• అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా, కీరా బాగా తినాలి. తినవలసిన పదార్ధాల లిస్టు తాసుకుంటే ఏది ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఆలోచించవచ్చు. సొరకాయ మంచింది. రక్తం శుద్ధి చేస్తుంది. నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, మజ్జిగ తీసుకోవాలి. పుచ్చకాయ చర్మ రక్షణకు, జీర్ణ క్రియకు సహకరిస్తుంది. పుదినా, కొత్తిమీర, నిమ్మరసం ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇక మామిడి కాయ సరేసరి. బార్లీ నీళ్ళు ఈ సీసన్ మొత్తం తాగడం మంచిదే. చల్లగా శీతల పానియాల జోలికి వెళ్ళే బదులు ఈ బార్లీ, నిమ్మరసం, పుచ్చకాయ జ్యూస్ ఇవి సేఫ్ కదా!

    ఈ సీజన్ వీటితోనే గడుస్తుంది

    అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా,…

  • చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో పాటు కీలకమైన కొన్ని పోషకాలు పోతాయి. సోడియం పొటాషియం వంటివి శరీరం కోల్పోతుంది. వీటి పని శరీరంలో జీవక్రియలు తిన్నగా జరిగేలా చూడటం. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకుంటే నిస్సత్తువ లేకుండా వుంటుంది. అన్నం, చపాతిలు తేలికగా అరిగే ఆకుకూరలు, తాజాగా వుండే మాంసాహార పదార్ధాలు మంచివే. పళ్ళ రసం, చెరుకు రసం ఇవి కూడా తీయగానే తగేయడం ఉత్తమం.

    ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ

    చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే…

  • ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు పోతుంది. అదే డిహైడ్రేషన్ కు కారణం అందుకే బార్లీ, సబ్జా నీళ్ళు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, చెక్కర కలపని పండ్ల రసాలు, మజ్జిగా తాగాలి. వీలైనంత వరకు మసాలాలు, బయటి ఆహారం వద్దు. ఉదయము, సాయంత్రము అరగంట పాటు నాననిచ్చి తీరాలి. యోగా కూడా మంచిదే. అప్పుడే జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. అధిక బరువు అదుపులో వుంటుంది. ఇంట్లో వున్న బయటకి వెళ్ళినా తెలుపు తో పాటు రంగు దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చేనేత రకాలైన నులు, భారీ లెనిన్ వస్త్రాలే చాలా మంచివి. చెప్పులు కూడా పాదాలకు గాలి తగిలే విధంగా వుండాలి. సూర్య కాంతి నేరుగా కళ్ళకు తగలకుండా కళ్ళద్దాలు వేసుకోవాలి.

    బార్లీ, సబ్జా నీళ్ళు మరువకండి

    ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం  వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు…