శక్తి సరాలు

శక్తి సరాలు

శక్తి సరాలు

దక్షిణ భారతదేశంలో చంప సరాలు,మాటీలు ఒక ఆచారం. ప్రాచీన ఆభరణంగా అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా ఉండే ఈ ఇయర్ చైన్స్ వివాహ వేడుకల్లో వధువు అలంకరణ లో తప్పనిసరిగా వాడుతారు. పండగ రోజుల్లో ధరించే ఈ ఇయర్ చైన్స్ ఇప్పుడు మళ్లీ యువతుల్లో పాపులర్ అయింది. సిల్వర్, ఆక్సిడైజ్డ్,మెరూన్ కలర్ పూసలతో ముత్యాల మెరుపులతో ఈ చైన్లు స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. పెద్దవాళ్లు వీటిని శక్తి సరాలు అంటారు. చెవులు జుట్టు ప్రాంతంలో ఈ చెవి ఆభరణాలు బరువుగా తగులుతూ కదలడం వల్ల ప్రాణ శక్తి సమతుల్యం చేస్తుందని చెప్తారు.