• మీ టూత్ పేస్టు లో ఉప్పు వుందా? అని ఒక హీరోయిన్ దుకుంటూ వచ్చి అడిగితె సమాధానం చెప్పే వాడు తెల్ల మొహం వేసినట్లు, ఎన్ని టూత్ పస్ట్లు వాడినా నోరు దుర్వాసన వస్తూనే వుండవచ్చు. నోటి మూలల్లో దాకున్నబాక్టీరియా వల్లనో, ఆహారపు అలవాట్లు, హాబీలు కారణం ఏదైనా కావొచ్చు ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఇక మనవల్ల కాకపోతే ఇక డాక్టర్ దగ్గరకు పరిగెత్తాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, టంగ్ క్లీనర్ తప్పని సరిగా వాడటం, ఆహారం తీసుకున్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం. ఇవన్నీ సాధారణంగా చేసేవే కనుక ఇంకా కొన్ని ఆలోచించుకోవాలి. చాల సేపు మాట్లాడకుండా వుంటే నోరు డ్రై గా అయిపోతుంది. దుర్వాసన వస్తుంది. అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూ వుండాలి. చిగుళ్ళు బలహీన పడ్డా ఈ ప్రొబ్లెంస్ తప్పవు. ఇక దంతాల పటుత్వం తోనే ఆ సమస్య పోతుంది. పోషకాహరం తిసుకోవాలి డైట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండాలి. కనీసం ఆరు నెలలకొ సారి దంత వైధ్యుల్ని చూడాలి.

    నిజంగా ఇది సమస్యే

    మీ టూత్ పేస్టు లో ఉప్పు వుందా? అని ఒక హీరోయిన్ దుకుంటూ వచ్చి అడిగితె సమాధానం చెప్పే వాడు తెల్ల మొహం వేసినట్లు, ఎన్ని టూత్…

  • పళ్ళు తెల్లగా మిలమిలా మెరిసిపోవాలంటే డెయిలీ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే పళ్ళు సహజంగానే శుభ్రపడతాయి. సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల పైన ఎలాంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి . స్ట్రాబెర్రీ కివి వంటి పండ్లు మరీ మంచివి . పాల ఉతప్తులు దంత క్షయాన్ని తగ్గిస్తాయి. ఎనామిల్ కు రక్షణ కల్పించటంలో బలోపేతం చేయటంలో హార్డ్ చీజ్ ఎంతో ఉపయోగపడుతుంది. నువ్వులు నాలుక పైన బాక్టీరియా ను నాశనం చేస్తుంది. అలాగే పళ్ళ ఎనామిల్ నిర్మాణానికి పనికివస్తుంది. తియ్యని పదార్ధాలు తిన్న తర్వాత పళ్లకు బ్రష్ చేయాలి. ఎసిడిక్ జ్యూస్ లు షోడాలు స్ట్రా తో తాగటం మంచిది. ఆహారం తిన్న తర్వాత నోరు శుభ్రం చేయాలి. ప్రతి మూడు నెలలకో టూత్ బ్రష్ మార్చితే చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటే డెంటల్ చెకప్ చేసుకోవాలి.

    పంటి ఆరోగ్యం చాలా ముఖ్యం

    పళ్ళు తెల్లగా మిలమిలా మెరిసిపోవాలంటే డెయిలీ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే పళ్ళు…