నూనెలు మార్చకపోతే తంటా
భారతీయ వంటకాలు దాదాపు అన్నీ ఎక్కువ నూనె వాడి వండేవే. సాధారణంగా ఎక్కువ నూనెలో కూరలు మగ్గితేనే రుచి వస్తుందనే ఆలోచన కూడా మనలో ఎక్కువే.ఈ నూనె కాలేయానికి గొప్ప ప్రమాదం గా మారుతోంది.ఎక్కువ నూనెతో కూర వండుకోవటం వేపుడు చేసుకోవడం అలవాటు వల్ల ఇంట్లో ఒక్కొక్కరమూ ప్రతిరోజు మూడు నుంచి నాలుగు చెంచాల కంటే ఎక్కువ నూనె తీసుకుంటూ ఉంటాం. ఈ నూనె కాలేయంలో కొవ్వుగా పేరుకు పోతూ ఉంటుంది ఆలివ్ నూనె ,నెయ్యి, గానుగ నూనెలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ అతిగా వాడితే కాలేయంలో కొవ్వుగా మారక తప్పదు .నూనెల పరిమాణం ఆరోగ్యానికి చాలా ముఖ్యం .ఒకే రకమైన రిఫండ్ నూనె ఏళ్ల తరబడి వాడుకోకుండా సంప్రదాయ నూనె లైన వేరుశనగ నూనె ఆవ నూనె నువ్వుల నూనె పొద్దు తిరుగుడు నూనె తరచూ మారుస్తూ వాడుకుంటూ ఉండాలి. ఇక బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ లో వాడిన నూనె పదేపదే వేడి చేస్తూ ఉండటం వల్ల దాన్లోని ట్రాన్స్ ఫ్యాట్ లు టోటల్ పోలార్ కాంపౌండ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇవే కాలేయ కణాలను విషపూరితం చేస్తాయి .చివరకు కాలేయ క్యాన్సర్ ని కూడా తీసుకొస్తాయి. అందుకే నూనెల విషయంలో జాగ్రత్త తీసుకోండి అంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు.
