వాల్ ఆఫ్ ఇండియా సవిత పునియా
భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యధికంగా మ్యాచ్ లు ఆడిన క్రీడాకారిణి గా చరిత్ర సృష్టించింది సవిత. 2011లో తొలి సీనియర్ అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడిన సవిత 2016 రియో ఒలింపిక్స్ కి 36 ఏళ్ల తర్వాత భారత్ అర్హత సాధించడం లో కీలక పాత్ర పోషించింది .టోక్యో ఒలింపిక్స్ 2020 లో ఒకవైపు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తూనే గోల్ కీపర్ గా రాణించింది. భారత్ చారిత్రాత్మకంగా నాలుగో స్థానంలో నిలిచింది అంటే ఈమె పాత్ర చాలా ఎక్కువే. ది వాల్ ఆఫ్ ఇండియా గా పేరు పొందింది సవిత పునియా. దీంతో భారత ప్రభుత్వం ఆమెకు అర్జున పద్మశ్రీ అవార్డులను ఇచ్చి సత్కరించింది.13 ఏళ్ల వయసులో హాకీ ని ఎంచుకున్న సవిత కు మొదట్లో ఆటపై అంత ఆసక్తి ఉండేది కాదు. ఆమె చాలా పొడుగ్గా ఉండటంతో కోచ్లు ఆమెను గోల్ కీపర్ గా నియమించారు. ఈమెకు భారీ గోల్ కీపింగ్ కిట్ అంటే కూడా ఇష్టం ఉండేది కాదట .అంత బరువైనది నేను మోయలేనని ఏడ్చేదిట.చివరికి వాళ్ళ నాన్న 20000 పెట్టి ఖరీదైన గోల్ కీపింగ్ కిట్ కొని ఆమె చేతిలో పెట్టారు. హర్యానాలోని జోద్ ఖాన్ గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్లది .ఈ కిట్టు కొనడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు ఎన్ని త్యాగాలు చేశారో అర్థం అయ్యాక తన ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుని సవిత హాకీని శ్రద్ధగా ఆడటం మొదలు పెట్టింది. మూడు రంగుల జెండాను అంతర్జాతీయ వేదికల మీద ఎగరేసే లక్ష్యంతో దశాబ్దాలుగా అసాధారణ పోరాటం చేస్తున్నారు మన అమ్మాయిలు. హాకీ చరిత్ర లోనే 321 మ్యాచ్ లు ఆడి చరిత్ర సృష్టించింది సవిత.
