పదహారేళ్లకే కెరీర్ ప్రారంభించి వినోద రంగంలో తిరుగులేని బ్రాండ్ సృష్టించి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు బాలాజీ టెలి ఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్.1994 లో బాలాజీ టెలి ఫిలిమ్స్ నెలకొల్పాక మొదటి ఆరు ప్రాజెక్ట్ లు విజయవంతంగా కాలేదు. హమ్ పాంచ్ సీరియల్ మొదలయ్యాక ఆమె ఎంత తిరుగులేని ప్రయాణం చేశారంటే దేశం లోని చానల్స్ లో ప్రసారమయ్యే 50 షోలలో 38 బాలాజీ టెలి ఫిలిమ్స్ నిర్మించినవే ఉన్నాయి. 2017 లో ఆర్ట్ బాలాజీ పేరుతో వీడియో డిమాండ్ ఫ్లాట్ ఫారం కూడా నెలకొల్పారు. వివాహం పట్ల ఆమెకు ఆసక్తి లేదు. సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఏక్తా. తిరుగులేని సీరియల్ క్వీన్ ఆమె.













