Saturday, 28 Nov, 2026

వాళ్ళ ఆలోచనా తీరే వేరు

పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత కంపెనీలు ఎక్కువని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తోంది. అహ్మదాబాద్ కు చెందిన పారు జయకృష్ణ అన్న యువతి  అసాహిసాంగ్ వన్ పేరుతొ ఒక ఎగుమతి సంస్థని ప్రారంభించిందట. నానాటికి ఆమెకు ఎగుమతి దిగుమతి చట్టాల పైనా వ్యాపారం పైనా  అవగాహన ఏవీ లేదు. పెట్టుబడి తక్కువ ఒకటే కారణం. […]

ఫ్యాషన్ ట్రెండ్స్ పరిచయం చేసే ఆకాంక్షానందా

నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమెను మించినవాళ్ళు లేరు అంటారు. ప్రపంచ ప్రసిద్ద ఫ్యాషన్ డిజైనర్లు మనీష్, అరోరా, గౌరవ గుప్తా. నమ్రతా జోషిపురా మొదలైన అందరికి ఫ్యాషన్ డిజైనింగ్ లో సలహాలు సూచనలు ఇస్తుందామె. ప్రతి రోజు డ్రెస్ అప్ డేనే అంటారామె. ప్రసిద్ధ మాగజైన్ సర్వే […]

అమ్మకానికి దయ్యాలు

GHOST SMUGGLERS ….. సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్  యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్ కు అందని విశ్వాసాలు ఎలా మోసపోయేలా చేస్తాయో అర్ధం చేసుకోవాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ పూర్ ప్రాంతం అసలే అమాయక ప్రజలు ఆపైన దయ్యలా భయం. ఈ బలహీనత కనిపెట్టిన యాదవ్ దయ్యాలున్నాయి కొనుక్కోండి. కొనుక్కుంటే అవి మీకు కాపలా వుండి  ఇతర దెయ్యాల నుంచి కాపాడతాయి  అని […]

బియ్యం నీళ్లతో భలే అందం

బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఎక్ప్ర్ట్స్ చెపుతున్నారు. చైనా జపాన్ దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లో సౌందర్య పోషణ కోసం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు వాడతారట. బియ్యం నీళ్లు మంచి ఫేస్ మాస్క్ అంటున్నారు. బియ్యం నీళ్లు చర్మ రక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తల స్నానం చేసే  ముందు బియ్యం […]

ఏ రోజు ఏ నగ ధరించాలి

తెలుసుకొన్నంత మాత్రాన ఆచరించాలని లేదు. కొన్ని విషయాలు వినేందుకు బావుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్నింటిలో నమ్మకాలు  ముందుంటాయి . నగల చుటూ కూడా బోలెడన్ని నమ్మకాలున్నాయి. మార్కెట్ లోని కొత్త డిజైన్ నగ  వచ్చిందంటే కొనేవాళ్లున్నారు. కొన్ని నగలు అందులో వేసే రాళ్లు రత్నాలు గ్రహాల కిష్టమంటున్నారు. నిపుణులు. ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆరోజు కెంపులతో చేసిన నగలు ధరిస్తే మంచిదట. అలాగే సోమవారం చంద్రుడికి ఇష్టం ఆరోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవాలి. మంగళవారం […]

దివ్యాంగుల కోసం క్యాబ్ సేవలు

కిక్ స్టార్ట్ క్యాబ్ సేవల్ని ప్రారంభించారు విద్యా రామ శుభన్. ఈ క్యాబ్స్ వైకల్యం ఉన్నవాళ్లు నడవ లేని వాళ్ళ కోసం పని చేస్తాయి. వైకల్యం ఉన్నవాళ్లు వాహనాల్లోకి తమంతట తాము ఎక్కలేరు. అందుకే చక్రాల కుర్చీలో సహా వాహనంలోకి ఎక్కేలా ఒక ర్యాంప్ లాంటిది ఉంటుంది. మోకాళ్ళ నొప్పులున్నా  పెద్దవాళ్ళు బయటకి వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. సాంకేతిక సాయంతో దివ్యాంగుల కోసం రూపొందించిన క్యాబ్స్ ఇవి. వీటిని సక్రమంగా నిర్మించటం కోసం ప్రయాణికులను మానవత్వం తో […]

అబ్బాయిలో ఈ లక్షణాలున్నాయా ?

పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులు కలిసాయో లేదో చూడరు. సైకాలజిస్టులు ఈ విషయం, గురించి అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు. కాబోయే భాగస్వామి మీకు సరైన జోడీనా కాదా అని తేల్చుకోమంటున్నారు. ముఖ్యంగా ధైర్యం పట్టిన చేయి విడువకుండా ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కోగలరా ? అలాగే అన్నింటికన్నా చాలా  ముఖ్యం ఉదయం నిద్ర లేవటం వంటి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా > మీ ప్రైవసీ ని గౌరవిస్తారా ? […]

అరకిలో ఖరీదు సుమారు రెండు లక్షలు

చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు ఉంటాయి. నిప్ షీల్డ్ ఫ్రిట్జ్ కంపెనీ తయారుచేసిన చాకోపాలజీ ప్రపంచంలో కెల్లా ఖరీదైంది. అత్యుత్తమ ట్రిఫిల్ కరోవా బీన్స్ తో తయారు చేసే అరకిలో విలువ రెండు లక్షలు దాని తర్వాత స్థానం నోకా వింటేజ్ కలెక్షన్ ది. దీనికోసం ట్రిన్డాప్  ఈక్వెడార్ వెనిజులా  కోట్ డీవార్  నుంచి […]

పీజీ చేస్తూ ఊబర్ కార్ డ్రైవర్ జాబ్ నచ్చిందంది

మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ  చేస్తోంది. ఆర్కిటెక్ట్ గా  ఐదారు నెలలు పనిచేసి బోర్ కొట్టి వదిలేసి చాలా  రోజులు ఆలోచించి క్యాబ్ డ్రైవర్ తనకు పర్ఫెక్ట్ జాబ్ అని నిర్ణయించుకొందిట. అహ్మదాబాద్ లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళింది. ఆడపిల్లకి ఇవ్వం అన్నారట. సరాసరి ఊబర్ క్యాబ్స్ ని […]

ఎన్ని నగలున్నా ఇలా సర్దేయచ్చు

ఇది వరకెప్పుడో నగలంటే గొలుసూ చంద్రహారం రాళ్ల గాజులూ ఇవే. వీటిని అందమైన దంతపు పెట్టెలోనో వెండి జ్యూవెలరీ బాక్స్ లోనో దాచుకుంటే సరిపోయేది. మరి ఇప్పటి సంగతి మ్యాచింగ్ పేరుతో ఎన్ని డ్రెస్ లుంటే అన్ని రకాల జ్యూవెలరీ ఫంకీ జ్యూవెలరీ ఫ్యాన్సీ వన్ గ్రాము గోల్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్లాక్ మెటల్స్ పూసలు రాళ్ళూ సవా లక్ష రకాలు అసలు ఎన్ని డిజైన్లతో కొన్నారో ఇంట్లో అమ్మాయిలకే గుర్తుండదు. ఏదైనా పార్టీకి వెళ్లాలంటే ఒకటి […]

ఆతిధ్యం సేవ ఈమె ఆభరణాలు

ఇరవై రెండేళ్ల వయసులో ప్రియా పాల్ ది పార్క్ హోటల్స్ చైర్మన్ బాధ్యతలు చేప్పట్టారు. విశాఖపట్నంలో  ఆమె తండ్రి సురేంద్ర పాల్ నిర్మించిన ది పార్క్ హోటల్ ఆంధ్రప్రదేశ్ లో తోలి ఫైవ్ స్టార్ హోటల్. ప్రియా నవ్య నవీనంగా పార్క్ హోటళ్లను తీర్చిదిద్దుతున్నారు. బెంగుళూరు, చెన్నయ్, కలకత్తా న్యూఢిల్లీ ,విశాఖపట్నం హైద్రాబాద్ ,గోవా వంటి వాణిజ్య పర్యాటక ప్రాంతాల్లో కొత్త హోటళ్లు నిర్మించారామె. ప్రపంచ ఉత్తమ 101 హోటళ్ల జాబితాలో పార్క్ బెంగుళూరు హోటల్ ప్రత్యేక […]

ఐస్ క్రీమ్ హాయిగా తినండి ఏం పర్లేదు

ఐస్ క్రీమ్  తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని జలుబు చేస్తుందని సాధారణంగా పిలల్లకు తల్లులు చెప్పే అపోహలు. నిజమే ఐస్ క్రీమ్ వల్ల జలుబు చేస్తుందని చెప్పటం  కేవలం  అపోహ. ఐస్ క్రీమ్ లో వాడే పాలు అందులోని చక్కర కారణంగా గొంతు బొంగురుపోతుందని చాలా మంది చెప్పే మాటలు పూర్తిగా నిరాధవం  అంటున్నారు. మాయో క్లినిక్ వైద్య నిపుణులు. పడిసెమ్ పడితే చల్లని ఐస్ క్రీమ్  తినటం మేలనీ  దాని వల్ల  బొంగురు పోయిన గొంతుకు […]

ఇలాంటి ఇబ్బంది కొని తెచ్చుకోవటం ఎందుకు?

ఎంతో బాగా తయారై పోయారనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే అవే ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఎంతో చక్కని వస్త్ర ధారణ కూడా బొత్తిగా బావులేదనిపిస్తోంది. ఉదాహరణలు శరీరపు రంగుకు దగ్గరగా వుండే లేత గోధుమ రంగు డ్రెస్ వేసుకున్నారనుకోండి. చాలా నిర్లక్ష్యంగా లోదుస్తులు తెల్లనివి వేసుకుంటే అవి స్పష్టంగా బయటకు కనిపిస్తూ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. చీర డ్రెస్ లకు లోపలవేసుకునే దుస్తులన్నీ సరైన మ్యాచింగే తీసుకోవాలి. ఒక్కసారి అమమయిలు ఆఫ్ షాల్టర్ డ్రెస్ లు […]

గింజలూ విత్తనాలు నగలు

జంగల్ జువెల్స్ అని ఆన్ లైన్ టచ్ చేస్తే నెక్లెస్ లూ చెవి పోగులూ  లాకెట్లు బ్రేస్ లెట్సు  బోలెడన్ని రకాల నగలు చాలా  ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వడ్లూ , పెద్ద తురాయి ,సర్వ జయ సపోటా వంటి 12 రకాల ధాన్యాలు గింజలతో తయారు చేసే ఈ జంగిల్ జ్యూవెలరీ టర్నోవర్ ఏడాదికి 60 లక్షలు పైనే  వుంది. ట్రెండీగా ఉండే ఈ నగలు దేశ విదేశాల్లో ఎంత మందిని ఆకట్టుకుంటున్నారు. వేర్వేరు రకాల విత్తనాలు […]

చలి విసిగిస్తుంటే ఇలా చేయండి

ఈ చలి రోజుల్లో కాలు బయట పెట్టినా దగ్గో జలుబో పట్టుకుంటాయి అవి ఏ మందులకి ఒక్క పట్టాన లొంగవు. మందులు వేసుకున్నా అనారోగ్యం విసిగిస్తూనే వుంటుంది. తిప్ప తీగ తాజా ఆకు సంపాదించ గలిగితే జలుబు, దగ్గు, దగ్గరకు రావు. కరక్కాయలు, సొంటి, మిరియాలు సమభాగాలుగా తీసుకుని పొడి చేసి ఆ పొడిలో బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బుగ్గన పెట్టుకొంటే దగ్గు రాదు. ఏదైనా తినాలనిపిస్తే చిలకడ దుంపలు వుదికిన్చుకుని లేదా […]

విప్లవ నాయకి అస్తమయం

పురచ్చితలైవిగా తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డి. ఎం. కె అధినేత్రి జయలలిత సోమవారం రాత్రి తుది శ్వాస వదిలారు. కర్ణాటకా లోని తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన జయలలిత తల్లి తల్లి సినీనటి. ఆమె ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టిన జయలలిత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించారు. ఆమెను తమిళనాడు ప్రభుత్వం కలై మామణిపురస్కారం తో సత్కరించారు. 1981  లో రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత. […]

కాఫీ మేకింగ్ నాట్ ఈజీ

కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి  అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప ఆర్ట్ అనీ దీన్ని  ఒక పద్దతి లో కలిపి తేనె అసలైన రుచి అంటారు నిపుణులు. ముందు నాణ్యమైన గింజల్ని రోస్ట్ చేసిన డేట్ చూసి మరీ కొనాలి. గాలి చొరబడని డబ్బాలు నిల్వచేయాలి. ఫ్రీజర్ లో ఉంచకూడదు. వాడే ముందర గింజల్ని గ్రైండ్ చేయాలి. మాములు మంచి […]

గాజుల్లా తొడుక్కునే డంబెల్స్

రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు కదా. అవి బరువుగా వుంటాయి పైగా వాటిని మోస్తూ వుండాలి. ఈ మాగ్నెటిక్ డంబెల్స్ చూసేందుకు గాజుల్లా వున్నాయి. వాటిని బుజానికి ఒకటి మణికట్టు దాటి మరొకటి తగిలించుకుంటే చాలు. ఎంత బరువు ఎత్తాలనుకుంటున్నారు సెట్ చేసుకుంటే చాలు. వాటిల్లోని అయిస్కాంత శక్తి కారణంగా ఒక దాన్ని ఒకటి […]

మన సంతోషమే మనకు ముఖ్యం

‘ FIND YOUR  BEAUTI FUL’ పేరుతో రాధికా ఆప్టే రూపొందించిన ఒక వీడియో కు సోషల్ మీడియా లో చక్కని స్పందన వచ్చింది. అందులో రాధికా ఆప్టే తన కాలేజీ రోజులనాటి ఫోటోలు ఇంకా చిన్నప్పటి  ఫోటోలు చూస్తూ అప్పుడు తాను అందంగా లేననుకునేదాన్ని అంటూ కబుర్లు మొదలుపెడుతుంది. కళ్ళు బాలేవు పళ్ళు బాలేవు లావుగా ఉన్నారనే మరీ సన్నగా ఉన్నారనే చిన్న జుట్టు అనో రంగు తక్కువ అనో ఇలా అందంగా లేరని చెప్పేందుకు […]