• ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం చాలా అవసరం పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆహారంలో ఉండే ఐరన్ గర్భశక్తి శిశువు ఆరోగ్య వృద్ధికి రోగ నిరోధిక శక్తి పెంచేందుకు సాయపడుతుంది. అలాగే నిద్ద రక్త కణాల వృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. విటమిన్ బి - 12 తో శిశువు శరీరంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఎముకల పటుత్వానికి విటమిన్ డి ఎంతో యూఏపీయోగం. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో ఈ డి విటమిన్ ఉపయోగం ఎంతగానో ఉంటుంది. ఐరన్ రక్తకణాల లోపాల్ని తగ్గిస్తుంది అనీమియా ను నిరోధిస్తుంది. ఎముకల నిర్మాణం లోనే కాదు శరీరంలోని ఇతర అవయవాల పని తీరుకు కూడా కాల్షియం ఆవశ్యకత వుంది. గర్భవతి గా ఉన్నప్పుడు అన్ని రకాల విటమిన్ల తో కూడిన ఆహారం ఎలా తీసుకోవాలో న్యూట్రషియన్ల సలహా తీసుకోవాలి .

    పుట్టబోయే శిశువు ఆరోగ్యం వీటితోనే

    ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం  బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం  చాలా…

  • ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి తో వ్యాయామం చేస్తున్నారు. ప్రవతలు ఎక్కటం స్విమ్మింగ్ చేయటం పై ద్రుష్టి పెట్టారు చాలా మంది. సూపర్ హెర్బ్స్ వాడకం పై ఆసక్తి పెట్టారు. ఈ ఏడాది చాలా మంది పంచదార వాడకం తగ్గించారు . సహజ సిద్దమైన ఆహారం తీసుకుంటున్నారు. ఆకలి వేస్తేనే ఏదైనా తింటున్నారు. టీ కాఫీ లకు బదులుగా గ్రీన్ టీ తాగుతున్నారు. ఎంత దూరం నడిచాం ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అన్న విషయాలు దాదాపుగా సగానికి పైగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ గా ఉపయోగపడింది. ఆఫీసుల్లో వెల్ నెస్ కాన్సెప్ట్ బాగా పెరిగింది. ఆఫీసుల్లో యోగ క్లాసులు నిర్వహించారు. అలాగే ఫిట్ నెస్ అంశాలన్నీ వంట పట్టించుకుంటున్నారు. రన్నింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తానికి ఆరోగ్య ప్రాధాన్యత లిస్ట్ లో మొదటి స్థానంలో వుంది.

    ఆరోగ్య స్పృహ పెరిగింది

    ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి…