యు.కె లో స్థిరపడిన మాజీ జర్నలిస్ట్ మోనిషా రాజేష్ ప్రపంచంలోనే అనేక దేశాలలో రాత్రి ద్వారా ట్రైన్ లో సంచారం చేస్తూ ‘మూన్ లైట్ ఎక్స్ప్రెస్’ పుస్తకం రాశారు. 45 సంవత్సరాల ఈ ట్రావెలర్ రైటర్, గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు గా చేసుకున్నారు. 2010లో ఆమె 80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ అనే పుస్తకం రాశారు ఆమె ఇండియాలో కోణార్క్ ఎక్స్ప్రెస్ లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. రాత్రి ప్రయాణాల గురించి ఆమె రాసిన పుస్తకం ఇప్పుడు ప్రపంచంలో భ్రమణ కాంక్ష పెంచేదిగా ఉంది.













