ఆడపిల్లకి ఆత్మరక్షణ

ఆడపిల్లకి ఆత్మరక్షణ

ఆడపిల్లకి ఆత్మరక్షణ

యవ్వనం లోకి వచ్చిన అమ్మాయిలకు ఏదైనా ప్రమాదం వస్తే ఆత్మరక్షణ కోసం ముక్కమార్ పేరు తో ఎన్నో ఎన్జీవో ఏర్పాటు చేసి వారికి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నారు ఇషితా శర్మ. ఇషితా ది ముంబై  కథక్ డాన్సర్,నటి.ఆమె ఆలోచన లోంచి పుట్టింది ముక్కమార్ పాఠశాలలను సంప్రదించి అమ్మాయిలకు కుంగ్ ఫు, కరాటే, కలరియ పట్టు వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తోంది. ఈమె శిక్షణ ఇప్పించిన పిల్లలు రాష్ట్ర జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పతకాలు అందుకుంటున్నారు.ఆపదలో ఎవరిని వారు రక్షించుకోవాలని,పిడికిలి బిగించి పోరాడాలని తన సంస్థకు ముక్కుమార్ అని పేరు పెట్టింది ఇషితా.