేస్తే పోతాయి. ఇందులో వుండే సిలికాన్ సల్ఫర్ లు జుట్టు పెరుగుదలను […]

బీట్ రూట్ పూతతో గులాబీ రేకుల అందం

బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని గుజ్జుగా చేసి అందులో నాలుగు చుక్కల బాదం నూనె చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం నిగారింపుగా ఉంటుంది. బీట్ రూట్ గుజ్జులో రెండు స్పూన్ల ముల్తానీ నత్తి చెంచా నిమ్మ రసం కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవచ్చు, అరకప్పి […]

జ్ఞాపక శక్తి పెంచే ఫిట్ నెస్

గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల  పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా ప్రవర్తించటానికి కారణాలంటారు. హైస్కూల్ చదువుల సమయానికి పిల్లలపై అంతులేని చదువు బాధ్యత ఉంటోంది. మిగిలిన కాస్తో కూస్తో టైం సహజంగా ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. నిద్ర వేళలు తగ్గిపోతున్నాయి. విశ్రాంతి సమయం కూడా తగ్గుతోంది. పిల్లల్ని శారీరిక ఫిట్ నెస్ వైపుగా ప్రోత్సహించమంటున్నాయి. అధ్యయనాలు. అప్పుడే వారి […]

టాక్ థెరపీ పిల్లల అనారోగ్యాలు మాయం

పిల్లలెప్పుడు ఎదో ఒక కంప్లైంట్ చెపుతూనే ఉంటారు. కడుపు నొప్పినో ఇంకేదో ఇందుకు ఫలానా కారణం అంటూ ఉండదు. డాక్టర్లు కూడా ఒక్కసారి ఏవీ లేదనే అంటారు. కానీ ఇలాంటి సమస్యలన్నీ స్పీచ్ థెరపీ తో పోతాయంటున్నారు అధ్యయనాలు. ఈ పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే కాగ్నిటివ్ బిహేవియర్ ధెరపీ ప్రతిభావంతంగా పనిచేస్తుందని ఈ థెరపీ లో పిల్లల ఒత్తిడి ప్రతి స్పందనలకు క్రమ బద్దీకరించగలిగే టెక్నీక్స్ బోధిస్తారని ఇవి పిలల్ల సమస్యలను ఒక దారికి తెస్తాయంటున్నారు. ధెరపిస్ట్ […]

పంటి ఆరోగ్యం చాలా ముఖ్యం

పళ్ళు తెల్లగా మిలమిలా మెరిసిపోవాలంటే డెయిలీ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే పళ్ళు సహజంగానే శుభ్రపడతాయి. సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల పైన ఎలాంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి . స్ట్రాబెర్రీ కివి వంటి పండ్లు మరీ మంచివి . పాల ఉతప్తులు దంత క్షయాన్ని తగ్గిస్తాయి. ఎనామిల్ కు రక్షణ కల్పించటంలో బలోపేతం చేయటంలో హార్డ్ చీజ్ ఎంతో […]