• సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్ దివేకర్ కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ ఏమీ తినలేదు. నెయ్యి వాడాను పిజ్జా లు తిన్నాను పరోటాలు లాగించాను ఆకలేసినంతవరకు తిన్నానన్నారు. కానీ ప్రెగ్నెన్సీ కి ముందు సినిమాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉందో ఇప్పుడు వెంటనే అలంటి షేప్ ;లోకి మారిపోయింది కరీనా. నలుపు రంగు హాఫ్ షోల్డర్ బార్ డాట్ డ్రెస్ ధరించిన కరీనా కపూర్ ఫోటో చూసి అందరూ ఎంత బావుందో అనేసారు. ఏ బ్యూటిఫుల్ మదర్ ని చూసి సైఫ్ ఏమని అంటాడో.. డిసెంబర్ లో మగబిడ్డను జన్మనిచ్చిన కరీనా రెండు నెలలకే రుజుత్ ఆధ్వర్యంలో తిరిగి చక్కగా అయిపోయారు. ఈ క్రెడిట్ అంతా రుజుత్ దే నన్నారు కరీనా...

    రెండింతలు అందంతో కరీనా

    సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత…

  • రుజుత్ దివేకర్ కు రుణపడి ఉండచ్చు అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిందీ డైటీషియన్ . కరీనా కపూర్ ఆలియా భట్ వరుణ్ ధావన్ ఇలా ఎందరో సెలబ్రెటీల ఫెవరెట్ డైటీషియన్ రుజుత్. డైటీషియన్లు ఏవీ తినద్దు మొర్రో అని మొత్తుకుంటారు కదా. ఈవిడైతే అన్నం నెయ్యి చక్కెర జీడిపప్పు ఇలా బలాన్నిచ్చే ఏ ఆహారమూ వదులుకోవద్దు. సంప్రదాయ భారతీయ ఆహారం శుభ్రంగా తినండి. అంటే తృప్తిగా వ్యాయామం చేయండి. హాయిగా నిద్రపోండి అంటుందామె . స్థానికంగా వుండే పండ్లు సీడ్ ఆయిల్ కొబ్బరి పోహా ఉప్మా తెల్లన్నం ప్రతిరోజు నెయ్యి పళ్లతో చక్కగా నమిలి తినగలిగే పండ్లు కూరగాయల చేరుకులు ఇలా అన్నీ ఆకలేసినంత తినండి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఈవిడ శిష్యరికం చేసి 18 నెలల్లో 180 కిలోల బరువు తగ్గాడు. బహుశా ఈవిడ ట్రీట్మెంట్ విధానాలు మన దగ్గరకువచ్చే ఉంటాయి. వేతకండి ఆమె వెబ్సైట్ ని.

    బాగా తిని తగ్గదంటున్న రుజుత్

    రుజుత్  దివేకర్ కు  రుణపడి ఉండచ్చు  అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి  బంపర్ ఆఫర్ ఇచ్చిందీ  డైటీషియన్ . కరీనా…