Saturday, 28 Nov, 2026

పిల్లల ఆకలి తీరుస్తున్నGlowTide

www.fb.com/Glowtide చూడండి. ఈ సంస్థ నిర్వాహకురాలు రీనా. ఈ ఎన్జీవో లో ఎంత మంది యువత భాగస్వాములు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళలో మిగిలిపోయిన ఆహారం సేకరించి అదే రోజు అనాధలకు పేద పిల్లలకు అందజేస్తారు. 15 సంవత్సరాల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలోని పని చేసి వచ్చారు రీనా. పెళ్ళిళ్ళు వేడుకల్లో మిగిలిపోయిన ఆహారం ఇచ్చేందుకు కూడా ఈ సంస్థకు సమాచారం ఇస్తాం. హైదరాబాద్ లో అంత పాప్యులర్ అయింది […]

వాళ్ళ త్యాగం వల్లనే నేనింతదానయ్య

తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం  అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మధ్య ఎన్నో పాఠశాలలు కళాశాలల్లో అతిధిగా వెళ్ళిందిట. తాను మాట్లాడటం అయ్యాక ఎంతో మంది ఆడపిల్లలు మా తల్లితండ్రులు క్రీడల్లో మమ్మల్ని ప్రోత్సహించరు. పెళ్ళికే వాళ్ళ ప్రాధాన్యత అని చెపుతుంటే సాక్షికి కనీళ్ళు ఆగటం లేదట. నేను నా తల్లితండ్రుల ప్రోత్సాహంతో […]

అది కేవలం మీ ఆలోచనలో వచ్చిన మార్పు

పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే  వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే మన పనయి పోయిందనే భావన కలిగిస్తాయి. కానీ ఎక్సపర్ట్స్  ఈ ఆలోచనే పొరపాటుంటున్నారు. యువత లో ఉరిమే ఉత్సాహం వుంది. తుళ్ళిపడే జలపాత వేగం వుంది. వాళ్ళతో స్నేహం చేయండి. మీ యవ్వనం మీ దగ్గరే ఉంటుంది అంటున్నారు. అలాగే అవకాశం వచ్చిందంటే ఎపుడూ ఎదో ఒక కొత్త […]

ఈ అలవాట్లు, ఆహారం ఆరోగ్యం కోసం

ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట. అందుకే ప్రతి దానికి హైరానా పడకుండా లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెదర్లాండ్ పరిశోధనల ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటలు నిద్ర పోయే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశం 65 శాతం తక్కువట. అలాగే గుండె ఆరోగ్యం కోసం డి-విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలంటున్నారు. వంటకాల్లో […]

తెల్లని గుజ్జు వలిస్తే నల్లని రంగు

పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా  వగరు రుచితో వుండే సీమచింత పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబీ ,ఊదీ, ఎరుపు రెంగుల్లోనే మారిపోతుంది. పండిందంటే పై తొక్క ఊడి  వచ్చేస్తూ ఉంటుంది  లోపల ఒక్కొక కణాలపు తో తెల్లని గుజ్జు మధ్యలో నల్లని గింజ ఉంటాయి. దాన్ని సీమ తమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు కేరళ మహారాష్ట్ర […]

లేటెస్ట్ లో లేటెస్ట్ పెప్ లమ్

పెప్ లమ్ డిజైనర్ డ్రెస్ స్టైలిష్ లేటెస్ట్ అనుకోవాలి. ఇటు స్కర్ట్ లాగా పిటెడ్ జాకెట్ లాగా నడుము దగ్గర టైట్ చేసేలా వుండే పెప్ లమ్ ఫిట్టెడ్ జాకెట్స్ జీన్స్ ధోతీ ప్యాంట్ కు లూజ్ పటియాలా పైకి క్యాజువల్ కంఫర్ట్ లుక్ తో కనిపిస్తాయి. పెప్ లమ్ తో స్లిమ్ గా  కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. బాటమ్ గా  పెన్సిల్ స్కర్ట్ ప్యాంటు ఎంచుకున్న లేటెస్ట్ స్టైల్ తో కనిపించచ్చు. దీనికి కాంట్రాస్ట్ […]

పాదాల అందం ఇలా పదిలం

ఎదో ఒక యాడ్  చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు  చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా అని మొహం పెడతాడు. నిజమే. సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం పాదాలకు ఇవ్వకపోతే అలాగే ఉంటుంది. మడమ దగ్గర మురికి పగుళ్లు లేకుండా ఉండాలంటే రాత్రివేళ పాఠాలు  శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫ్రూట్ క్రీమ్ లో గ్లైకోలిక్  యాసిడ్ వున్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు. […]

గ్రీన్ టీ తో మొటిమలు తగ్గుతాయి

గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల  ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల  కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు […]

ఉద్యోగినులకు అదనపు సౌకర్యాలిస్తున్న కంపెనీలు

మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. ‘బెస్ట్ కంపెనీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల అవతార గ్రూప్ ఇండియా అండ్ వర్కింగ్ మదర్ మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టాప్ వంద కంపెనీల్లో మహిళా […]

చలి గాలికి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి

చలి రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు. తీవ్రమైన చలి గాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోయింది. కళ్ళు పోదిబరిపోయి ఎరుపెక్కడం, దురద పెట్టడం సాధారణంగా జరిగే అసౌకర్యం కళ్ళకు హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదట గోరు వెచ్చని నీళ్ళు మాటి మాటి కి తాగుతూ వుండటం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మ జాతి పండ్లు, ముదురు రంగు ఆకు కూరలు తీసుకోవడంతో పాటు అన్ని రకాల సూప్స్ మేలు చేస్తాయి. ఫ్యాట్ ఆమ్లాలు అధికంగా […]

ఆలివ్ ఆయిల్ మస్సాజ్ తో మెరుస్తాయి

గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను తీసుకుంటేనే చక్కగా చూసేందుకు బావుంటాయి. అలావుంటేనే వాటిని అలంకరించుకోగలం. వేడి నీళ్ళలో ఆలివ్ ఆయిల్ వెయిస్ గోళ్లను అందులోముంచి కొన్ని నిముషాలు ఉంచాలి. కాస్సేపయ్యాక మర్దనా చేస్తే గోళ్లు బావుంటాయి. రోజ్ వాటర్ తో తుడిస్తే కూడా గోళ్లకు తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏ […]

ప్రాధాన్యతా క్రమాలు తప్పనిసరి

జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా  ఒక ప్రాధాన్యతా క్రమం ఉంటుంది. ఉదయం నిద్ర లేవటం కూడా ఒక ముఖ్యమైన పనే. అలా అని కాల్కులేటెడ్ గా  యాంత్రికంగా సాగనక్కర్లేదు. ఒక అలవాటుగా పద్దతిగా అన్ని పనులు చేసుకుపోవాలి. సరైన వేలకు ఆఫీస్ కు చేరాలి. ఇది అవసరమైన క్రియ కనుక దానికి తగట్టు సరైన […]

వంట ఇప్పుడో పెద్ద పరిశ్రమ

ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు వంటవాళ్ళుగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతారట. ఇందులో రకరకాల గ్రేడ్లు, ప్రమోషన్లు వుంటాయట. ఓ వ్యక్తి సీనియర్ వంటవాడి స్థానం రావాలంటే పదేళ్ళు  కష్టపడి నేర్చుకోవాలిట. ప్రధాన వంటవాడి స్థానం కావాలంటే పాతికేళ్ళ అనుభవం కావాలి. ఇక్కడి వాళ్ళు  ఎంత బాగా వంట చేస్తారంటే పాండిచరి, తిరుపతి, మదురై, చెన్నై, […]

అమ్మకు అక్షరాంజలి

వంటరి నడకతో అలసిపోయిందేమో 60 ఏళ్ళకి ఆగిపోయింది ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో శిఖరాగ్రాన సెలవు తీసుకుంది కోట్లాది మంది కన్నీరు తోడుగా కోమల వల్లి వెళ్ళిపోయింది బడుగు జనాల పాలిటి దేవతగా అందరి అమ్మగా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న సంక్షేమ సారధి అమ్మా అమ్మా అంటి లక్షలాది మంది అభిమానులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుండగా పురుచ్చి తలైవి జయలలిత వెళ్ళిపోయింది. పట్టుదల ఆత్మవిశ్వాసం దృఢత్వం కలగలిసిన వ్యక్తిత్వం ఆమెది. మనువాడ ప్రపంచంలో మనుగడ నిలుపుకోవటమే […]

ఇది చాలా సహజం

పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్  హెయిర్ లాస్ అంటారు. ప్రసవం తర్వాత హార్మోన్లు నెమ్మదిగా సాధారణ స్థాయికి వచ్చేస్తుంటాయి. దీనితో పాటు జుట్టు సహజంగా రాలే ప్రక్రియ కూడా ఆరంభం అవుతుంది. మరో కారణం శారీరిక ఎమోషనల్ ఒత్తిడి. 360 డిగ్రీల కోణంలో జీవితం మారిపోయినందున దీనికి తగట్టుగా శరీరం తనను తాను సిద్ధం చేసుకునే […]

వెనకటి రంగొస్తుంది

వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్  యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు […]

సీతా ఫలం ఎంతో మధురం

సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా  అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో  పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని  షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ […]

వినిపించదు…. మాటాడదు…. ఇన్ని నైపుణ్యాలా?

మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా, ఐరోపాలో జరిగిన మిస్ వరల్డ్ పోటిలలోను తలాపడింది. కేరళ లోని ప్రభుత్వ ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్, గ్లాస్ పెయిన్టింగ్ కళాకారిణి, నగల డిజైనర్ కూడా ఇంతేనా, స్కూటర్ నేర్చుకుని లైసెన్సు కోసం వెళితే అధికారులు చెవులు వినిపించవు మాటలు రావు ఇవ్వలేం అంటే […]

భావోద్వేగాలు అదుపు చేసే సువాసనలు

మంచి సువాసనలకు మనస్సు వుత్తేజితం అవుతుంది. ఎలాంటి ఒత్తిడిలోనుంచి  అయిన ఈ మంచి వాసనలు మనస్సు ని తేలిక చేస్తాయి. అన్ని కాలాల్లో మల్లెలు దొరకవు కానీ మల్లెలు తో చేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఈ వాసన మానసిక ఉల్లాసం పెంచడం తో పాటు ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి చిరాకులను దూరం చేసే హర్మోన్లని విడుదల చేస్తాయి. బావోద్వేగాలను అదుపు చేస్తాయి. అలాగే లావెండర్ వాసన పిలిస్తే నాడి కొట్టుకునే వేగం నియంత్రణ లో […]

కరీనా కోసం 130 కాస్ట్యుమ్స్

కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్ రూపొందించాడట. కరీనా కపూర్ ఈ సినిమాలో నిమిషానికో డిజైనర్ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నారు అంట. ఈ డ్రెస్ల బడ్జేట్ అక్షరాల 1.2 కోట్ల రూపాయిలు. కధానాయిక అనగానే ప్రేక్షుకులకు అందంగా కనిపించాలి. అందుకే ఫ్యాషన్ విషయంలో ఆర్టిస్ట్లు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. రకరకాల డిజైనర్ దుస్తులలో వెండి […]