Thursday, 06 Aug, 2026

అమ్మానాన్నలతో దాపరికాలు వద్దు

నీహారికా , నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకున్నా ఏదోరకంగా నాకు తెలియటం మంచిదే అయింది. ఇది నీ ఒక్కదాన్ని సమస్యే కాదు. టీనేజర్లు అందరిదీ. నేను తప్పకుండా  మీ అమ్మతో మాట్లాడతాను. నీ సమస్య డాక్టర్ తో సంప్రదించాలి. నీ శరీరం గురించి నీకు అర్ధమయ్యేలా చెప్పగలిగేది డాక్టరే. టీనేజ్ అనేది బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగిడే సమయం. ఈ కాలంలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వ్యక్తిగత శుభ్రత లేదా వాటిని సంబంధించి ఏ విషయం అయినా […]

సర్టిఫికెట్స్ కావాలా ? కెరీరా ?

నీహారికా , చదువుఒక్కటే చాలదు జీవితంలో గెలవాలంటే ఇంటి బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి. అని మీ అమ్మ అంటోందనీ  అన్నీ సమర్ధించగలమా అన్నావు. ఈ మాట పెప్సీకో సీఈఓ  ఇంద్రా నూయీ కూడా చెప్పింది. మా అమ్మాయిలు ఎదిగిన తర్వాత నన్ను పొడుగుతున్నారు కానీ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత తెలుసుకోలేక మా అమ్మను పిలిపించుకొన్నాను. మా అమ్మ కూడా ఇంట్లో నువ్వు తల్లివి కోడలివి అనేది అమ్మాయిలకు  అన్నీ కావాలంటే కుదరవు అని ఆమె ఒక […]

ఇదింకో అదనపు మంచి లక్షణం

నీహారికా , మనకి అస్తమానం  అందరు ఎదో ఒకటి చెప్పాలని చూస్తారు. వినటం చాలా బోర్ అనేసారు. నీకో విశేషం చెప్పనా …. విజేతలకుండే మొదటిలక్షణం ఎదుటివాళ్ళ ఆలోచనలు స్వాగతించటం . అన్ని రకాల ఆలోచనలు మనకే రావుకదా. కొత్త ఆలోచనలు రావాలి. ఇది కొత్త విషయాలకు కొదవ లేని కాలం. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే కదా సోషల్ మీడియా ఉపయోగించుకునేది. చిన్న చిన్న వ్యాపారాలు ఆలోచనలోకి వచ్చాయనుకో . స్టార్ట్ప్స్  గురించి పదిమందికీ […]

తప్పునీదా ఇతరులదా ? తేల్చుకోముందు

నీహారికా , ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా. ఇది ఇంకో పద్యంలోని లైవ్. ఎంచెపుతున్నాడంటే  కోపం వలన మనిషి తన వివేకాన్ని ఆలోచననీ కోల్పోతున్నాడు. పరాజయానికి కారణం విశ్లేషించుకోలేడు. అంచేత ఎంతటి విద్యావంతుడైన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అందరినీ దూరం చేసుకుంటాడు అని. అలాగే శాంతం  వలన మనిషి తన ఆలోచనలు అదుపులో వుంచుకోగలుగుతాడు. అన్నింటా జయం […]

సంతోషమొక ఉత్తుంగ తరంగం

నీహారికా , ఒక విషయం గమనించావా మనం సాధారణంగా పలకరించుకొనేప్పుడు బావున్నారా ? అంటాం. అంటే ఏమిటి మీరు సంతోషంగా ఉన్నారా ? జీవితం బాగా నడుస్తోందా అని. ఇప్పడూ చూడు సంతోషంగా అంటే సంతోషాన్ని ఎలా కొలిచి చెపుతాం ? ఈ లెక్కన మన భావాల్ని మనం ఎవరిపట్ల ఎంత ప్రేమగా ఎంత కోపంగా ఎంత ద్వేషంగా ఉన్నామో చెప్పగలమా ? మన మనస్థితిని నిర్ణయించేది మన దృక్పధం. పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే ప్రతి క్షణం […]

మొగ్గలోనే తుంచకపోతే మనకే నష్టం

నీహారికా , స్నేహంలో ఎంత జాగ్రతగా ఉంటున్నా ఎందుకో ఎదో ఒక మాటకు అపార్ధాలు వస్తుంటాయి. నేను కరెక్ట్ గానే మాట్లాడననుకుంటాను. అన్నావు. సరే అవతలివాళ్ళు అలాగే అనుకుంటారు కదా నీహారికా. మానవ సంబంధాలలో మంచిని గుర్తించి వప్పుకోకపోతే వ్యతిరేకాంశాలే కదమ్మా మిగిలేవి. ఈ వ్యహాతిరేకాంశాలను ఎప్పటికపుడు బలహీనపరచాలి. ఆలా మొగ్గలోనే తుంచకపోతే చివరకి సంబంధ మూలాలనే తినేస్తాయి. పరిషారం మన మనసులోనే ఉంది. మనసుని ఎప్పుడైతే అద్దం లా ఉంచుకుని మనసు తలుపులు తెరచి ఎదుటివాళ్ళు […]

పట్టు పరికిణీ తో సంక్రాంతి సౌందర్యం

సంక్రాంతి అంటేనే గ్రామీణ సౌందర్యం. ఆడపిల్లల సంప్రదాయ దుష్టులైన ఓణీ పరికిణీ ల అందం తిరుగులేనిది. ఈ అందమైం ప్రకృతికి ఎన్ని రంగులున్నాయో పరికిణీ ఓణీలకు అన్ని అందాలున్నాయి. ఒక అద్భుతమైన చిత్రకారుడు దీక్షగా ఒక పండగ సౌందర్యాన్ని ఆవిష్కరించాలనుకుంటే పట్టు పరికిణీ, ఓణీ,జడలో పువ్వులు కాళ్లకు అందెలు జడకుచ్చులు ఉండాల్సిందే. కళ్ళు చెదిరే రంగులతో వుండే కంచి పట్టు పరికిణీ పైకి ఎలాంటి డిజైన్ లేని సాదా ఓణీ బుట్ట చేతుల బ్లవుజు ఉంటే అది […]

ప్రకృతి చెప్పే పాఠాలు వినాలి

నీహారికా , ఈ రోజు నీకో మంచి విషయం చెప్తాను. ఈ ప్రకృతి  మనకెలాంటి పాఠాలు చెపుతుందో చూడు. ప్రపంచంలో రెండు సముద్రాలున్నాయి. డెడ్ సి , సీ ఆఫ్ గెలీలీ. ఇవి పెద్ద సరస్సులు . ఈ రెంటిలోకి జోర్దాన్ నదీ జలాలు వస్తాయి. డెడ్ సీ సముద్ర మట్టం కంటే తక్కువగా ఉంటుంది. దాని నుంచి నీరు బయటకి పోదు. ఆనీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఏ ప్రాణీ బతకదు. సీ ఆఫ్ గెలీలీ […]

ప్రతి క్షణమూ విలువైందీ

నీహారికా , మా అమ్మ తనని తాను ట్రీట్ చేసుకోదు. తన జీవితం తనది కానట్లుంటుంది. నేనెలా వుండాలా అని భయమేస్తోంది అన్నావు. నీ మనసులోకి సరైన సందేహం వచ్చింది. నువ్వు 16 ఏళ్ళ అమ్మాయిని ఇప్పుడే తెలుసుకో చాలా మంది ఆడవాళ్లు చేసే పొరపాటు ఇది. అందరి అవసరాలు చూస్తారు. అందరికీ కావలిసినవి అమరుస్తారు. వ్యక్తిగత అవసరాలు మరచి పోతారు. చివరికి భోజనం కూడా ఇంట్లో అందరి భోజనాలు స్థిరపెట్టటం సరే. కానీ ఇల్లాలు తన […]

పిల్లలకి చెప్పకపోవటం తప్పే కదా

నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన  విషయాల్లో అజ్ఞానంతో వుంటారు కనుకనే వాళ్ళు సులువుగా మోసపోతారని  నువ్వన్నమాట మనసుని గాయం చేస్తోంది. నిజమే. పదేళ్ల వయసు వచ్చాక శరీరంలో చోటు చేసుకునే మార్పులు అకస్మాత్తుగా ఆడ మగ పిల్లల మధ్య కలిగే ఆకర్షణ పిల్లల మనసు అల్లకల్లోలం చేస్తాయి. సరైన లైంగిక ఒక్కటే వాళ్ళని ఆ స్థితి […]

రిస్క్ లేనిదే జీవితమే లేదు

సౌదామినీ,  అందరూ ఒకేలాగా చదివి ఒకే డిగ్రీ తీసుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళే వేళల్లో ఒక్కళ్లుగా  నిలబడతారు. ఇది జతకపు  ప్రభావమేనా అన్నావు. జూకర్ బెర్గ్ ఏమంటాడంటే రిస్క్ తీసుకోకపోవటమే మనం చేస్తున్న పెద్ద రిస్క్. కరెక్ట్. రిస్క్ లేనిదే జీవితం లేదు. అంతేకానీ జాతకం కాదు. మనం పాకేదశ  నుంచి ప్రతి దశలో మనకు తెలియకుండానే రిస్క్ తీసుకుంటాం. సైకిల్ తొక్కటం రద్దీగా ఉండే రహదార్లలో  వేగంగా ప్రయాణించటం అన్నీ రిస్క్ కదా. ఒక్క రోజులో […]

అసూయ అడవిలో కార్చిచ్చు ఎంతో

నీహారికా , ఈ లోకం లో  ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది బాధ పడేవారిని బాధకు కారణమైన వారినీ సమానంగా దహిస్తుంది. ఈ లోకం లో ఆనందం లేకపోవటనికి ఎన్నో కారణాలు. కోరికలు అంచనాలు అవసరాలు బులపాటం  అసంతృప్తి అత్యాశ అన్నింటికంటే ప్రధానం ప్రమాదం అసూయ. అసూయాపరులకు  రెండే చింతలు తనకులేదని ఇతరులకు ఉందనీ. మానసిక శాస్త్ర పరంగా చుస్తే ఈ […]

నీ బుగ్గ తాకిన ఆ స్పర్శ నీకేమిచ్చిందీ

నీహారికా , అమ్మేపుడూ విసుక్కుంటుంది. ఒక్కోసారి నా పైన ప్రేమ లేదేమో అనిపిస్తుంది. ఆవిడ నన్ను ప్రేమిస్తోందా ? లేదా నాకే ప్రేమంటే ఏమిటో తెలియదు అన్నావు నిజమే మనసు నిండా ప్రేమ దాచేసుకుని దాన్నిక్రమశిక్షణ పేరుతోనో లేదా ఇంకేం కారణం వల్లనో వ్యక్తం చేయకుండా మనసులో దాచేస్తే ఫలితం ఉఇలాగే ఉంటుంది. చెప్పి తీరాలి . నువ్వు నాకెంతో అపురూపం అని ఎదిగే పిల్లల మనసులోకి ఎక్కేలా చెప్పాలి. ఒక వయసు పిల్లలకి మంచి గైడెన్స్ […]

తేనెల్లాంటి మాటలు స్నేహితుల్ని తెస్తాయి

నీహారికా, నువ్వడిగిన దానికి ఓ పద్యం సమాధానంగా  ఉంది. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘ అని. ఎవళ్ళనీ నొప్పించకుండా సంతోషపెడుతూ స్నేహంగా ఉండటం కష్టమే. కానీ అసాధ్యం కాదు. అందుకు సుమతీ  శతకం లో చెప్పినట్లు తప్పించుకు తిరగనక్కర్లేదు కానీ మాటలు రువ్వినట్లు కాకుండా పిల్ల తెమ్మెర లాగా తాకినట్లు వాడితే అందరితో కలుపుకుపోవచ్చు. ఇరుగు పొరుగు స్నేహితులు బంధువులు తోటి ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఎవరితోనైనా చెరగని చిరునవ్వుతో మాట్లాడితే చాలు. […]

తీరుమారిపోతున్న యువతరం

నీహారికా , నిజమే నువ్వన్నది. ప్రతి తరం తర్వాత తరాన్ని తక్కువ చేసి మాటాడుతుంది. కొత్త తరం కన్నా తమ తరం మెరుగైనదని చెపుతోంది. నువువ్ ఈ కొత్త తరానికి చెందిన దానివేకదా.. ఇటీవల వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ లో ఈ తరం స్వార్ధ చింతన 58 శాతం మందిలో ఉందని చెపుతోంది. చక్కని  జీతం సౌకర్యాలతో గడుపుతున్నారు. కానీ ఈ తరానికి ఉన్న ఒత్తిడి గతంలో లేదు. ఎన్నో రంగాల్లో ప్రగతి కానీ సామజిక […]

అమ్మెంతో నాన్నా అంతే

నీహారికా , అందరం అమ్మ గురించి మాట్లాడుకుంటాం ,మరి తండ్రి ప్రభావం పిల్లల పై వుండదా అంటారు. కరెక్టే తల్లి కొంచెం దగ్గరగా ఉంటుంది కనుక పిలల్లకు సర్వ సదుపాయాలు తనే చూస్తుంది. కనుక ఒక వేళ  జాబ్ చేసే అమ్మయినా పిల్లల విషయంలో ఉన్న సమయం అంతా ఖర్చు పెడుతుంది. కనుక ఆలా అనిపిస్తుంది కానీ టీనేజ్ పిలల్ల పైన తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గట్టిగా చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ […]

మాటే మంత్రమూ

నీహారికా, ఇది అడగాల్సిన ప్రస్నే. ఇప్పుడు కొత్త సంవత్సరం రేపు సంక్రాంతి ఇంకో రోజు ఉగాది. ఎప్పుడూ ఆత్మేయులకు మన చుటూ  వుండే వాళ్లకు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి ఎముంటుందీ అన్నావ్. ‘మాట ‘……. అవును మాటే మంత్రం. ఎన్ని మాటలున్నాయిరా ! బావుంది. అరే  చక్కగా వుంది. క్షమించండి కృతజ్ఞతలు సుమీ ,థాంక్స్ అండీ, సారీ బాబూ  అందించే బహుమానాలు. ఇవి నీకెందరినో స్నేహితులను బహుమతిగా ఇస్తాయి. ప్రతి నిమిషం నీ జీవితంలో శిరస్సు పైన […]

రేపటి ఆశల హరివిల్లు 2017

నిహారికా…………… రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆకాశంలో మెరిసే ఇంద్ర ధనస్సుతో పోల్చావు బావుంది. ప్రకృతి తో పోలికలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ఎవళ్ళూ గుర్తు చేయకుండా తనతో మార్పులు తెచ్చుకునే ప్రకృతి కంటే గొప్ప గురువు ఎవరుంటారు మనకి. కొత్త సంవత్సరపు శుభవేళ నా శుభాకాంక్షలూ ఇవే. ఈ అద్భుత ఘడియల్లో నేను ఎప్పుడూ మారేందుకు సిద్ధంగా ఉంటాను. నా ఆలోచనలు అభిప్రయాలు నన్ను నేను అభివృద్ధి చేసుకునే క్రమంలో మార్చుకుని అందరూ  నన్ను అభిమానించేలా ఆదర్శంగా […]

నిన్ను నువ్వు నిర్మించుకోమ్మా

నిహారికా , మనలో వుండే లోపం మనకు వెంటనే తెలియాలంటే ఎలా అన్నావు.  ఎదిగే వయసులో వున్న నువ్వు నీ శత్రువుని గుర్తించాలని తాపత్రయపడటం చాలా అవసరం. మనం సాధారణంగా అద్దం చూసుకుని కనిపించే ప్రతి బింబం ద్వారా మన బాహ్య రూపంలో కనిపించే లోటు పాట్ల ను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాం. కానీ ఆంతీర్లనంగా వుండే లోపాలు చూసుకునే అద్దం మనసే. విశ్లేషణ విచక్షణే ప్రతిబింబాలు. మనల్ని మనం నిస్పిక్షపాతంగా విశ్లేషించుకుంటే మన పట్ల మనం […]