• ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు అచ్ఛం ఆభరణాల్లాంటి ఎంబ్రాయిడరీలు జత చేసారు డిజైనర్లు. అందమైన చీర ఉందనుకోండి దానికి తగిన ఆభరణాలుంటేనే ఏదైనా పార్టీలు ప్రత్యేకం. కానీ అదే ఎంబ్రాయిడరీ జరీ మెరుపులు బ్లౌజ్ తోడైతే . అందులోనూ మంచి ముత్యాలు కుందన్ వెండి బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ ఉందనుకోండి ఇక నగల అవసరం ఏముందీ . అలాగే నెక్ కాలర్ పార్టీకి హ్యాండ్ కప్స్ కి ఎంబ్రాయిడరీ జత చేస్తే వేరే నగలే అక్కరట్లేదు. హైనెక్ స్టయిల్ బ్లౌజ్ కు పాజరీ ఎంబ్రాయిడరీ చేసి సాదా సీదా చీర కట్టుకున్న వజ్రాభరణాలు పెట్టుకున్నంత అందం. ఏదైనా వేడుక కు లెహెంగా ఓణీ కావాలనుకుంటే మొత్తంగా డిజైనర్ క్లాత్ తోనే ఆ లెహెమ్ టేస్ట్. ఇవన్నీ ఇప్పటి ట్రెండ్ చేతికొక్క గాజు కూడా వేసుకోవాలిసిన పనిలేదు. అన్నీ డిజైనర్ పనితనమే . నిలువెత్తు బంగారు బొమ్మలా నిలబెట్టాలన్న ఆభారణాలు పోలిన ఎంబ్రాయిడరీ తో మొత్తం డ్రెస్ అంతా నింపేస్తున్నారు. ఇప్పుడిక బంగారు నగలు వజ్రాలు ఈ డ్రెస్ ల ముందు దిగదిడుపే.

    అచ్ఛం నగల్లాంటి డ్రెస్ లు

    ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు…

  • పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ లేనంత గొప్పగా ఉండాలనుకుంటున్నారు ఆలా అవకాశం సముద్ర గర్భంలో ఏకంగా గాలిలో ఎగిరే బెలూన్ లో కూడా పెళ్లిలవుతున్నాయి . ఇక పెళ్లికూతురు ఎలా ఉండాలి. ప్రధానం రోజు మెహేందీ పండగ రోజు ఏకంగా పెళ్లి రోజు ఆమె అలంకరణ ఆహార్యం ఎంత గొప్పగా ప్రత్యేకంగా ఉండాలి. సంప్రదాయం ఆధునికత కలిసిన డిజైనర్ లుక్ తో అమ్మాయి మెరిసిపోవాలి. ఒక సోయగాల చీర అయి ఉండచ్చు. చీరని అనార్కలీ ఫ్యాషన్ నేలను జారాడే లెహెంగా మోడల్ లో కావచ్చు. లంగా వోణీ కలిపి కొట్టేసి మొత్తంగా బంగారు జరి పనితనం ఉట్టిపడేలా ఎంబ్రాయిడరీ చేసి పెళ్లి దుస్తుల్ని కూడా ఫ్యాషన్ డిజైనర్స్ చేతిలో మంత్రదండం అనే క్రియేటివిటీ తో అద్భుతాల సృష్టిస్తున్నారు. అలాంటి లేత రంగుల ఉషోదయాలు చీకటి వెలుగులు మెరుపులు పట్టు చీరలపై పూర్తీ ఖరీదైన ముత్యాలు రాళ్ల ఎంబ్రాయిడరీ లు ఆన్ లైన్ లో సందడి చేస్తున్నాయి. పెళ్లి స్పెషల్ చీరల పై వీలుంటే ఓ లుక్ వేయండి.

    స్పెషల్లీ డిజైన్డ్

    పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ  లేనంత గొప్పగా…