Wednesday, 22 Jul, 2026

వ్యక్తిగత పరిశుభ్రతే పరిష్కారం

అమ్మాయిలు మహిళలు కూడా సాధారణంగా ఎదుర్కునే సమస్యల్లో మూత్ర నాళ  ఇన్ఫెక్షన్ ముఖ్యం. వైద్యుల్ని సంప్రదించినా రోజువారీ కొంత పర్సనల్ శ్రద్ధ  తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా  బయట పడవచ్చు. ఆఫిసుల్లో పనిచేయటం మొదలుపెట్టాక మొదటిగా చాలా సేపు బాత్ రూమ్ వైపు వెళ్లకుండా ఉండటం ఆడవాళ్ళూ చేసే తప్పుల్లో మొదటిది. దీనివల్లే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మూత్రం రంగు మారితే మంచినీళ్లు ఎక్కువ తాగటం పండ్ల రసం లేదా నీటి శాతం ఎక్కువ వున్న పండ్లు […]

తియ్యని నారింజ లో ఉపయోగాలనేకం

ఇప్పుడు నారింజ పండ్లు బాగా దొరికే రోజులు. ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ వదులుకుంటే ఇంకోసారి వెంటనే దొరకవు కదా . అలాగే చాలా త్వరలో మామిడిపండ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ తియ్యని నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్  మేగ్నేషియం సోడియం తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ పండ్ల లో నీటి శాతం ఎక్కువ. నోటి దుర్వాసన పోగొట్టే గుణం ఈ […]

ఫోన్ కాస్సేపు ఆపండి బాబూ

టెక్సాస్ లోని ఓ డే కేర్ సెంటర్ దగ్గర గెట్ ఆఫ్ యువర్ ఫోన్ అని ఒక నోట్ అంటించారట. ఆడే కేర్ సెంటర్ నుంచి పిల్లలను తీసుకుపోవడానికి వచ్చే పేరెంట్స్ అందరిచేతుల్లో ఫోన్లే . ఆ బిజీ గా  మాట్లాడటం  పిల్లలను మెకానికల్ గా ఎదో వస్తువుల్ని కలెక్ట్ చేసుకున్నట్లు తీసుకుపోవటం చూసి వళ్ళు మండి  వర్కింగ్ పేరెంట్లు స్మార్ట్ గా వుండే అమ్మానాన్నలు మీ పిల్లల కోసం ఆ ఫోన్ లు కాసేపు అవతల […]

పుట్టబోయే శిశువు ఆరోగ్యం వీటితోనే

ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం  బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం  చాలా అవసరం పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆహారంలో ఉండే ఐరన్  గర్భశక్తి  శిశువు ఆరోగ్య వృద్ధికి రోగ నిరోధిక శక్తి  పెంచేందుకు సాయపడుతుంది. అలాగే నిద్ద రక్త కణాల  వృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. విటమిన్ బి – 12 తో శిశువు శరీరంలో కొత్త కణాలు […]

పాడుకుంటుంటే కునుకు పడుతుంది

నిద్ర పట్టకపోవటం గురించి ఎవరైనా పదే పదే  చెపుతుంటే మరీ అంత సమస్య నా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చిరాకు పెట్టె ఇబ్బంది.  రాత్రివేళ కూడా మనకు ప్రశాంతంగా ఆలోచనలు లేకుండా ఉండలేక పోతున్నామని ఆందోళన భావోద్వేగ పూరితమైన ఆలోచనలు వదలటం లేదనీ నిద్రలేమితో బాధపడేవారు అనేకమంది చెపుతారు. నిద్ర పట్టటం లేదని మనసుకు అనిపిస్తే నిద్రపోలేక పోతున్నామనే  ఆలోచన ఆందోళనగా మారే పరిస్థితి ఇంకా పాడైపోతుంది. అయితే ఇలాంటి ఆలోచనలు మనసులోకి రాకుండా శ్రద్ధగా […]

తోలి సంధ్య వేళలో

అర్ధరాత్రి దాకా టీవీ చూస్తూ కంప్యూటర్లు ముందర కూర్చుని తెల్లవారి నిద్రలేవకుండా పడుకోవటం చాలా మందికి అలవాటు. అయితే ఇలా చేస్తూ ఉదయపు ప్రయోజనాలు మిస్ అవుతున్నావంటారు. డాక్టర్లు. ఉదయపు వేళ వ్యాయామఫలితాలు ఎక్కువగా ఉంటాయి. యోగా కి ఉదయపు వేళలో ప్రశాంతమైన సమయం ఆసనాలు వేసినా జాగింగ్ బ్రిస్క్ వాక్ వాకింగ్ ఏది చేసినా ఆరోజుకి సరిపడా ఉత్పాదక శక్తీ పెరుగుతుంది. జీవక్రియ స్థాయిలు పెరుగుతాయి. హడావుడి గా పరుగులు తీస్తూ చేసుకునేవాళ్ళు పిల్లల అల్లరి […]

అన్నింటా శ్రద్ధ ఉండాల్సిందే

సాధారణంగా బయటకు వెళుతూ ఉంటే బ్యాగ్ లో వెట్ వైప్స్ శ్రద్ధగా  పట్టుకుపోతాం. ఈ ముఖం తుడుచుకుని తడి టిస్యూలు మంచివే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటురు ఎక్స్ పెర్ట్స్. సాయంత్రం వరకు ఎండ లో బయట గడప వలసి వస్తే మధ్య మధ్యలో ఈ టిస్యూ పేపర్ తో ముఖం తుడుస్తాం  కదా. కానీ వీటితో గట్టిగ అదిమిపట్టి తుడుచుకోకూడదు . సున్నితంగా ముఖం అడుగు నుంచి పైకి తుడుచుకోవాలి. ముఖం నిండా మొటిమలు ఉంటె […]

ఎర్రని ఏ పండుచేసే మేలు అంతా ఇంతా కాదు.

ఎరెర్రని  పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. మెదడు ఆర్టరీ బ్యాక్తీరియా స్ట్రోక్ అవకాశాలు తగ్గించటంలో టమాటో  ఎంతగానో సహకరిస్తుందని న్యూరాలజీ విభాగ పరిశోధనల్లో గుర్తించారు. టొమాటోలకు ఎర్ర రంగును ఇచ్చే లికోపేసే  అనే కెరోటినాయిడ్ శక్తీవంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికర ప్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ లికో పేసే  ని […]

సువాసనలు పర్సనాలిటీ ఎక్స్ టెన్షన్లు.

ఎక్కువసేపు పరిమళాలు ఉండే పెర్ఫ్యూమ్ ని ఎంచుకోవటం పెద్ద కష్టం కాదు కానీ మనకు సూటయ్యే దాన్ని ఎంచుకోవటం దగ్గరే కాస్త జాగ్రత్త అవసరం. సరైన దుస్తులు ఎంచుకోవటం  ఎంత కష్టమై సరైన పరిమళం ఎంచుకోవటం లోను శ్రద్ధ  తీసుకోవాలి . సువాసనలు పర్సనాలిటీ కి ఎక్స్ టెన్షన్ల లాంటివి. సందర్భానికి తగిన పెర్ ఫ్యూమ్ ఉండాలి. బిజినెస్ మీటింగ్స్ ఆఫీస్ ఇల్లు సువాసన. సహజంగా తాజా పువ్వుల సిబ్రిన్  ఊడీ ఓరియంటల్ పరిమళాలు ఇష్టపడతారు. మంచి […]

కొన్ని ప్రాధమిక సూత్రాలతోనే ఫిట్ నెస్

నైట్ జాబ్స్ వచ్చాక పగటి నిద్ర అవసరమై ఆడపిల్లలు 30 ఏళ్ళుదాటేసరికే  పొట్ట బరువు పెరుగుతున్నారు. ఇక బయటి భోజనాలు ఏటా తప్పవు గనుక సమస్య ఎదురుగ వచ్చి నిలబడుతోంది . ఫిట్ నెస్ సెంటర్ కు వెళ్లాలంటే ఎన్నో ప్యాకేజీలు. ఏది ఎంచుకోవాలి. అన్న సందేహం వచ్చినప్పుడు ముందర ఆ ప్యాకేజీ బరువు తగ్గటం అన్న ప్రధాన లక్ష్యంతో ఉండాలి. వెళ్లే ముందే ప్రాధమిక ఆరోగ్య అంచనాలు ముఖ్యం. కార్బోహైడ్రాట్స్ తగ్గించుకోవటం వేపుడు పదార్ధాలు మానేయటం […]

మహిళా సంక్షేమానికి పెద్ద పీట

ఈసారి బడ్జెట్ లో మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కేటాయింపులున్నాయి. మహిళా శిశు సంక్షేమ పధకాల కోసం 1.86 లక్షల కోట్లు కేటాయించారు. అదే గత సంవత్సరం 1. 56 లక్షల కోట్లు గర్భిణుల పాలిచ్చే తల్లులకు ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగా యోజన పధకానికి 21000 కోట్లు కేటాయించారు. 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు గ్రామాల్లో మహిళా శక్తీ ఆరేళ్ళ లోపు వయసుగల పిలల్లకు 15,245 కోట్లు కేటాయింపు జరిగింది. మహిళా శిశు సంక్షేమం కోసం […]

బెస్ట్ ఫుడ్ బెల్ పెప్పెర్స్

బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన  వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా  . అవి ఇలా పిలుస్తారు. ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో మనకు దొరికే ఇవి పుష్కలమైన పోషకాల నిలయం విటమిన్ ఏ , సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ బి6 అధికంగా వుండే పీచు ఇది ఖచ్చితమైన లోఫ్యాట్ పదార్ధం. జీవక్రియ ప్రక్రియను పెంచి కొవ్వు కరిగించే ఈ […]

కొవ్వు పెంచుతుందన్న అపోహ

ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ […]

ఆకలికి చెక్ పెట్టె నట్స్

కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ ఉండదు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్. ఇది కడుపులో గడబిడచేసి తిండికోసం వెతుక్కునేలా చేసే హార్మోన్. దీని ప్రభావానికి విరుగుడు నట్స్  అని చెపుతున్నారు. గుప్పెడు నట్స్ తింటే ఘెర్లిన్  హార్మోన్ స్థాయి పడిపోతుంది. ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటే అర్ధం లేని ఆకలికి తావుండదు. అంటారు ఆరోగ్య […]

చీపనుకుంటాం కానీ ఇవే బెస్ట్

సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది ఖరీదినదైతేనే బాగా పనిచేస్తుందనో మన్నికగా వుంటుందనో  అనుకుంటాం. కానీ ఎంతో ఖరీదైన విదేశీయ పండ్ల కంటే కాపు జామపండు ముక్కల్లో 112 కేలరీలు వుంటాయని రోజుకు సరిపడా  పీచు అందులో ఉంటుందనీ సహక చక్కెర  తో ఉండటం తో కడుపు నిండిన భావన కలుగుతుందనీ డైటింగ్ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్ పెర్ట్స్ చెపుతున్నారు. అలాగే దాల్చిన చెక్క పొడిని పాలల్లో కానీ […]

అండం విడుదల చెప్పే బ్రాస్ లెట్

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో అది జీవితాల్లోకి ఎలా వచ్చేసి కూర్చుందో చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది . ఇప్పుడు అవా యాప్ తీసుకుంటే ఇది మహిళల రుతుచక్రాన్ని  అందం విడుదలయ్యే సమయాన్ని తెలియజేస్తుంది. పిల్లలు వద్దనుకునేవారికి అనుకూల సమయం ఎదో, వద్దనుకునేవారు లైంగిక చర్యలు దూరంగా వుండాలో  కూడా తెలియజేస్తుంది. రాత్రివేళ ఈ అవా బ్రాస్లెట్ పెట్టుకుంటే చాలు. ఈ అవా ట్రాకర్ గడియారంలాగా ఉంటుంది. ఈ ట్రాకర్ మొబైల్ యాప్ తో అనుసంధానం చేసుకుంటే […]

నష్టపోయేది అన్నింటా ఆడవాళ్లే

చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి ఎంతో కష్టం అనిపిస్తోంది. ఇంట్లో ఎవరికైనా అంటే డెమెన్షియా అంటే మతిమరుపు రావటం వంటి లేదా దీర్ఘ కాలం మంచంలో ఉండే జబ్బులొస్తే వాళ్ళ బాధ్యత సాధారణంగా  ఇంట్లో భార్య పైనే పడుతుంది. భర్తకు డెమెన్షియా వస్తే  జాగ్రత్తగా చూసుకునే బాధ్యత భార్యదే నని  బంధువులు మిత్రులు భావిస్తారు. భర్త పైన ఎంతో జాలి చూపెడతారు. అసలు రోగికన్నా  రోగికి సహాయంగా ఉండేవాళ్ళకే […]

ఈ సురక్షిత సాధారణ సూత్రాలు పాటించాలి

మొదటి సారిగా గర్భం ధరిస్తే కొన్ని సురక్షిత సాధారణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడూ కూడా ఏ సమస్యకు సొంతంగా మందులు వాడక పోవటం తోలి సూచన. మందుల షాపులో అడిగి తీసుకోవటం సొంతంగా నిర్ణయించుకోవటం కఠిన సౌందర్య చికిత్సలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపెడతాయి. గర్భం దాల్చక యాంటాసిడ్స్ పారాసెటమాల్ మొదలైనవి కూడా వైద్యుల సలహా లేకుండా వాడద్దు.మొటిమలు ఇతర చర్మ సంబంధిత సమస్యలకు క్రీమ్స్. అప్లయ్  చేయరాదు. విటమిన్లు ఐరన్  డోస్ లు వికారంగా […]

ఎక్కువ సేపు కూర్చుంటే వృధాప్యం

నడవకపోతే తప్పు వ్యాయామం చేయకపోతే నష్టం చివరకు  కాస్సేపు కూర్చున్నా కష్టమే అంటే నిజంగా కష్టం. ముఖ్యంగా ఆడవాళ్ళూ పదిగంటల కంటే ఎక్కువగా కదలకుండా కూర్చుని పనిచేస్తే శరీర కణాలు జీవపరంగా ఎనిమిది సంవత్సరాల ముందుగా వృధాప్య లక్షణాలకు లోనవుతారని రిపోర్ట్. కదలకుండా ఎక్కువసేపు కూర్చున్నా స్త్రీల డి .ఎన్ .ఏ  పోచలా చివర వుండే టెలోమెర్స్. పొడవు తగ్గిపోతుందని  గుర్తించారు. వీటి పొడవు తగ్గటం అంటే వృధాప్యం రావటం అని అర్ధంట. ఊబకాయం  , మధుమేహం […]