• యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట ఆమె. “చన్న మేరియో” అనే పాటలో అనుష్క ధరించిన లెహంగా బరువు పదిహేడు కేజీలు. అందుకు సరిపోయే నగల బరువు మూడు కిలోలు. ఈ ప్రత్యేక నగల్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. పాటలో రాణీలా అనుష్క హుందాగా కనిపించేందుకు మల్హోత్రా ఈ లేహంగాను నృరోస్కీ, జర్దోసీ, విలువైన రాళ్ళు, అద్దాలతో అందంగా రూపొందించాడు. పై దుపట్టా కూడా ఖరీదైందీ, బరువైందే. ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజులు జరిగింది. అనుష్క రెండంతస్తుల మేడ లోని మొత్తం 30, 40 మెట్లు ఎక్కేదిగా నృత్యం చేసింది. ఇరవై కేజీల బరువుతో సన్నగా, నాజుగ్గా వుండే అనుష్క ఎంత కష్ట పడిందో. అయితేనే పీకే, సుల్తాన్, యే దిల్ హై ముష్కిల్ అన్నీ ఆమెకు పేరు తెచ్చినవే.

    ఇరవై కేజీల బరువైన కాస్ట్యుమ్స్ తో

    యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట…

  • ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా వద్దందిట ఐశ్వర్య. ఐశ్వర్య జార్జ్ బుష్ తో పాటు విందుకు రమ్మని అమీర్ ఖాన్ తో పాటు ఐశ్వర్య కి ఆహ్వానం అందినా ఎదో షూటింగ్ కోసం ఆ అవకాశం వదులుకొందిట. ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొన్న తోలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్య. మేడమ్ టుస్సాట్స్ మ్యూజియం లో స్థానం సంపాదించినా తొలిభారతీయ నటి ఐశ్వర్య ఇంత అందాల బొమ్మ నటిస్తే ఏ దిల్ హై ముష్కిల్ బాక్సాఫీస్ బద్దలు కొడితే ఆశ్చర్యం ఏముంది?

    అందం పేరు ఐశ్వర్య

    ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత…