Thursday, 15 Oct, 2026

కలల తీరం చేరిన పోలీస్ ఆఫీసర్

అస్సాం లోని గోలా ఘాట్ కు చెందిన 29 ఏళ్ల లవ్లీనా, నెలకు రూ. 2500 సంపాదించే కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల,ఈరోజు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్.ఆమె పూర్తి పేరు లవ్లీనా బోర్గోహైన్.లవ్లీనా కు ఇద్దరు అక్కలు-లిచా,లిమా.ఇద్దరూ కిక్ బాక్సర్లు. వాళ్ళు ప్రాక్టీస్ చేయడం చూసి చిన్న లవ్లీనా కు కూడా పోరాడాలనిపించింది. కిక్ బాక్సింగ్ తో మొదలు పెట్టింది. 2012లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రయల్స్ లో కోచ్ పదుమ్ బోరో ఆమెలోని పొడవు, పట్టుదల చూశారు. “నువ్వు బాక్సర్ అవ్వాలి” అన్నారు. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు- 2018, 2019 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యంగెలుచుకుంది – మేరీ కోమ్ తర్వాత ఒలింపిక్ పతకం తెచ్చిన రెండో భారత మహిళ- 2023 ప్రపంచ ఛాంపియన్ లో స్వర్ణం గెలుచుకుంది.ఆమె ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు. రింగ్ లో ఆమె పంచ్ కంటే, ఆమె ఓర్పు గొప్పది అంటారు కోచ్ లు.బాక్సింగ్ తో పాటు, అస్సాం పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గ్రామం నుండి వచ్చిన ఆడపిల్ల,యూనిఫాం వేసుకుని మరో రూపంలో దేశానికి సేవ చేస్తోంది.లవ్లీనా చెప్పే మాట ఒక్కటే – “భయపడితే రింగ్ ఎక్కలేం, జీవితంలో గెలవలేం”ఆడపిల్లలు కలలు కనడం మానేస్తే, దేశం కలలు కనడం మానేసినట్టే. లవ్లీనా లాంటి వాళ్ళు ఆ కలలకు పంచ్ లు ఇస్తూనే ఉంటారు.

Leave a Reply