• నీహారికా .... చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు అని పదిసార్లు అన్నామనుకో ఇంకంతే ... ఆ నెగిటివ్ ఫీలింగ్ మన చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అదే రోజుకో పది కొత్త మాటలు నేర్చుకుంటూ ఒక సంవత్సరం నిష్టగా అభ్యాసం చేస్తే ఇంగ్లీష్ భాషే మన సొంతం అవుతుంది. రాదు చేయను కష్టం నావల్ల ఏమవుతుంది లాంటి నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకునేకూడదు. భవిష్యత్తు పైన విశ్వాసం లేకపోతేనే అలంటి మాటలొస్తాయి. ఎవరైనా ఎలా ఉన్నవని అడిగితే గ్రేట్ ఎక్స్లెంట్ హ్యాపీ అంటూ మనస్ఫూర్తిగా చెప్పామనుకో మన మనసు వాటిని అంగీకరించి ఆమోదం చెపుతుంది. మనకు తెలియకుండా ఆ ప్రభావం మనసు పైన పడుతుంది. అవే నమ్మకాలవుతాయి .మొత్తం మన బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్ గా మారిపోతుంది. దాన్ని బట్టి సత్ఫలితాలుంటాయి. ఇందాక అన్నావే .. ఎన్ని అద్భుతమైన ఉదయాలు. ఎన్ని పూలు వికసించాయి . ఎంత మంది చిరునవ్వుతో మనల్ని పలకరించారు? ప్రకృతి అందించిన ఎన్ని కమ్మని ఫలాల్లో ఒక ముక్క మన నోటికిచేరింది. మనకి దొరికిన ఎన్నింటిని మనం మన చుట్టూ చేరిన వాళ్ళకి ఇవ్వగలిగాం. ఎన్ని చల్లని చూపుల దీవెనలు దక్కాయి. ఇవన్నింటినీ పదిలంగా పట్టుకుని కొత్త సంవత్సరం వైపు చూస్తుంటే ఎంత బావుందీ ? జీవితమా నువ్వెంత విలువైనదానివి !

    ఈ మాటలకెంత శక్తీ

    నీహారికా …. చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు…

  • నీహారికా ,ఎంత స్థాయి ఉద్యోగం చేస్తున్నా కనిపించని అణచివేత స్పర్శకు తెలుస్తోంది అన్నావు. బాగా గుర్తించావు. ఈ పరోక్ష వివక్ష కు నువ్వే సంధానం చెప్పాలిసుమా.. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఒక సమావేశం జరుగుతుందనుకో. ఆడవాళ్లే సర్వింగ్ అంతా చేస్తారనుకుంటారు. అలంటి వడింపులు ఇక్కడ అందరూ ఉద్యోగులే కనుక అందరూ చేయాలి అని నీకు నువ్వే చెక్ పెట్టుకోవాలి. నలుగురు ఆడపిల్లలు మాట్లాడుకొంటుంటే ఆడవాళ్ల మీటింగ్ అనేశారనుకో వెంటనే తప్పు ఎవరైనా అలా మాట్లాడుకుంటారు అనచ్చు. స్త్రీలుగా మన స్థాయిని తగ్గించి మాటలివి. ఎవరైనా ప్రసూతి సెలవుపై వెళుతుంటే ఇంకేం చేస్తావు జాబ్ . పిల్లల్ని పెంచాలికదా అని సహుద్యోగి కామెంట్ చేస్తే వూరుకోవద్దు. ఇదే తండ్రివి అయ్యావు కదా నీ జాబ్ మానేస్తావా అని ఎవరైనా అంటారు. పుట్టిన బిడ్డ ఇద్దరి పెంపకంలో ఉండాలన్న భావన నీ మనసులో ఉంటే సరైన సమాధానం ఇవ్వటం చేతనవుతుంది. నువ్వు బాస్ ప్లేస్ లో వున్నావు. నెమ్మదిగా జాలిగా వ్యవహరిస్తే అది చేతకానితనం అవుతుంది. కఠినంగా వున్నావనుకో రాతిగుండె అంటాడు. అదే పురుషుల వైపు నుంచి నాయకత్వ లక్షణం అయిపోతుంది . నువ్వు జాబ్ లో వున్నావు. నే యుద్యోగం ఎంతవరకు మాతృ స్థానంలోకి వెళ్లి ఎవరికీ ఆదరింపులూ అక్కర్లేదు. నీ అందం పట్ల ఎదుటివారి పొగడ్తలు వద్దు. నువ్వు నువ్వుగా వుండు. నీతోటి స్త్రీల విషయంలో ఇలాంటి విమర్శలొస్తే వెంటనే ఖండించు. ఏమంటావ్ !

    ఆడపిల్లవనే మినహాయింపులెందుకు ?

    నీహారికా , ఎంత స్థాయి ఉద్యోగం చేస్తున్నా కనిపించని అణచివేత స్పర్శకు తెలుస్తోంది అన్నావు. బాగా గుర్తించావు. ఈ పరోక్ష వివక్ష కు నువ్వే సంధానం చెప్పాలిసుమా..…

  • నీహారిక, చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి వ్యక్తికి తనదైన కారణం వుంటుంది. ఆ కారణమె జీవిత లక్ష్యం. దాన్ని మనం రుచి చూడాలి. నాతో ఏముంది ఒక లక్ష్యం సృష్టించేందుకు అనుకోని వాళ్ళకి వాళ్ళ బలం మీద వాళ్ళ ద్రుష్టి పెట్టలేదన్నదే సమాధానం. పుట్టి పెరిగేటప్పుడు మన సర్వెంద్రియాలు ఎదో ఒక ఇష్టంతో ఉంటాయి. ఆ ఇష్టాన్ని దక్కించుకోవడం మన లక్ష్యం ఐన్ స్టిన్, రామానుజం వంటి వాళ్ళు నేనేం చేయాలి అనుకుని కూర్చోలేదు. వాళ్ళలోని సృజన వాళ్ళకి తెలిసిపోయింది.

    ఆ నవ్వు వెల ఎంత?

    నీహారిక, చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే  తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి…

  • నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. ఏ సమస్య పరిష్కించలేనంత క్లిష్టతరం కాదు. భయంతోనే మనిషిలో తెలివి తేటలు శక్తి సామర్ధ్యాలు మట్టికొట్టుకుపోతాయి. అప్పుడే పరిష్కారం ఒక్క బావే అన్న నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు చెప్పు ఏదీ సాధించకుండా ఏ ఒక్క మంచి పనీ చేయకుండా ఏ ఒక్క జీవితాన్ని మార్చకుండా జీవితం వద్దనుకోవటం ఎంత వరకు న్యాయం. కఠిన పరీక్షలు పెట్టినప్పుడు వైమీ అనుకోకూడదు. ట్రై మీ .... అని సవాలు స్వీకరించాలి. సర్వస్వం కోల్పోయినా భవిష్యత్తు ఒకటుంటుంది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో నెగ్గుకొస్తేనే సమర్ధుడైన నావికుడవుతాడు. ఎత్తు పల్లాలు ఎదుర్కుంటేనే మనిషి రాటుదేలుతారు. సమస్యల్లోనే సమర్ధత బయటపడుతుంది. ఇప్పుడు చెప్పు ప్రతి మనుషులు సమస్యల్ని ఎదుర్కునే ఇన్స్టింట్ సామర్ధ్యాలు ఉంటాయి. వాటని సమర్ధవంతంగా వాడుకుంటే చావు ఆలోచనలను చావు దెబ్బ తీయచ్చు. ఏమంటారు.

    ఎంత అందమైందీ జీవితం

    నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం…

  • శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి ఆత్మకు అద్దం పట్టేలా ఉన్నాయి. మహనగరాలలో ఒంటరిగా జీవించాలనుకునే మహిళలకు ఇళ్ళు దోరకడం ఎంత సమాస్యగా ఉంటుందొ వారు ఎంత వేదనకు గురవుతారో చూపిస్తుంది ఈ డాక్యుమెంటరీ. ఒంటరిగా ఉంటావా పెళ్లి కాలేదా,మగ స్నేహితులు ఉన్నారా వాళ్ళు ఇంటికి వాస్తరా లాంటి ప్రశ్నలతో మహానగరాలలో అమ్మయిలను ఆహ్వనిస్తున్నారు అని చెప్పింది శిఖామగన్ ఓ ఇంటర్యూలో. ఈ ప్రముఖ ప్రకటనల రూపకర్త టివిఏస్,బజాజ్ ,హిరో వంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలకు యాడ్స్ డైరక్ట్ చెస్తున్న ఎకైక మహిళా దర్శకురాలు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కల్ని కొబ్లిన్ లతో సహ మిగిలిన 15 మంది అమ్మయిలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రపంచం అమ్మయిల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో  స్త్రీల గొంతును ఈ చిత్రం వినిపిస్తుంది. ఇది మానవత్వానికి,స్త్రీల మనుగడకు సంభందించిన కథా అంటుంది శిఖామగన్

    ఇల్లడిగితే ఇన్ని ప్రశ్నలా….

    శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి…

  • ఈ ఏడాది నా కెరీర్ కు చాలా ఉత్సాహాన్ని తెచ్చింది ట్రిప్లెక్స్ రిటర్న్ ఆఫ్ వండర్ కేజ్ తో పటు అద్భుత సౌందర్య రాశిగా పేరున్న మహారాణి పద్మినిని చారిత్రాత్మిక పాత్రలో నటించబోవటం నేనెంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటోంది దీపికా పదుకొనె. ప్రేక్షకులతో డ్రీమ్ గర్ల్ అని పిలిపించుకున్న హేమ మాలిని నన్ను ఈ తరం డ్రీమ్ గర్ల్ అనటం కూడా నాకెంతో సంతోషాన్నిచ్చింది. పీకూ, బాజీరావ్ మస్తానీ వంటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కాదు గ్లామర్ పాత్రలూ నాకోసం వచ్చాయి. నేనేవీ ఎంచుకున్నవి కాదు. సవాల్ గా అనిపించేపత్రాలు నేను కోరుకుంటాను. అలాంటివి నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. పద్మావతి అవకాశం కూడా అలా వచ్చింది అన్నారామె. ఆమె నటించిన హాలీవుడ్ చిత్రంలో సెరెనా ఉంగర్ అనే చిలిపి అమ్మాయిగా నటించింది. గ్లామర్ గా కనిపించటంతో పాటు భారీ ఫైట్లు కూడా చేసిందిట దీపికా.

    మహారాణి పద్మిని గా దీపికా

    ఈ ఏడాది నా కెరీర్ కు చాలా  ఉత్సాహాన్ని తెచ్చింది ట్రిప్లెక్స్  రిటర్న్ ఆఫ్ వండర్ కేజ్  తో పటు అద్భుత సౌందర్య రాశిగా పేరున్న మహారాణి…

  • పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె ఎంతో కష్టం చేస్తారు రిస్క్ లు తీసుకుంటారు. గంటల రోజుల కొద్దీ జిమ్ లలో చెమటలు కారుస్తారు. నీరజ్ పాండే యాక్షన్ థ్రిల్లర్ బేబీ సినిమా కోసం తాప్సీ కొన్ని స్టంట్లు చేయాలి. ఇందుకోసం తాప్సీ సీరియస్ గా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సిరిల్ రేఫల్లీ బాగా పేరు పొందిన ఆర్టిస్ట్. అనేక హాలీవుడ్ హిట్స్ లో పని చేసాడు. అలాంటి స్టంట్ మాన్ దగ్గర తాప్సీ శిక్షణ తీసుకుంటుంది. సుకుమారుల్లా అనిపిస్తారు. కానీ ఎవళ్ళూ కష్టానికి భయపడరు. అలాగుంటేనే అదృష్టవంతులవుతారు.

    మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్న తాప్సీ

    పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె…

  • పిలల్లతో శరీర ధర్మాలు కొన్ని పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఎప్పటిదో పాతమాట. సమాజంలో నేర ప్రవృతి పెరిగిపోయింది కనుక పిలల్లకు కొన్నయినా వాళ్లకు ఉపయోగపడేవి వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగే విషయాలు చెప్పాలి. అంటోంది నమిత. చెన్నయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ హీరోయిన్ నమిత పిలల్ల పై జరుగుతున్న లైంగిక దాడులను ప్రస్తావిస్తూ ఎదుటి వ్యక్తి ముట్టుకొనే చెడ్డ స్పర్శ గురించి ఆ టచ్ వెనక గల ఆంతర్యం ఎమిటీ చెప్పాలి. దూరద్దేశ్యం తో టచ్ చేస్తే ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. ఎంత ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళ జీవితం అంత బావుంటుంది. అని చెప్పిందామె. నిజమే పిల్లల దగ్గర నిజం మాట్లాడేందుకు మొహమాట పడితే నష్టం ఎవరికి ?

    ఆ బాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలి

    పిలల్లతో శరీర ధర్మాలు కొన్ని పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఎప్పటిదో  పాతమాట. సమాజంలో నేర ప్రవృతి పెరిగిపోయింది కనుక పిలల్లకు కొన్నయినా  వాళ్లకు ఉపయోగపడేవి వాళ్ళని…

  • ఈమె పేరు షహనా బేగం ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్పూర్ గ్రామం. ఆ గ్రామంలో ఆమెను తుపాకీ చిన్నమ్మ అని పిలుస్తారు. భర్తతో కలిసి వ్యవసాయం చేసుకు బతికే ఈమె భర్తను బంధువులే ఆస్తి తగాదాల్లో చంపేశారు. ఇక వంటరిగా మిగిలిన షహనా బేగం లైంగిక వేధింపులకు గురైంది. ఆకతాయిల బాధ చూడలేక నాటు తుపాకీ ఒకటి కొని తనను తన పిల్లలను రక్షణ గా వుంచుకోవాలనుకుంది. తన బాధల్ని అర్జీ రూపంలో పెడితే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె చేతిలో తుపాకీ ఉంటుంది. ఆమె తుపాకీతో గ్రామంలోనే గృహహింస దాదాపుగా తగ్గింది. పంచాయతీ తీర్పులకు ఆమెను పిలుస్తారు. ఇప్పుడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా న్యాయం కోసం ఆమెను ఆశ్రయిస్తున్నారు. అల్లరి మూకలకు ఆమె పేరు వింటే సింహ స్వప్నం. ఆమె అక్షరం ముక్కరాని గ్రామీణ రైతు.

    తుపాకీ చిన్నమ్మంటే ఆకతాయిలకు హడల్ !

    ఈమె పేరు షహనా బేగం ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్పూర్ గ్రామం. ఆ గ్రామంలో ఆమెను తుపాకీ చిన్నమ్మ అని పిలుస్తారు. భర్తతో కలిసి వ్యవసాయం చేసుకు…

  • సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. చెన్నయ్ సైబర్ క్రైమ్ కు శృతి తరఫున వ్యక్తులు వచ్చి ఆ డాక్టర్ వేధిస్తున్న ఆధారాలు చూపెట్టి అతని మెయిల్ ఐడి ఫోన్ నంబర్ పోలీసులకు ఇచ్చారట. శృతి హాసన్ ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు డాక్టరు గురించి విచారించే పనిలో వున్నారు. ఎవరి పనివాళ్లని చేసుకోనిస్తే ప్రాబ్లమే ఉండదు.

    శృతికి ట్విట్టర్ బెదిరింపులు

    సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు…

  • శాక్షి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రముఖ విలన్ కనక ఆమెకు అవకాసాలు వస్తుంటాయి. అనుకోని అవకాశం ఎక్కడా లేదు. శ్రద్దా కపూర్ బాగా నటిస్తుంది. మంచి డాన్సర్ ఇప్పుడు కొత్తగా సొంతంగా పాటలు రాసుకుని ఓ లైవ్ కాన్సర్ట్ లో సంగీత ప్రియుల దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ మ్యుజిక్ షోలు స్టేజ్ ఎక్కాక రాక్ స్టార్ అయిపోయానంటుంది శ్రద్ధా కపూర్. మ్యూజిక్ హాలు ప్రేక్షకుల జోరు తో భయాలన్నీ పోయి, మొదటి స్టేజ్ షోకే ఆ స్టేజ్ అంటే ప్రేమ పెరిగిపోయిందిట. భవిష్యత్తులో మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ తెస్తనంటుంది. యాక్టర్ గా ఆమెకు ఎన్నో అవకాశాలు దావూద్ ఇబ్రహీం సోదరి హాసినా పార్కర్ జీవితం పైన నిర్మిస్తున్న హాసినా అన్న బయోపిక్ లో ఆమె నాటించ బోతుంది. సినిమాల్లో కూడా పాట పడుతుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది కూడా.

    లైవ్ మ్యుజికల్ షోల్లో శ్రద్ధా కపూర్

    శాక్షి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రముఖ విలన్ కనక ఆమెకు అవకాసాలు వస్తుంటాయి. అనుకోని అవకాశం ఎక్కడా లేదు. శ్రద్దా కపూర్ బాగా నటిస్తుంది. మంచి…

  • ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. ఆ ఛాలెంజ్ నిఅలవోకగా జయించి 32 కేజీల బరువు తగ్గిందామె. ఈ బరువు తగ్గే పనిలో సోనమ్ అనేక మంది ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఒక విభాగంలో ఒక ట్రైనర్. ఆమె మంచి కథక్ డాన్సర్. పుడుతూనే ఎవ్వరికీ మంచి సౌందర్యం ఆకృతి ఉండదు. ఎదిగే కొద్దీ శరీరాన్ని చక్కగా మలుచుకోవాలి. ఇప్పటి తారలు వాళ్ళు రెడ్ కార్పెట్స్ పైన నడవటం కోసం వెండి తెరపై మెరవటం కోసం ఎనెన్ని కష్టాలు పడ్డారు? ఎంత నోరు కట్టేసుకున్నారు?

    అందం వెనక ఎంతో కధ వుంది

    ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని…

  • వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా నిర్మాత ప్రియాంకనే. అయితే ఆమె ఈ సినిమాలో నాటించ లేదు. పాట చాలా బాగుంది. 'నాన్న నీ మనసు లోని బాధను నేనెప్పుడు అర్ధం చేసుకో లేదు. నేనిలా జీవించాలి చెప్పు నేనెటు వైపు వెళ్ళాలి నాకేమి తెలియడం లేదు. నిన్నిలా అడుగుతుంది నీ ప్రియమైన కూతురు. నువ్వు నా జీవితానికి నిజమైన అర్ధం ఇచ్చావు నాన్న....... దయచేసి ఆగు........... వెళ్ళిపోకు. పాట ఇలా సాగుతుంది తండ్రి వెంటిలేటర్ మీద వున్నప్పుడు కూతురు పాట ఇది. 4 నిముషాల 12 సెకెండ్లు వున్న ఈ పాట నెట్లో ఎంతో మంది విని ఇష్టపడ్డారు.

    ప్రియాంక పాటకు ఆరు లక్షల హిట్లు

    వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా…

  • యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట ఆమె. “చన్న మేరియో” అనే పాటలో అనుష్క ధరించిన లెహంగా బరువు పదిహేడు కేజీలు. అందుకు సరిపోయే నగల బరువు మూడు కిలోలు. ఈ ప్రత్యేక నగల్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. పాటలో రాణీలా అనుష్క హుందాగా కనిపించేందుకు మల్హోత్రా ఈ లేహంగాను నృరోస్కీ, జర్దోసీ, విలువైన రాళ్ళు, అద్దాలతో అందంగా రూపొందించాడు. పై దుపట్టా కూడా ఖరీదైందీ, బరువైందే. ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజులు జరిగింది. అనుష్క రెండంతస్తుల మేడ లోని మొత్తం 30, 40 మెట్లు ఎక్కేదిగా నృత్యం చేసింది. ఇరవై కేజీల బరువుతో సన్నగా, నాజుగ్గా వుండే అనుష్క ఎంత కష్ట పడిందో. అయితేనే పీకే, సుల్తాన్, యే దిల్ హై ముష్కిల్ అన్నీ ఆమెకు పేరు తెచ్చినవే.

    ఇరవై కేజీల బరువైన కాస్ట్యుమ్స్ తో

    యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట…

  • కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో సినిమాల్లో కొన్ని వందల మందితో పని చేసిన అనుభవం ఆమెది. జనతా గ్యారేజ్ తో ఒక సక్సెస్ సంపాదించుకొన్న సమంత, ‘సమయo’, ‘ డబ్బు‘ ఈ రెండూ ఒక్కటే. ఉన్నప్పుడు విలువ తెలియదు అవి దూరమైతే తిరిగి రావు అంటోంది. నేను ఖాళీ, నేను బిజీ అన్న రెండు పదాలకు నేను పెద్దగ ప్రాధాన్యత ఇవ్వను. ఖాళీగా ఉన్నమనుకొంటూనే చేతి నిండా పని పెట్టుకోవచ్చు. చేయాల్సిన పని చాలా ఉన్నా ఖాళీ గా ఉండవచ్చు. ఖాళీనా, బిజీనా అన్నది పనిని మనం ఎంత ఆస్వాదిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి వుంటుంది. డబ్బుని, సమయాన్ని వాడుకోవడం తెలియాలి అది తెలిస్తే రెండింటికీ కొరత వుండదు అంటోంది సమంత. కరక్టే కదా పని వుంటే పని ఎక్కువైందనీ, పనిలేకపోతే పనిలేక ఇబ్బందిగా వుందని చెబుతుంటాం! మరి సమంత కరక్టే కదా!

    డబ్బు, సమయం రెంటినీ కరెక్ట్ గా వాడాలి

    కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో…

  • ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా వద్దందిట ఐశ్వర్య. ఐశ్వర్య జార్జ్ బుష్ తో పాటు విందుకు రమ్మని అమీర్ ఖాన్ తో పాటు ఐశ్వర్య కి ఆహ్వానం అందినా ఎదో షూటింగ్ కోసం ఆ అవకాశం వదులుకొందిట. ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొన్న తోలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్య. మేడమ్ టుస్సాట్స్ మ్యూజియం లో స్థానం సంపాదించినా తొలిభారతీయ నటి ఐశ్వర్య ఇంత అందాల బొమ్మ నటిస్తే ఏ దిల్ హై ముష్కిల్ బాక్సాఫీస్ బద్దలు కొడితే ఆశ్చర్యం ఏముంది?

    అందం పేరు ఐశ్వర్య

    ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత…

  • సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా సినిమాల్లో మచ్చిక చేసిన గుర్రాలు వాడతారు. కానీ కంగనా అన్ని రకాల గుర్రాలపైనా స్వారీ చేసి బరువు సాధించాలనుకుంటుందిట. వివిధ జాతుల గుర్రాలు వాటిని మచ్చిక చేసుకునే విధానం గాయాలైతే ప్రధమ చికిత్స ఇవన్నీ జర్మనీ లో నేర్పిస్తారు. ఝాన్సీ రాణి వేషం వేయాలంటే ఈ మాత్రం కష్టపడకపోతే ఈ పాత్ర కు ఎలా న్యాయం చేస్తానంటోంది. కంగనా. తగిన బరువు పెరుగుతోందిట. ఆ అపాత్రకు కావలిసిన దుస్తుల విషయంలో కూడా చాల శ్రద్ధ తీసుకుంటోందిట. మనం తేర పైన నిజమైన వీరనారిని చూస్తామన్నమాట.

    ఆ పాత్ర కోసం ఆ మాత్రం రిస్క్ వద్దా ?

    సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్  పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా…

  • సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో ముందుంటారు. వాళ్ళల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంది నా మనస్సు బరువెక్కి పోయింది. ఆడపిల్లలకు రక్షణ పద్ధతుల పై శిక్షణ ఇవ్వాలనిపించింది. శారీరకంగా ధృడంగా వుండటం కంటే ముందు మానసిక ధృడత్వం కూడా చాలా అవసరం. దేశంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళల పై దాడులు జరగడం వంటి వార్తలు ప్రతి రోజు కనబడి నిద్రలేకుండా పోతుంది. అసలు బాధితులకు అందంగా నేను నిలబడతాను. నా వంతు వాళ్ళు కోలుకునేందుకు సాయం చేస్తా అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్.

    బాధితుల కోసం నేనున్నానన్న రకుల్

    సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో ముందుంటారు. వాళ్ళల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంది…

  • చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ ని ఎవ్వరి సాయం అడగకుండానే తానే కష్టపడి చేసేదట. తనకు సంబంధించిన ప్రతి పనీ పెద్దవాళ్ళు వాదిస్తున్నా వినకుండా తనే చేసుకునేదట. ఆలా అలవాటై ఇవ్వాళ మంచి కధలు పాటలు రాయగలుగుతున్నానంటోంది. బాల్యం ప్రభావం వల్లనే స్వతంత్రంగా ఆలోచించటం నిర్ణయాలు తీసుకోవటం చేతనైందట. ప్రేమమ్ , సక్సెస్ తర్వాత కాటమ రాయుడు ,సింగం 3 లో నటిస్తున్న శృతి ఆల్ రౌండర్ మ్యూజిక్ ఆల్బమ్స్ పాటలు యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఒకటేమిటి సినిమాకు సంబంధించిన ఎన్నో విభాగాల్లో ఆమె తేలిగ్గా ఇమిడిపోతోంది.

    ఇప్పటి ధైర్యానికి బాల్యంతో పునాది

    చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు  కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన…

  • బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ అయింది. ఫెమినిస్ట్ మహిళలు ఆ సిద్ధాంతాలతో జీవిస్తుంటే వాళ్ళకే విషయం తెలుస్తుంది మీరు ఫెమినిస్టా అన్న ప్రశ్నకు జవాబిస్తూ గత ఏడాది నేను 365 రోజుల్లో 340 రోజులు పని చేశాను. ఐదేళ్లుగా ఇంతే కష్టపడుతున్నా. సంగీతం నా పర్సనాలిటీ ని ప్రోజెక్ట్ చేసింది. సినిమా దాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ రెండిటినీ నేను నియంత్రించుకోలేను. అన్నది శృతి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ సెలబ్రెటీల గారాల పట్టి తన ఏడోవ ఏట రెండు లక్షల మంది ప్రేక్షకుల ముందు తొలిసారిగా పాట పాడిందట. అప్పుడా అమ్మాయిలో భయం లేదు జంకు లేదు అచ్చంగా ఇప్పుడున్న శృతి కూడా ఇలాగే మారకుండా వుంది.

    నేనో రాక్ స్టార్ అన్నది శృతి

    బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో…