తిరుగులేని నిర్మాత
పదహారేళ్లకే కెరీర్ ప్రారంభించి వినోద రంగంలో తిరుగులేని బ్రాండ్ సృష్టించి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు బాలాజీ టెలి ఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్.1994 లో బాలాజీ టెలి ఫిలిమ్స్ నెలకొల్పాక మొదటి ఆరు ప్రాజెక్ట్ లు విజయవంతంగా కాలేదు. హమ్ పాంచ్ సీరియల్ మొదలయ్యాక ఆమె ఎంత తిరుగులేని ప్రయాణం చేశారంటే దేశం లోని చానల్స్ లో ప్రసారమయ్యే 50 షోలలో 38 బాలాజీ టెలి ఫిలిమ్స్ నిర్మించినవే ఉన్నాయి. 2017 లో ఆర్ట్ బాలాజీ […]
రక్షణ రంగంలో సునీత
హరియాణా లోని చిన్న గ్రామంలో పుట్టిన సునీత పహాల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అయ్యారు. దతౌలీ అన్న చిన్న గ్రామంలో జన్మించిన సునీత కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ కామన్ ఎడ్మిషన్ టెస్ట్ రాశారు. తర్వాత ట్రైనింగ్ అకాడమీలో ఆపరేషన్స్ మానేజ్ చేయటం దగ్గర నుంచి సంక్లిష్టమైన టెక్నికల్ అసైన్మెంట్స్ హ్యాండిల్ చేయటం వరకు ఎంతో కష్టమైన శిక్షణలన్నీ తీసుకున్నారు. వైమానిక అధికారిక ప్రశంశా పత్రం అందుకున్నారు.ఎంతో పట్టుదలతో పనిచేసి రక్షణ రంగంలో […]
మోడలింగ్ కు వయసు ఏమిటి?
రాజస్థాన్ లో ఉండే ముక్త సింగ్ తెల్ల జుట్టు తో 62 ఏళ్ల వయసులో మోడలింగ్ ను కెరీర్ గా తీసుకొని రాణిస్తోంది.తల్లి, అమ్మమ్మ నుంచి స్టైలిష్ గా ఉండడం తో స్ఫూర్తి తీసుకున్నారు అని చెప్పే ముక్తా సింగ్ 50 ఏళ్ల వయసులో మోడలింగ్ కావాలనుకున్నది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేసిన ముక్త యుద్ధ విమాన పైలట్ ను వివాహం […]
శక్తి సరాలు
దక్షిణ భారతదేశంలో చంప సరాలు,మాటీలు ఒక ఆచారం. ప్రాచీన ఆభరణంగా అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా ఉండే ఈ ఇయర్ చైన్స్ వివాహ వేడుకల్లో వధువు అలంకరణ లో తప్పనిసరిగా వాడుతారు. పండగ రోజుల్లో ధరించే ఈ ఇయర్ చైన్స్ ఇప్పుడు మళ్లీ యువతుల్లో పాపులర్ అయింది. సిల్వర్, ఆక్సిడైజ్డ్,మెరూన్ కలర్ పూసలతో ముత్యాల మెరుపులతో ఈ చైన్లు స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. పెద్దవాళ్లు వీటిని శక్తి సరాలు అంటారు. చెవులు జుట్టు ప్రాంతంలో ఈ చెవి ఆభరణాలు […]
ఇదే తొలిసారి
50 ఏళ్ల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) చరిత్రలో మహిళా ప్రాతినిధ్యం దిశగా తొలి అడుగు పడింది ఫ్లైట్ ఇంజినీర్ గా ఇన్స్ట్రక్టర్ భావన చౌదరి ఫ్లైట్ ఇంజినీర్ గా ఎంపికయ్యారు. బి.ఎస్.ఎఫ్ మొదటిసారి సొంతంగా శిక్షణ ఇవ్వగా అందులో ఐదుగురిని ఎంపిక చేసింది. అందులో భావన చౌదరి ఒకరు.బి.ఎస్.ఎఫ్ డైరెక్టర్ జనరల్ చేతులు మీదుగా ఇటీవలే ఆమె ఫ్లయింగ్ బ్యాడ్జి అందుకున్నారు. హోమ్ మంత్రిత్వ శాఖ కు సంబంధించి విమానయాన సేవల బాధ్యత బి.ఎస్.ఎఫ్ నిర్వహిస్తోంది.ఈ […]
వన్యప్రాణి మనుగడే ధ్యేయం
మీరట్ కు చెందిన దీక్ష చౌహాన్ అడవి జంతువుల జీవన వ్యధలను హైపర్ రియలిస్టిక్ చిత్రాలతో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గా ఉన్న దీక్ష కళాకారునిగా అడవి జంతువుల దుస్థితిపై దృష్టి సాధించింది.అంతరించిపోతున్న అరణ్య ప్రాణుల గురించి ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు తన కలను వారధిగా ఎంచుకుంది దీక్ష.స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం మానుకొని ప్రశ్నార్ధకం గా మిగిలిన వన్యప్రాణుల జీవన వ్యధను, బతుకు పోరాటాన్ని చిత్రిస్తూ వన్యప్రాణి ప్రేమికులకు దగ్గరయింది దీక్ష.ఆమె వేసే […]
15 ఏళ్లుగా రైళ్లలోనే
యు.కె లో స్థిరపడిన మాజీ జర్నలిస్ట్ మోనిషా రాజేష్ ప్రపంచంలోనే అనేక దేశాలలో రాత్రి ద్వారా ట్రైన్ లో సంచారం చేస్తూ ‘మూన్ లైట్ ఎక్స్‌ప్రెస్’ పుస్తకం రాశారు. 45 సంవత్సరాల ఈ ట్రావెలర్ రైటర్, గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు గా చేసుకున్నారు. 2010లో ఆమె 80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ అనే పుస్తకం రాశారు ఆమె ఇండియాలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ […]
వాళ్లను ప్రపంచం మార్చింది
ఎలాంటి గుర్తింపు లేకుండా దొంగలుగా ముద్రపడిన సంచార డీనోటి ఫైడ్ గౌరవంగా జీవించేలా చేస్తున్నారు మిట్టల్ పటేల్ గుజరాత్ లోని శంఖల్ పూర్ లో పుట్టారు మిట్టల్ పటేల్. జర్నలిజం లో పీ.జీ చేశారు. పాములు పట్టి ఆడిస్తూ ఊరూరా తిరిగే సంచార తెగలు క్రిమినల్ పేరుతో చట్టబద్ధమైన ఎలాంటి హక్కులు లేకుండా ఉంటారు. వీళ్ళకు ఆధార్ రేషన్ ఓటర్ కార్డు లు ఉండవు. ఇల్లు ఉపాధి వృద్ధులకు నెలవారి పింఛన్లు చౌక బియ్యం కిట్లు ఇవేమీ […]
ఆడపిల్లకి ఆత్మరక్షణ
యవ్వనం లోకి వచ్చిన అమ్మాయిలకు ఏదైనా ప్రమాదం వస్తే ఆత్మరక్షణ కోసం ముక్కమార్ పేరు తో ఎన్నో ఎన్జీవో ఏర్పాటు చేసి వారికి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నారు ఇషితా శర్మ. ఇషితా ది ముంబై కథక్ డాన్సర్,నటి.ఆమె ఆలోచన లోంచి పుట్టింది ముక్కమార్ పాఠశాలలను సంప్రదించి అమ్మాయిలకు కుంగ్ ఫు, కరాటే, కలరియ పట్టు వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తోంది. ఈమె శిక్షణ ఇప్పించిన పిల్లలు రాష్ట్ర జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పతకాలు అందుకుంటున్నారు.ఆపదలో […]
బాఫ్టా అందుకున్న రోహిణి
పూణేలో జన్మించిన రోహిణి హట్టంగడి గాంధీ సినిమాలు కస్తూర్బా గా అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు అందుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో శిక్షణ తీసుకొని మొదట్లో నాటకాలే కెరీర్ గా ఎంచుకున్నారు తరువాత మరాఠీ,గుజరాతీ, హిందీ చిత్రాలతో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. 27 ఏళ్ల వయసులో తన వయసుకు మించిన బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్ బాఫ్టా అవార్డ్ వచ్చింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ […]
తొలి క్రికెట్ కామెంటేటర్
చంద్ర నాయుడు 1970ల్లో క్రికెట్ ప్లేయర్. క్రికెట్ వాక్యానం లోకి మైక్ పట్టుకుని వచ్చిన తొలి మహిళ ఆమె. మన దేశపు తొలి టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ కర్నల్ సి.కె నాయుడు కూతురు.1950ల్లో కాలేజీ రోజుల్లోనే ఉత్తర ప్రదేశ్ క్రికెట్ ప్రాతినిధ్యం వహించారు చంద్ర నాయుడు. ఎన్నో విజయాల తర్వాత క్రికెట్ మ్యాచ్ వాక్యానం వైపు దృష్టి మళ్ళించారు. ఇండియా,ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ కు ఆల్ ఇండియా రేడియో లో ఆమె చేసిన వ్యాఖ్యానం […]
బ్లౌజ్ ఇప్పుడో ఆభరణం
ఫ్యాషన్ ప్రపంచం లో నిరంతరం కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. ఎంత ఖరీదైన చీరకైనా బ్లౌజ్ అందం. ఖరీదైన ఆభరణాలు ఏర్చి కూర్చి తయారు చేస్తే బి జ్యువెలరీ బ్లౌజ్ లు వచ్చాయి. డిజైనర్లు అబు జాని సందీప్ ఖోస్లా రూపొందించిన బి జ్యువెలరీ బ్లౌజు ధరించి ఇషా అంబానీ ఒక వేడుకల్లో ప్రత్యక్షం కావడంతో ఈ రవికె ట్రెండై పోయింది.విలువైన పూసలు అద్దాలు, కుందన్ లు పసిడి దారాలు, ముత్యాలు వజ్రాలు పొదిగిన ఈ జాకెట్లు […]
తెలంగాణలో అపూర్వ గ్రంథాలయం
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ చీఫ్ బ్రాండ్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ అనురాధ సెహగల్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్ చేసిన అనురాధ లైబ్రరీస్ ఏర్పాటు చేయడంలో ఇంట్రెస్ట్ చూపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో నోయిడా లో పీపుల్స్ లైబ్రరీ ప్రారంభించారు. తాజాగా హైదరాబాద్ లో కూడా చాలా మంచి లైబ్రరీ ఏర్పాటు చేశారు.యువతకు పనికి వచ్చే 15 వేల పైగా పుస్తకాలు ఉన్నాయి. చరిత్ర, చిన్నపిల్లల సాహిత్యం, జీవిత కథలతో లైబ్రరీ కళకళలాడుతోంది.
యోధురాలికి శాంతి బహుమతి
వెనిజులా లో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న యోధురాలు మారియా కొరినా మచాడో కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వృత్తి రీత్యా ఇండస్ట్రియల్ ఇంజనీర్ అయినా మారియా కొరినా వెనిజులా లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాటం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఆమెను వెంటాడి వేధించింది ఈ ఒత్తిడి తట్టుకోలేక, భర్త ఇద్దరు పిల్లలతో తల్లితో విదేశాల్లో తలదాచుకున్నది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉంది.వెనిజులా నాయకుడు నికోలాస్ మడురో […]
మలాలా ప్రేమ కథ
నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ తన భర్త యాసర్ మాలిక్‌తో తన తొలినాళ్ళ అనుభవం గురించి రాసిన ‘ఫైండింగ్ మై వే’ అనే జీవిత చరిత్రలో తన జీవితంలోకి మధురస్మృతులు గురించి రాసింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో తన ప్రేమకథ ఈ పుస్తకం తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యాక, చదువు పూర్తయ్యే వరకు ఎదురు చూసి తరువాతే పెళ్ళాడారు ఈ ఇద్దరు ప్రేమికులు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొని 2021లో బర్మింగ్‌హ్యామ్‌లో పెళ్లాడిన ఈ దంపతుల […]
సరికొత్త గా పాత ఫ్యాషన్
చేంజ్ అబుల్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లో ఉంది. ఒకే నగను రెండు మూడు రకాలుగా రివర్స్ బుల్, ఇట్లా అనేక పేర్లతో టు ఇన్ వన్ జ్యువలరీ మార్కెట్ లో ఉంది. రివర్సబుల్ వడ్డాణాల్లో ఒకవైపు టెంపుల్ ధీమ్,మరోవైపు రాళ్లతో డిజైన్ లు ఉంటున్నాయి. సందర్భానికి తగ్గట్లు ఒకే నగలు నాలుగైదు రకాలుగా మార్చి పెట్టుకునేలా హారాలు జడ బిల్లలు, నెక్లెస్ లు వస్తున్నాయి అలాగే బంగారం తో ముత్యాలు, పగడాలు, పచ్చలు, […]
సెల్ఫ్ మేడ్ ఉమెన్ జయశ్రీ
జయశ్రీ ఉల్లాల్ భారతీయ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు శాంటా క్లారా యూనివర్సిటీ లో మాస్టర్స్ చేసిన జయశ్రీ 2008లో ఆర్టిస్టా నెట్ వర్క్ సి ఈ ఓ గా ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు అప్పుడు చిన్న కంపెనీ గా ఉన్న ఆర్టిస్టా ను 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఐపిఒ కు తీసుకు వెళ్ళగలిగారు. తాజాగా హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం జయశ్రీ ఉల్లాల్ నికర విలువ 50,170 కోట్లు దీనితోపాటు […]
డైరెక్టర్ గా దియా
స్టార్ కపుల్ సూర్య,జ్యోతిక ల కూతురు దివ్య సినిమాల్లోకి దర్శకురాలిగా అడుగుపెట్టింది.17 ఏళ్ల దివ్య తీసిన లీడింగ్ లైట్ అన్న డాక్యుమెంటరీ లాస్ట్ ఏంజెల్స్ లోని రెజెన్సీ థియేటర్ లో ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్ లో భాగంగా ప్రదర్శితమవుతోంది.ఈ స్టార్ ఫిల్మ్ లో, దియా ఈ కాలపు స్త్రీలు ఎదుర్కొనే సవాళ్లు మానసిక శారీరక వత్తిళ్లు,వాటిని పట్టుదలగా దాటుతున్నారు ఒక డ్రామా లాగా తీసింది. ఈ కథను ప్రతిభావంతంగా దియా చెప్పిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
అందాల జందానీ
ఏదైనా వెరైటీ గా ఉన్న చీర ధరించాలి అనుకుంటే జందానీ ఢకాయి చీరె కొనచ్చు.ఢాకా నగరంలో తయారుచేస్తారు కనుక ఢకాయి చీర అన్నారు. బెంగాలీ చేనేత పనితనం తో ఈ చీరలు చాలా అందంగా ఉన్నాయి. జందానీ చీరల్లో పెద్ద బార్డర్, పద్మం, చేప,దీపం వంటివి ఈ చీరల పైన డిజైన్ చేస్తారు. బుటిదార్, చిన్న పువ్వులు కర్కానా పేరుతో ఈ చీరల పైన మోటిప్స్ వేస్తారు.తేలికపాటి ఆభరణాలు, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఈ చీరలకు మంచి […]
ఇవి ప్రత్యేకమైన దుస్తులు
కండరాల బలహీనత గలవారికి వృద్ధులకు సులువుగా ధరించగలిగే వినూత డిజైన్లు రూపొందించారు సౌమితా బసు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా మహా నగరానికి చెందిన సౌమిత కండరాల బలహీనత తో బాధపడేది వీల్ చైర్ లో జీవితం గడపడం తప్పదని తెలిశాక తన వంటి వైకల్యం గల వారి కోసం తల్లి అమిత తో కలిసి దుస్తులు తయారు చేసింది. మ్యాగ్నెటిక్ వెల్ క్రో క్లోజర్స్, నో బౌండ్ ట్రౌజర్లు వంటివి కస్టమర్లు కోరిక విధంగా వారి […]
