Saturday, 28 Nov, 2026

ప్రయోగాలు చేయటం ఇష్టం లేదు

నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను అంటోంది రకుల్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఆమె కెరీర్ ఎక్స్ ప్రెస్ లాగే దూసుకుపోతోంది. ధ్రువ దాకా అన్నీ సక్సెస్ లే. మహేష్ బాబు రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటిస్తోంది. ఇటు యువతరం కధా  నాయకుల లోనూ సినిమాలు చేస్తోంది. కెరీర్ కొత్తల్లో నాకు […]

స్పెషల్లీ డిజైన్డ్

పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ  లేనంత గొప్పగా ఉండాలనుకుంటున్నారు ఆలా అవకాశం సముద్ర గర్భంలో ఏకంగా గాలిలో ఎగిరే బెలూన్ లో కూడా పెళ్లిలవుతున్నాయి . ఇక పెళ్లికూతురు ఎలా ఉండాలి. ప్రధానం రోజు మెహేందీ  పండగ రోజు ఏకంగా పెళ్లి రోజు ఆమె అలంకరణ ఆహార్యం ఎంత గొప్పగా ప్రత్యేకంగా ఉండాలి. సంప్రదాయం ఆధునికత కలిసిన […]

తియ్యని నారింజ లో ఉపయోగాలనేకం

ఇప్పుడు నారింజ పండ్లు బాగా దొరికే రోజులు. ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ వదులుకుంటే ఇంకోసారి వెంటనే దొరకవు కదా . అలాగే చాలా త్వరలో మామిడిపండ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ తియ్యని నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్  మేగ్నేషియం సోడియం తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ పండ్ల లో నీటి శాతం ఎక్కువ. నోటి దుర్వాసన పోగొట్టే గుణం ఈ […]

ఫోన్ కాస్సేపు ఆపండి బాబూ

టెక్సాస్ లోని ఓ డే కేర్ సెంటర్ దగ్గర గెట్ ఆఫ్ యువర్ ఫోన్ అని ఒక నోట్ అంటించారట. ఆడే కేర్ సెంటర్ నుంచి పిల్లలను తీసుకుపోవడానికి వచ్చే పేరెంట్స్ అందరిచేతుల్లో ఫోన్లే . ఆ బిజీ గా  మాట్లాడటం  పిల్లలను మెకానికల్ గా ఎదో వస్తువుల్ని కలెక్ట్ చేసుకున్నట్లు తీసుకుపోవటం చూసి వళ్ళు మండి  వర్కింగ్ పేరెంట్లు స్మార్ట్ గా వుండే అమ్మానాన్నలు మీ పిల్లల కోసం ఆ ఫోన్ లు కాసేపు అవతల […]

పుట్టబోయే శిశువు ఆరోగ్యం వీటితోనే

ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం  బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం  చాలా అవసరం పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆహారంలో ఉండే ఐరన్  గర్భశక్తి  శిశువు ఆరోగ్య వృద్ధికి రోగ నిరోధిక శక్తి  పెంచేందుకు సాయపడుతుంది. అలాగే నిద్ద రక్త కణాల  వృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. విటమిన్ బి – 12 తో శిశువు శరీరంలో కొత్త కణాలు […]

మేలు చేసే మందార పూలు

మందార పూలు ఎంతందంగా  వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి  దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి  మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే […]

బాగా తిని తగ్గదంటున్న రుజుత్

రుజుత్  దివేకర్ కు  రుణపడి ఉండచ్చు  అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి  బంపర్ ఆఫర్ ఇచ్చిందీ  డైటీషియన్ . కరీనా కపూర్ ఆలియా భట్ వరుణ్ ధావన్ ఇలా ఎందరో సెలబ్రెటీల ఫెవరెట్ డైటీషియన్ రుజుత్. డైటీషియన్లు ఏవీ తినద్దు మొర్రో అని మొత్తుకుంటారు కదా. ఈవిడైతే  అన్నం నెయ్యి చక్కెర  జీడిపప్పు ఇలా బలాన్నిచ్చే ఏ ఆహారమూ  వదులుకోవద్దు. సంప్రదాయ భారతీయ   ఆహారం  శుభ్రంగా తినండి. అంటే తృప్తిగా […]

గురువుకి రెండు కోట్ల కానుక

బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే  కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన […]

ఈమె క్వీన్ ఆఫ్ ముంబాయి

హసీనా పేరుతో టైటిల్ పాత్రలో శ్రద్ధ  కపూర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నిప్పులు చెరిగే కళ్ళు. కనుసైగ తో శాసించే దర్పం ఉట్టిపడే కళ తో శ్రద్దా కపూర్ పోస్టర్ అచ్చమైన లేడీ డాన్ లాగే వుందని  మంచి ప్రశంసలు దక్కుతాయి . అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్. దావూద్ లాగే ముంబై లో తిరుగులేని ఆధిపత్యం చలాయించింది హసీనా పార్కర్. ఇప్పుడామె జీవితం హసీనా పేరుతో వెండి […]

ఎవరన్నారు మారలేదని

నీహారికా , ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా మారిందంటావు. ఎలా మారిందో ఒక్క ఉదాహరణ చెప్పు అన్నావు . సరే విను. ఫ్యాషన్ రంగం. వంటల రంగం ప్రముఖంగా వినిపంచేవి మగవాళ్ల పేర్లే. అద్భుతమైన జ్యూవెలరీ తయారీ మగవాళ్లదే. ఆడవారికి అవసరమైన వన్నీ సృష్టించేది మగవాళ్లే. అలాగే వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ బాగానే పసిగడుతున్నారా ? లేదా ? వంటలతో బెస్ట్ చెఫ్స్ గా మగవారే కదా. డాన్సింగ్ స్కూల్స్ మగవాళ్లవేనా ? ఫ్యాషన్ రంగాన్నీ వాళ్లే. […]

మార్పులు చిన్నవే కానీ భలే ట్రెండీ

కేశాలంకారణలో కొన్ని టిప్స్ నేర్చుకుంటే అవే  కొన్ని సందర్భాల్లో పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయ్. కాస్త పొట్టిగా చిన్న జుట్టే ఉంటే దానికో పోనీ వేయచ్చు. రెండు చేతులతో సమానంగా జుట్టుని పైకెత్తి నడినెత్తికి కిందగా తెచ్చి బననా క్లిప్ పెడితే జుట్టు ఒత్తుగా కన్పిస్తుంది. అలాగే ఎప్పుడూ పాపిడి తీసుకోవటమో లేక వెనక్కి దువ్వు కోవటం కాకుండా పఫ్  ట్రై చేస్తే బావుంటుంది ఇవాళ్టి ట్రెండ్ కూడా . జుట్టు ముందర భాగాన ఎత్తుగా కనిపిస్తూ […]

ఇవి కూడా ఫ్యాషన్ ట్రెండ్స్

అలంకరణ అంటే దుస్తులు నగలే. కానీ బోలెడన్ని అందమైన చెప్పులు కూడా. అలంకరణ కు అందం తెస్తాయి. పంజాబీ జూత్ లు వేసుకునేందుకు సౌకర్యంగా ఫ్యాషన్ గా ఉంటాయి. సల్వార్ సూట్లు జీన్స్ కుర్తీలకు బావుంటాయి. బెల్లీస్ నీ బ్యాలే ప్లాట్స్  అంటారు. ఆఫీస్ లకు బావుంటాయి. ఎత్తు మడమలు కూడా ఉన్నాయి ఇవి చీరలు కట్టుకున్నప్పుడు బావుంటాయి. ఓపెన్ తో పంప్స్ అన్ని రకాల దుస్తులకు నప్పే రకం . అన్ని రకాల డిజైన్లు అందుబాటులో […]

ఈ గౌను మా ఆయన ఎంపిక

బిపాసా బసు కంగనా రనౌత్ గ్రోవర్ లో ‘ఎలోన్ ‘ చిత్రంలో కలిసి నటించాక ప్రేమలో పడి  పెళ్లి చేసుకున్నారు . మాల్దీవులకు హనీమూన్ వెళ్లొచ్చారు. ఆ బీచ్ లో వేళ్ళు తీసుకున్న ఫోటోలు ఆన్ లైన్ లో అంత ఆనందించారు. ఇప్పుడిక పెళ్లి హనీమూన్ అయ్యాక బిపాసా వాళ్ళు బుల్లితెర పై బ్రహ్మాండమైన రియాలిటీ షో చేయాలనుకుంటోంది. ఫిక్షన్ కన్నా రియాలిటీ షో నాకు చాలా ఇష్టం. ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారిపోతుంది. వాళ్లకు డిఫరెంట్ […]

నేను తెలుగమ్మాయి ననిపించింది

నేను లోకల్ సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికే చాలా దగ్గరయ్యాననిపించింది. అంటోంది కీర్తి సురేష్. ఇది తన రెండవ సినిమా. ఎప్పుడైనా బయట కనిపిస్తే తెలుగువాళ్లు హాయ్  శైలజ అని పలకరిస్తారు నేను శైలజ లో  నా పాత్రకి అంతగా కనెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది . మొదటి సినిమా తో రామ్ తో పాటు దర్శకుడు కిషోర్  నిర్మాత రవి కిషోర్  లకు తమిళం వచ్చు తమిళంలోనే సీన్లకు వివరించటంతో ఎంతో సౌకర్యంగా […]

నోరూరించే రూపాల్లో స్నానపు సోప్స్

ఫుడ్ షేప్డ్ సోప్స్  అన్నందుకు అచ్ఛం అన్ని రకాల వెరైటీ ఫుడ్ షేప్ లో సోపు లొస్తున్నాయి. సబ్బులు మంచి బ్రాండ్ సువాసన క్వాలిటీ అన్నీ ఉండాల్సిందే . కానీ చేసేందుకు విన్నూత్నంగా కాళ్ళని ఆకటు కొనేట్లు ఇంటికొచ్చిన అతిధులు స్నానాలగదిలో సోప్ చూసి ఆశ్చర్యపోవాలి. అనుకుంటున్నారు గనుకనే ఇప్పుడీ మొక్కజొన్న ముక్కలు చెర్రీస్ ఐస్ క్రీములు ఐస్ ఫ్రూట్ లు జామపండ్లు అరటిపండ్ల తో సహా ఎన్నో రకాల సోప్స్  మార్కెట్ ని ముంచేస్తున్నాయి. వీటిని […]

పాడుకుంటుంటే కునుకు పడుతుంది

నిద్ర పట్టకపోవటం గురించి ఎవరైనా పదే పదే  చెపుతుంటే మరీ అంత సమస్య నా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చిరాకు పెట్టె ఇబ్బంది.  రాత్రివేళ కూడా మనకు ప్రశాంతంగా ఆలోచనలు లేకుండా ఉండలేక పోతున్నామని ఆందోళన భావోద్వేగ పూరితమైన ఆలోచనలు వదలటం లేదనీ నిద్రలేమితో బాధపడేవారు అనేకమంది చెపుతారు. నిద్ర పట్టటం లేదని మనసుకు అనిపిస్తే నిద్రపోలేక పోతున్నామనే  ఆలోచన ఆందోళనగా మారే పరిస్థితి ఇంకా పాడైపోతుంది. అయితే ఇలాంటి ఆలోచనలు మనసులోకి రాకుండా శ్రద్ధగా […]

బస్ నడపటం నేర్చుకున్న రాధికా

మన హీరోయిన్స్ ని చూసి కొన్ని మొహమాటాలు ఎవరేమనుకుంటారో నని  సిగ్గుపడి పోవటాలు మానేయాలి. ఈ ఆమధ్య రాధికా ఇప్పడి వెల్లుమ్  అనే సినిమాలో బస్ డ్రైవర్ పాత్రలో నటిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ మంజిమా మోహన్ జంటగా నటించే ఈ చిత్రం గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రాధికా గిరగిరా బస్ నడిపారు. ఊరికే సినిమా నడపటాలు కాదు. నిజంగానే నిపుణుల సమక్షంలో సినిమా ప్రారంభానికి ముందే […]

నాలో ఇంకో శృతి హాసన్

దక్షిణాది తో  పాటు హిందీ లో కూడా నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకుంటోంది శృతి హాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటోంది. మనం చేసే పనుల్లో మార్పు కనిపించాలి నిన్న కంటే ఈ రోజు ఇవాళ్టి కంటే రేపు కొత్తదనం చూపించాలి ఇది సినిమాల ముచ్చట. వ్యక్తిగత జీవితం నేను మార్పు కోరుకొను. డబ్బు పేరు విజయం  నన్ను మార్చలేవు. కేవలం నేను శృతి హాసన్ నే . నన్ను […]

ఫుల్ గా తినేసి దుప్పటి కప్పుకుంటా

ఏదైనా సక్సెస్ వస్తే ఊరు వారి ఏకం చేయటం లేదా నష్టం వస్తే అదేదో పర్వతం మీద పడ్డట్టు బావులకు సిద్దపడటం  సాధారణం మానవుల లక్షణం . కానీ ఓటమి అనేది నాకు నచ్చదు. అంటోంది ప్రియాంక చోప్రా. ఫిల్మ్  ఇండస్ట్రీ లో సక్సెస్ లు ఫెయిల్యూర్ లు ఎంత కామనో మనుషుల భావోద్వేగాలు అంతే కామన్. సినిమా ఫ్లాప్ అయితే ఒక్కళ్ళు ఒక్క రకంగా బాధపడతారు. మరి ప్రియాంక ఏం చేస్తుందో తెలుసా ఫుల్లుగా తిని […]

పవర్ ధనం కంటే విలువైనవున్నాయి

నీహారికా , లైఫ్ కూల్ గా సక్సెస్ ఫుల్ గా పదిమందిలో గుర్తింపు ఉండేలా సాగితే బావుంటుంది అన్నావు. అంటే వ్యక్తిగత పరిపూర్ణత కావాలి. సామజిక గౌరవమూ  దక్కాలి. ఇవి రెండు కావాలంటే మనలోని శక్తినీ నైపుణ్యాన్ని గుర్తించి వాటిని సరైన తీరులో ధోరణిలో ఉపయోగించుకోగలగాలి. జీవితం సక్సెస్ ఫుల్ గా సాగాలంటే ఐపోతుందా. వ్యక్తిగత పరిపూర్ణత కు విజయం ఆరోగ్యం ప్రధాన పఠనాలు. వీటితో సంతోషం సంపదా  రెండు దక్కుతాయి. చాలా మంది దృష్టి లో […]