• అల్లరి చేయడం ఇష్టం.

    నామ్ షబనా కోసం దాదాపు  ఏడాది పాటు సిద్దం అయ్యాను. మార్షల్ ఆర్ట్స్ ప్రతి రోజు రెండున్నర గంటలు నేర్చుకున్నా అంటుంది తప్సీ. మొదటి నుంచి తప్సీ…

  • అబద్దాల ప్రకటనలు చేయలేను.

    ఎంత డబ్బు ఇచ్చినా వ్యాపార ప్రకటనలు చేయ నంటోంది తాప్సి. నచ్చని పని నా చేత చేయించలేరు. మద్యని సంబందించిన ప్రకటణలో నన్ను నటించమంటే వద్దన్నాను. మద్యం…

  • ఐదు భాషలు మాట్లాడే తాప్సీ.

    సాఫ్ట్ వేర్ ప్రోఫెషనల్ గా పని చేసిన తాప్సీ తన కెరీర్ ను మోడలింగ్ వైపు నుంచి మళ్ళించి, జుమ్మంది నాదం తో సినిమాల వైపుకి వచ్చింది.…

  • ఫోర్బ్స్ పత్రికా ఈ సంవత్సరం వివిధ రంగాలతో సైతం ప్రదర్శించిన యువ కెరటాల జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు గల 30 మంది భారతీయుల జాబితాను 30 అండర్ 30 పేరిట ఫోర్బ్స్ విడుదల చేసింది . ఇందులో తాప్సీ పన్ను ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో చోటు సంపాదించింది. వివిధ భాషల్లో నటించిన తాప్సీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ దర్శకుడు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో రూపొందించిన పింక్ చిత్రంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో మీనల్ అరోరా పాత్రలో తాప్సీ చక్కని నట ప్రతిభ కనబరిచింది . అందాల తార తాప్సి కి ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందించటం తో పాటు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. చేతిలో ఎన్నో సినిమాల్లో బిజీగా ఉన్న తాప్సీ తన పాత్ర ద్వారా మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించినందుకుగాను ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. భవిష్యత్తులో మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం పై పోరాటం చేస్తానంటోంది తాప్సీ పన్ను.

    ఫోర్బ్స్ జాబితాలో తాప్సీ పన్ను

    ఫోర్బ్స్ పత్రికా ఈ సంవత్సరం వివిధ రంగాలతో సైతం ప్రదర్శించిన యువ కెరటాల జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు గల 30 మంది భారతీయుల…

  • నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో అనన్య గా నటించింది. ఇది కూడా ఆమెను ఓ సవాల్ వంటి పాత్రే నట. ఈ పాత్ర కోసం తా ప్సీ బెంగాలీ నేర్చుకుందిట. అందుకోసం ఒక ట్యూటర్ ని నియమించుకుంది. పాత్రల కోసం కొత్త భాషలు నేర్చుకునే అవకాశం అరుదుగా వస్తుంది. నేర్చుకుంటూ నటిస్తే ఆనందం ఇంకో స్థాయిలో ఉంటుంది. అరుదుగా వస్తుంది. ఇప్పుడు నాకు చాలా మంచి పత్రాలు వస్తున్నాయి. అందులో ఘాజీలో అనన్య పాత్ర ఒకటి అంటోంది తాప్సీ. ఈ సినిమా 17 న విడుదలవుతుంది.

    బెంగాలీ నేర్చుకున్న తాప్సీ

    నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని…

  • మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈ ఫెయిర్ నెస్ ను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చిందిట తాప్సీ . ఈ తెలుపు రంగు కోసం ఇప్పటికీ అందరూ మోజు పడతారు కనుకనే ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్స్ రాజ్యమేలుతున్నాయి. నిజానికి శరీరపు రంగు అందానికి కాలమానం కాదు. దానికి నేను సపోర్ట్ చేయను అన్నది తాప్సీ. ఇలా సౌందర్య పాఠనాల తయారీ బ్రాండ్ల ప్రచారాన్ని వ్యతిరేకించే తారల్లో తా ప్సీ తో పాటు కల్కి కోయచ్లీన్ కంగనా రనౌత్ లు కుడా ఉన్నారు. యాంటీ ఏజింగ్ క్రీమ్ తానూ ప్రచారం చేయనని కల్కి చెప్తే ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కోసం నటించే యాడ్ కి వచ్చే రెండు కోట్ల కాంట్రాక్ట్ వదులుకుంది కంగనా రనౌత్ .. ఆడవాళ్ళలో ఈ భవాజాలం పోయేందుకు ఇంకెంత మంది ముందుకొచ్చి చెప్పాలో

    ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !

    మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ  నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు…

  • పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె ఎంతో కష్టం చేస్తారు రిస్క్ లు తీసుకుంటారు. గంటల రోజుల కొద్దీ జిమ్ లలో చెమటలు కారుస్తారు. నీరజ్ పాండే యాక్షన్ థ్రిల్లర్ బేబీ సినిమా కోసం తాప్సీ కొన్ని స్టంట్లు చేయాలి. ఇందుకోసం తాప్సీ సీరియస్ గా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సిరిల్ రేఫల్లీ బాగా పేరు పొందిన ఆర్టిస్ట్. అనేక హాలీవుడ్ హిట్స్ లో పని చేసాడు. అలాంటి స్టంట్ మాన్ దగ్గర తాప్సీ శిక్షణ తీసుకుంటుంది. సుకుమారుల్లా అనిపిస్తారు. కానీ ఎవళ్ళూ కష్టానికి భయపడరు. అలాగుంటేనే అదృష్టవంతులవుతారు.

    మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్న తాప్సీ

    పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె…