• అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ అద్భుతమైన ప్రకృతి ఎప్పుడూ వంటరిగా ఎడారిలో మొలిచే జిల్లేడు మొక్కలా వంటరిగా ఉండదు. అలాగే చుక్క నీళ్లు పడని ఎడారిలో కూడా అందుకు తట్టుకు బతికే చెట్లుంటాయి. ఇంత పచ్చ దనం ఇంతటి అందం మానవసమూహాల్లో ఉంటుంది. చాలా మంది కలిసిన చోట ఎంతో సందడి స్నేహం మాట ఆడో పండగ. అందుకే ఒంటరిగా ఎవ్వరితోను కలవకుండా ఉండద్దు. నలుగురిలో కలివిడిగా వుండండి అంటుంటాయి. అధ్యయనాలు సామాజికంగా చురుగ్గా బిజీగా ఎప్పుడూ ఎదో ఒక పనిలో మునిగితేలాలి. లేకపోతే గుండె జబ్బులు వస్తాయంటారు. స్వచ్చందంగా ఎదో ఒక కార్యక్రమం చేప్పట్టటం లేదా స్నేహతులు ఇరుగు పొరుగులతో మంచి స్నేహం సంబంధాలు ఉంచుకోవటం చేయాలి. ఒంటరితనం నైరాశ్యం లోకి దారి తీసి అనేక దిగుళ్ళ వత్తిడి లతో ఆరోగ్యం చెడిపోయి అతి చిన్న వయస్సు లోనే తీవ్రమైన జబ్బులొస్తాయి. అంటున్నాయి అధ్యయనాలు. ఏ రూపం లో ఎలా గడిపినా సామజిక కలివిడితనం అనివార్యం.

    సామాజికంగా చురుగ్గా ఉంటేనే ఆరోగ్యం

    అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ…

  • మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప సంగీతం వినటం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుందని లయబద్దమైన సంగీత సుస్వరాలకు మనసు స్వాంతన చెందటం ద్వారా వత్తిడులకు దూరంగా ఉండచ్చని పరిశోధన వెల్లడైంది. రోజుకో అరగంట పాటు సంగీతం వినాలని దానితో మానసిక ప్రశాంతత తో పాటు రక్త నాళాలు సాఫీగా మారతాయని పరిశోధనల సారాంశం. 200 మంది గుండె జబ్బున్న రోగులకు లీనులవిందైన సంగీతాన్ని వినిపించి తర్వాత వారి రక్త ప్రసరణ తీరు పరిశీలించారు . మంచి సంగీతం విన్నాక రక్త ప్రసారణా తీరు మెరుగుపడగా రక్త ప్రసరణ లో విడుదల అయ్యే నైట్రిక్ యాసిడ్ రక్తనాళాల్లో గడ్డలను అవరోధాలను తగ్గిస్తోందన్న విషయం గమనించారు. అయితే ప్రశాంతమైన సంగీతం మాత్రమే వినాలనీ హోరు వాయిద్యాల ద్వారా సంగీత ధ్వని వింటే ఒత్తిడి మరింత పెరిగే అవకాశం వుందన్న విషయం కూడా గుర్తించారు. మంద్ర స్థాయిలు సాగే సంగీతం ఆరిథమ్ లో మంచి ఫలితం పొందవచ్చునని చెపుతున్నారు.

    సంగీతంతో గుండె పదిలం

    మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప…

  • రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు 10 గ్రాములు తీసుకొంటున్నారని తేలింది. ఇలా ఉప్పు పైన నియంత్రణ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ వంటకాల్లో ఎన్నో దినుసులు, పులుపులు, కారాలు ఎక్కువే. వండే కూరల్లో, పులుసుల్లో టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వీటికి తోడుగా ఉప్పు వాడటం తప్పదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆహారం వండే సమయంలో ఉప్పు వేయకండి. సహజంగా అన్నీ ఉడికాక రుచి చూసుకొని కావలసినంత ఉప్పు జోడించమంటున్నారు. సహజంగా కూరగాయల్లో వుండే ఉప్పు సరిపోతుందంటారు. ఉడికించకుండా, ఆవిరిపైన ఉడకబెట్టి గ్రిల్లింగ్, మైక్రోవేవ్ చేయటం బెస్ట్ అంటారు. రోజుకి ఐదు గ్రాములకు మించి ఉప్పు వాడద్దని WHO హెచ్చరిస్తుంది.

    ఉప్పు వాడటం తగ్గిస్తే బెటర్

    రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు…