Monday, 02 Nov, 2026

77 సంవత్సరాల వయసులో నటి హేమమాలిని దసరా నవరాత్రుల తొలి రోజు అగర్వాల్ సమాజ్ వారి నవరాత్రి వేడుకల్లో తన అత్యంత ప్రసిద్ధ నృత్య నాటిక దుర్గ ను ప్రదర్శించింది. నటిగా రాజకీయవేత్తగా తల్లిగా ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ నాట్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది.హేమమాలిని తండ్రి సూచనతో చాలా చిన్న వయసులోనే తన కెరీర్ ను బ్యాలెల వైపు మళ్ళించారు.తాను స్థాపించిన నాట్య విహార్ కళాకేంద్రం నుంచి మీరా అనే తొలి నృత్య నాటిక ప్రదర్శించింది. తర్వాత రామాయణ గాధను నృత్య నాటిక గా మలిచారు. కూచిపూడి మోహినియాట్టం లో శిక్షణ పొందిన హేమమాలిని, ఒడిస్సా లో శిక్షణ పొందిన తన కుమార్తెలు ఈశా,అహనా లతో కలిసి పరంపర అనే నృత్య ప్రదర్శన ఇచ్చారు .2024లో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం లో సీతగా నటించింది .హేమమాలిని ముంబైలోని ఆమె ఇంట్లోనే విశాలమైన హాల్ లో 30 మంది శిష్యులకు శిక్షణ ఇస్తుంది. 77 సంవత్సరాల వయసులో కూడా భక్తితో క్రమశిక్షణతో వేదిక పై తన నృత్యాన్ని ప్రదర్శిస్తున్న హేమమాలిని నిజమైన కళాకారిణి .కళలపై అభిమానం ఉన్న ప్రతి మహిళకు ఆమె స్ఫూర్తి.

Leave a Reply