• కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది రవీనా టాండన్. ఇప్పుడు కొన్నాళ్ళ విరామం తర్వాత నాయికా ప్రాధాన చిత్రం మాత్ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె యువత కోసం ఒక ఉత్తరం రాసింది. ఆడ పిల్లలు ఓ సారి చదువుకుంటే బావుంటుంది కూడా. " ఆడపిల్లల్లారా ఈ సమాజం మాకు రక్షణ కల్పించడం లో వైఫల్యమైంది. మారక్షణ మాచేతుల్లోనే వుంది. సమస్య ఎదురైతే న్యాయం కోసం మాట్లాడటం నేర్చుకోండి. వేధించే వారిని, వెకిలిగామాట్లాడే వారిని, మనల్ని తాకాలని చూసే వాళ్ళకి ఎదురు తిరగండి. ఏటా అమ్మాయిల పైన ౩౦ వేలకు పైగా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని ఆపాలంటే అబ్బాయిల్లో, అమ్మాయిల్లో, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అబ్బాయిలు, అమ్మాయిలను అర్ధం చేసుకోవాలి. వారి తిరస్కారణకు కారణం తెలుసుకోండి. వారి వైపు చూసే చూపుల్లో ఆలోచనల్లో సానుకులత తప్ప ఇంకో భావం ఉండకూడదు, ఇలా సాగిన ఈ ఉత్తరం సోషల్ మీడియాలో ఎంతో మంది ద్రుష్టిని ఆకట్టుకొంది. పూర్తి పథం కావాలంటే చూడొచ్చు.

    మిమ్మల్ని మీరే కాపాడుకొండి

    కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది రవీనా టాండన్. ఇప్పుడు కొన్నాళ్ళ విరామం తర్వాత నాయికా ప్రాధాన చిత్రం మాత్ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె యువత…

  • సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. చెన్నయ్ సైబర్ క్రైమ్ కు శృతి తరఫున వ్యక్తులు వచ్చి ఆ డాక్టర్ వేధిస్తున్న ఆధారాలు చూపెట్టి అతని మెయిల్ ఐడి ఫోన్ నంబర్ పోలీసులకు ఇచ్చారట. శృతి హాసన్ ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు డాక్టరు గురించి విచారించే పనిలో వున్నారు. ఎవరి పనివాళ్లని చేసుకోనిస్తే ప్రాబ్లమే ఉండదు.

    శృతికి ట్విట్టర్ బెదిరింపులు

    సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు…