వన్యప్రాణి మనుగడే ధ్యేయం

వన్యప్రాణి మనుగడే ధ్యేయం

వన్యప్రాణి మనుగడే ధ్యేయం

మీరట్ కు చెందిన దీక్ష చౌహాన్ అడవి జంతువుల జీవన వ్యధలను హైపర్ రియలిస్టిక్ చిత్రాలతో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గా ఉన్న దీక్ష కళాకారునిగా అడవి జంతువుల దుస్థితిపై దృష్టి సాధించింది.అంతరించిపోతున్న అరణ్య ప్రాణుల గురించి ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు తన కలను వారధిగా ఎంచుకుంది దీక్ష.స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం మానుకొని ప్రశ్నార్ధకం గా మిగిలిన వన్యప్రాణుల జీవన వ్యధను, బతుకు పోరాటాన్ని చిత్రిస్తూ వన్యప్రాణి ప్రేమికులకు దగ్గరయింది దీక్ష.ఆమె వేసే చిత్రాలు సజీవమైన కదలిక ను కాన్వాస్ లో నుంచి చూపిస్తూ ఉంటాయి.