ఎలాంటి గుర్తింపు లేకుండా దొంగలుగా ముద్రపడిన సంచార డీనోటి ఫైడ్ గౌరవంగా జీవించేలా చేస్తున్నారు మిట్టల్ పటేల్ గుజరాత్ లోని శంఖల్ పూర్ లో పుట్టారు మిట్టల్ పటేల్. జర్నలిజం లో పీ.జీ చేశారు. పాములు పట్టి ఆడిస్తూ ఊరూరా తిరిగే సంచార తెగలు క్రిమినల్ పేరుతో చట్టబద్ధమైన ఎలాంటి హక్కులు లేకుండా ఉంటారు. వీళ్ళకు ఆధార్ రేషన్ ఓటర్ కార్డు లు ఉండవు. ఇల్లు ఉపాధి వృద్ధులకు నెలవారి పింఛన్లు చౌక బియ్యం కిట్లు ఇవేమీ ఉండవు. సంచారాలు కావడంతో శాశ్వత చిరునామాలేని ఈ తెగల ప్రజల కోసం పనిచేస్తోంది. మిట్టల్ ఈ తెగల కోసం ఆమె పడుతున్న కష్టం, తాపత్రయం ఆమె రాసే కథనాలకు రియల్ హీరోస్ అవార్డ్, నారీ శక్తి పురస్కారం సహా మరెన్నో అవార్డులు రికార్డులు అందుకున్నారు మిట్టల్ పటేల్.













