మోడలింగ్ కు వయసు ఏమిటి?

మోడలింగ్ కు వయసు ఏమిటి?

మోడలింగ్ కు వయసు ఏమిటి?

రాజస్థాన్ లో ఉండే ముక్త సింగ్ తెల్ల జుట్టు తో 62 ఏళ్ల వయసులో మోడలింగ్ ను కెరీర్ గా తీసుకొని రాణిస్తోంది.తల్లి, అమ్మమ్మ నుంచి స్టైలిష్ గా ఉండడం తో స్ఫూర్తి తీసుకున్నారు అని చెప్పే ముక్తా సింగ్ 50 ఏళ్ల వయసులో మోడలింగ్ కావాలనుకున్నది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేసిన ముక్త యుద్ధ విమాన పైలట్ ను వివాహం చేసుకున్నది ఇద్దరు పిల్లలు. కంటెంట్ రైటర్ గా పని చేస్తూ పిల్లల పెంపకం, సంసారంలో మునిగి తేలిన ముక్త 50 ఏళ్ల వచ్చాక తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలోకి వచ్చింది.బోలెడంత ఆదాయం కూడా ఆర్జిస్తోంది.