• గోళ్ళకు బలం.

    రకరకాల రంగులు డిజైన్లు  చేయడం లో గోళ్ళ బలహీన పడి విరిగిపోతూ ఉంటాయి. గోళ్ళకు బలంకోసం క్యుటికల్ కమ్ నెయిల్ గ్రోత్ క్రీమ్స్ వాడచ్చు. వీటిలో సెరమైడ్స్ …

  • గోళ్ళకు పోషణ అవసరం.

    గోళ్ళకు నెప్పి వుండదు కానీ అవీ శరీరంలో భాగమే కనుక గోళ్ళ ఆరోగ్యం కోసం కూడా ద్రుష్టి పెట్టాలి గొల్లకు సౌందర్య పోషణ తో పాటు చిగుళ్ళ…

  • చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో గోళ్లకు మర్దనా చేసి చేతులకు గ్లౌజ్ లు వేసుకుని నిద్రపోతే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినూనె తేనే సమపాళ్లలో తీసుకుని సన్నటి సెగ పైన ఉంచితే ఈ మిశ్రమం చక్కగా అవుతుంది. ఇది ఓ కప్పులోకి తీసుకుని గోళ్ళను అందులో ముంచి ఓ పావు గంట పాటు అలాగే ఆ మిశ్రమంలో వుంచగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. వారానికి రెండు సార్లు ఇలా చేసినా గోళ్లు బలంగా ఉంటాయి. గోళ్లకు నారింజ రసం కూడా మంచిదే. రసం ముంచి గోళ్లను కాస్సేపు ఆలా వదిలేసి కడిగేస్తే చాలు. పొడిగా అనిపిస్తే మాయిశ్చరైజర్ రాయాలి. ఆలివ్ నూనె నిమ్మరసం మిశ్రమంలో గోళ్లు ముంచి పదినిముషాలు తర్వాత కడిగేస్తే గోళ్లు పెళుసు బారిపోకుండా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన లో ఆలివ్ ఆయిల్ నిమ్మరసం కలిపి వేళ్ళను అందులోవుంచి మేనిక్యూర్ చేసుకుంటే గోళ్లు శుభ్రంగా ఉంటాయి. గోళ్ళ చుట్టూ ఉన్న చర్మం సాగిపోకుండా టైట్ గా ఉంటుంది.

    గోళ్ళ ఆరోగ్యం కోసం వంటింటి చిట్కాలు

    చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో…

  • పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే కాలిగోళ్ళు మూలల్లో విరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల ఇన్ గ్రోన్ నెయిల్స్ వచ్చే అవకాశం వుంది గోళ్లు కొంచెం పెరగగానే కట్ చేసేస్తూ ఉండాలి.లేకపోతే దేనికోదాని తగిలి గాయపడతాయి. అలాగే చేతి గోళ్ళకైనా కాళీ గోళ్ళకైనా పెయింట్ వేసాక చిప్ అవుతుంటే పెయింట్ పొరపాటున కూడా స్క్రాప్ చేయద్దు. నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. డార్క్ నెయిల్ పాలిష్ ను పీల్ చేసినా చిప్ అయినా అసహ్యంగా కనపడతాయి. క్లియర్ టాప్ కోట్ పాలిష్ లేదా స్కిన్ కలర్ పాలిష్ వేసినా అందంగానే ఉంటాయి.

    స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి

    పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు  ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన…