50 ఏళ్ల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) చరిత్రలో మహిళా ప్రాతినిధ్యం దిశగా తొలి అడుగు పడింది ఫ్లైట్ ఇంజినీర్ గా ఇన్స్ట్రక్టర్ భావన చౌదరి ఫ్లైట్ ఇంజినీర్ గా ఎంపికయ్యారు. బి.ఎస్.ఎఫ్ మొదటిసారి సొంతంగా శిక్షణ ఇవ్వగా అందులో ఐదుగురిని ఎంపిక చేసింది. అందులో భావన చౌదరి ఒకరు.బి.ఎస్.ఎఫ్ డైరెక్టర్ జనరల్ చేతులు మీదుగా ఇటీవలే ఆమె ఫ్లయింగ్ బ్యాడ్జి అందుకున్నారు. హోమ్ మంత్రిత్వ శాఖ కు సంబంధించి విమానయాన సేవల బాధ్యత బి.ఎస్.ఎఫ్ నిర్వహిస్తోంది.ఈ విభాగంలోకి మహిళలు రావడం ఇదే తొలిసారి.













