హరియాణా లోని చిన్న గ్రామంలో పుట్టిన సునీత పహాల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అయ్యారు. దతౌలీ అన్న చిన్న గ్రామంలో జన్మించిన సునీత కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ కామన్ ఎడ్మిషన్ టెస్ట్ రాశారు. తర్వాత ట్రైనింగ్ అకాడమీలో ఆపరేషన్స్ మానేజ్ చేయటం దగ్గర నుంచి సంక్లిష్టమైన టెక్నికల్ అసైన్మెంట్స్ హ్యాండిల్ చేయటం వరకు ఎంతో కష్టమైన శిక్షణలన్నీ తీసుకున్నారు. వైమానిక అధికారిక ప్రశంశా పత్రం అందుకున్నారు.ఎంతో పట్టుదలతో పనిచేసి రక్షణ రంగంలో వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు పరిమితులు దృష్టిలో ఉంచుకోంది.పట్టుదలే లక్ష్యంగా పని చేయండి అంటుంది సునీత పహాల్.













