Saturday, 28 Nov, 2026

ఇవి మరిస్తేనే గ్రాండ్ లుక్

ఇంటీరియర్స్ చలా ఖరీదు. ఒక సారి కొన్ని వస్తువులు కొన్నాక, ఇక మాటి మాటికీ మార్చాలంటే కుదరదు. కానీ రోజు ఇల్లు ఒకేలా వుంటే బోర్ గా వుంటుంది. మరి కస్త మార్పు తేవాలంటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్ ఇలాంటివి మార్చుతూ వుండాలి. పడక గది నీట్ గా వుండాలంటే పిల్లో కవర్స్ కొత్త కొత్త డిజైన్ల తో రంగులతో ఉండేలా తీసుకుంటే అవి ఎప్పుడు మార్చేస్తూ వుంటే ఫ్రెష్ లుక్ వస్తుంది. […]

వార్డ్ రోబ్ సర్దటం చాలా ముఖ్యమైన పని

ఇల్లు సర్దుకునే టప్పుడు,  వార్డ్ రోబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించ వలసి వస్తుంది. పిల్లలకి, పెద్దలకీ,కొత్తవీ, పాతవీ, స్కూల్ డ్రెస్, నైట్ డ్రెస్ ఇంకెన్నో బట్టల తో ఎన్నీ బీరువాలైన సరిగా సర్ధకపోతే చాలవనిపిస్తాయి. పిల్లలు వేసుకునే బట్టలు విడగొట్టి స్కూల్ డ్రెస్, రేగ్యులర్, కొత్తవి వరుసగా రెండు మూడు అరల్లో సర్దితే వాళ్ళయినా ఈజీగా తీసుకోగలుగుతారు. ఇక చీరలు, బ్లౌజులు ఒక దాన్లో ఒకటి తిరుమారుగా కాకుండా ఇస్త్రీ నుంచి రాగానే అన్ని సెట్ […]

కేశ రక్షణకు ఉసిరి

పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా తినేసినా మంచిదే. డై ఆమ్లా క్యాండీలు వున్నాయి. గొంతు మంట జలుబు వుంటే రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. పరగడుపున ఉసిరి రసం పుక్కిలి పడితే నోట్లోనుంచి వచ్చే పండ్ల నుంచి ఉపసమనం. ఆర్రైటిస్ వంటి కీళ్ళనొప్పుల […]

పనులకీ ప్రణాళిక కావాలి

నీహారికా, నీ సమస్య అందరి సమస్యే తెలుసా. పనిలో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా వుందామని, ఇంకెవ్వరూ మనలా వుండరనీ నిర్ణయించుకోవడమే అసలు సమస్య. ప్రతిపని మనమే చేయాలని పెట్టుకొంటే ఇంక సమయం ఏమి మిగులుతుంది. కొన్ని పనులు మొదలు పెడతాం ఒక్కోసారి పర్ఫెక్ట్ గా వుంటుంది ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. అది సహజం. సాంకేతిక విజ్ఞానం మన పని త్వరగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. చాలా వేగంగా ఫోన్లు, లాప్ టాప్ లు, పి.సి లు చూస్తాం. కానీ […]

అందం, ఆరోగ్యం కోసం కర్బూజా

వేసవి వస్తే కర్బూజా పండ్లు వస్తాయి. తియ్యని మామిడి పండ్లు ఇష్టపడ్డట్లు ఈ దోసపండు రుచితో వుండే కర్బూజా ను పెద్దగా ఇష్టపడరు. కానీ ఇది ఎంతో మంచి పోషకాహారం. ఇందులో చాలా రకాలున్నాయి. నిమ్మ ఫ్లేవర్ లో వుండే లెమన్ డ్రాప్, షుగర్ మెలన్, వైట్ హనీడ్యూ, ఆకుపచ్చని గాలియా, పసుపు రంగు పర్షియన్, కోలగా వుండే శాంటా క్లోజ్, చారలతో వుండే టస్కన్ ఇలా చాలానే వున్నాయి. ఇవి వేసవిలోనే కాదు మిగతా కాలాల్లోనూ […]

మరి అందంగా వుండాలంటే కష్టపడాలి

ఎంతో అందమైన కార్పెట్స్ మార్కెట్ లో కనిపిస్తాయి. కాళ్ళ కింద మెత్తగా అందమైన రంగులు చెక్కని పువ్వులు డిజైన్లు, హాల్ లో వేస్తె హాలుకే కొత్త అందం. మెత్తని ఊలు పైన నడవడం మనకీ సౌకర్యం. కానీ దీన్ని శుబ్రం చేయక పొతే మాత్రం ఎంతో నష్టం అనారోగ్యం. ఎప్పుడూ, ప్రతి రోజు, వ్యాక్యూమ్ క్లీనర్ తో దాన్ని శుబ్రం చేయాలి. మరకలు పడితే ఎప్పటికప్పుడు శుబ్రం చేయాలి. అలా వదిలేస్తే మరకలతో పూర్తిగా పడిపోతుంది. మరకల్ని  […]

పచ్చని పందిట్లో ముచ్చటైన పెళ్ళి

ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరవుతాం. వందల రకాల భోజన పదార్ధాలు. ఏది తినాలో అర్ధం కానన్ని వెరైటీస్, ఎంతో వ్యర్ధం. కామార్స్ లో పీ.జీ తీసుకున్న శ్యామలా సురేష్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమె కూడా అద్భుతమైన పెళ్ళిళ్ళు, అందులో వృధా అయ్యె పదార్ధాలు ప్లాస్టిక్ ఉత్పత్తుల గురించి బాధ పడి ఎకో ఫ్రెండ్లీ  మారేజస్ కి శ్రీకారం చుట్టారు. ఇవి అన్ని పెళ్ళిళ్ళ మాదిరిగానే వుంటాయి. ఈ గ్రీన్ మ్యారేజ్ […]

ఫ్యాషన్లు మారుతుంటాయి జాగ్రత్త

కొత్త సినిమా చూడగా నే హీరోయిన్ హెయిర్ స్టైల్ నచ్చి పోతుంది. విండో షాపింగ్ చేస్తుంటే వర్క్ బ్లవుజ్ భలే అనిపిస్తుంది. కానీ మన శరీరానికి అది నప్పుతుందా లేదా ఆలోచించాలి కదా. ఫలానా బ్రాండ్ ఖరిదైనది కానీ ఆ బ్రాండ్ ప్యాంట్ వేసుకోగలమా? ఖరీదైన అలంకరణ వస్తువులు, నగలు కలిపి తీసుకున్న డ్రెస్సులుబావుంటాయి. లేక పొతే బ్రాండెడ్ కొని లాభం ఏముంటుంది? పైగా వీటిని మైంటైన్ చేయాలి. మంచిగా ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, కొన్ని రకాల […]

‘నో’ అని చెప్పడం చాలా తప్పు

పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం మాటలా? పెరిగే పిల్లల మెదడు ఎంతో చురుకుగా వుంటుంది. దాదాపు వంద బిలియన్లు న్యురాన్లు చురుకుగా ఉంటాయట. ఎన్నో తలుసుకోవాలనే కుతూహలం వందల ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు, ఆ వయస్సులో వాళ్ళకు ‘నో’ అన్న పదం వినిపించ కూడదు అంటారు పేరెంటింగ్ ఎక్స్ పర్ట్స్. తల్లి దండ్రులు బిజీగా […]

అద్భుతమైన గొప్ప కధ అంకితా కుమారి.

అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు అనొచ్చు. కానీ అంకిత పరీక్ష రాస్తుంది కాలి బొటన వేళ్ళ మధ్య పెన్ను తో, అంటే కాలి తో రాస్తోంది పరీక్ష బీహార్ లోని నరన జిల్లాకి చెందిన బనియా పూర్ జిల్లాలోని పదో తరగతి అమ్మాయి అంకితా కుమారి.ఐదేళ్ళ వయస్సులో పోలియో వచ్చింది. చేతులు చచ్చుపడి పోయాయి. మాటలు సరిగ్గా రావు. ఇప్పుడు ఆ పాప అమ్మమ్మ తోడుగా పరీక్ష సెంటర్ […]

అల్లం శక్తి అపరిమితం

చిన్న అల్లం ముక్క, ఒక్క మిరపకాయ, నెయ్యి తో వున్న ఉప్మా అదిరిపోతుంది. అల్లం లో వున్న శక్తి అంతా ఇంతా కాదు. రెండు చెంచాల అల్లం రసం తీసి కొంచం తేనె కలిపి రెండు పూటలా తాగితే ఆస్తమ, జలుబు, దగ్గు తగ్గుతాయి. అల్లం రసంలో పిప్పిల్ల చూర్ణం, సైంధవ లవణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగితే అస్తమా చాలా వేగంగా తగ్గిపోతుంది. పన్ను నొప్పి పుడితే అల్లం ముక్క నమలాలి. అల్లం […]

పువ్వల్లెవాలి, ముచ్చటగా విచ్చుకునే కేక్స్

ఎప్పుడు ఒకేలా వుంటే పిల్లలు ఎప్పుడు మెచ్చారు. నోటికి రుచిగా ఉంటుందని వాళ్ళకు తెలనెంత అనుభవం లేదు కనుక కళ్ళకు బావుంటే అది మెచ్చుతారు. సాధారణంగా మనకు మైదా,గుడ్ల వున్న దిబ్బ రొట్టె లాగా కనిపించే కేక్స్ తెలుసు. సాధారణంగా గుండ్రంగా ఐసీగా అలాగే కదా వుండేది. కానీ ఇప్పుడు జెల్లీ కేక్స్, షుగర్ ఫ్లేవర్ కేక్స్, గ్రావిటీ కేక్స్, ఫాండెంట్ కేక్, ఒక్క సారి ఇలాంటి కేక్స్ కోసం ఆన్లైన్ లో చుస్తే అబ్బో ఎన్ని […]

ఆ విటమిన్ గురించి తెలుసా!

నీహారికా, మనం శరీరానికి పనికి వచ్చే ఎన్నో విటమిన్స్ గురించి తెలుసుకొన్నాం. మరి విటమిన్ M గురించి తెలుసా. ఇది లేకపోతే జీవితo ఒక్క అడుగు కూడా కదలదు. ఆరోగ్యం, ఆనందం, అందం ఏదైనా సరే M వుంటేనే. చదువుకోవాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే, మంచి జీవితం కావాలంటే విటమిన్ M.  ఇది కొంతమంది దగ్గరే పదిలంగా ఉంది. వాళ్ళని కోటీశ్వరులు అంటారు. మిగతా వాళ్ళు వాళ్ళని చూసి అసూయ పడతారు. కానీ నువ్వు ఈ విటమిన్ విలువ […]

ఇవి కూర్చునే పుస్తకాలు

ఇది ఇవాల్టి న్యూస్ కాకపోయినా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంది. ఒక రోజు రాత్రి తెల్లారే సరికి రంగు రంగుల బొమ్మలతో తెరచిన పుస్తకాల్లా కనిపించే బెంచీలు వీధుల్లో వెలిసే సరికి లండన్ వాసులు ఆశ్చర్యపోయారట. అసలు ఇలాంటి బెంచీలు ఎందుకు పుట్టుకొచ్చాయి అంటే లండన్ నగర సాహిత్య వారసత్వ సంపద గురించి ప్రజలకు తెలియజేసి వాళ్ళలో పుస్తక పఠనం పైణ ఆసక్తి పెంచటానికేనట. అందులో భాగంగానే పబ్లిక్ ఆర్ట్ ప్రాజెక్ట్ పేరుతో పిల్లలకు, […]

కొలువు తీరిన మాట్లాడే బొమ్మలు

కొన్నింటిని ఆనందించాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. పురాతనమైనవి. ఎంతో ప్రత్యేకమైనవి, అరుదైనవి మ్యుజియంలో పెడతారు. ఎప్పటి దాకా, చరిత్ర, జీవన విధానం తెలుసుకోవడానికి  ఉపయోగ పడతాయి. ఈ మ్యుజియం ఎంత ఉపయోగ పడతాయి. కెమేరా మ్యుజియం, ఐస్ క్రీం మ్యుజియం, రాళ్ళ మ్యుజియం, ఇప్పుడు ఇంకో ప్రత్యేక మైన  ఎంతో సరదా వేసే మ్యుజియం వెంట్ హీవెన్ మ్యుజియం. కెంటకిలో వుందీ మ్యుజియం. ఇది మాట్లాడే బొమ్మల కొలువు. వెంట్రిలాక్విజం తో మాట్లాడే బొమ్మలతో వినోదం పంచె కళ. […]

వేసవి కి ఇలా ఎంచుకోవచ్చు

వేసవి వచ్చిందంటే కాటన్స్ కోసం చుస్తారందరూ. శరీరానికి సౌఖ్యం గా వుండాలి. ఫ్యాషన్ గా వుండాలి. వర్క్ ప్లేస్ కు అనుకూలం గావుండాలి. ఈ విషయంలో ఫ్యాషన్ డిజైనర్లు ఏమంటారంటే వట్టి నూలురకాలే అక్కర్లేదు, లెనిన్, ఖాది, మల్ మల్ వంటి రకాలు ఎంచుకొవచ్చు అంటారు. వస్త్రం ఏదైనా డిజైన్స్ కూడా అందం తేవాలి. క్రాప్ టాప్ లు టీ షర్టులు, పలాజో, అనార్కలి మంచి పూల డిజైన్ ల తో వేసవి అనుకూలంగానే వుంటాయి. టాప్స్ […]

ఆపిల్ పియర్ చాలా మంచిది

ఆపిల్ పియర్ ఇవి ఆపిల్ మాదిరిగా కొరికి తినే పండ్ల ఆపిల్స్ లా గుండ్రంగా పసుపు పచ్చగా వుంటాయి. దక్షిణ ఆసియా దేశమంతా విరివిరిగా కాస్తాయి. ఈ పండ్లతో జామ్ లు జెల్లీలతో పాటు సలాడ్స్ లోను వాడతారు. ఇతర పియర్ జాతి పండ్ల తో పోలిస్తే  పిచు ఎక్కువ క్యాలరీలు తక్కువ. గుండె ఆరోగ్యానికి ఎముకలు బలంగా వుండేందుకు అవసరమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. నీటి శాతం చాలా ఎక్కువ శరీరంలోని కణాలు, కణజాల పనితీరుకు […]

ఇలా చుండ్రు వదిలించుకోవచ్చు

చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి చుండ్రు తగ్గిపోతుంది. టీ ట్రీ ఆయిల్ ను రాత్రి పడుకునే ముందర మాడుకు రాస్తే చుండ్రు సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ నూనెలో జోజోబా ఆయిల్ కలిపి రాసుకున్న చెక్కని ఫలితం వుంటుంది. కొబ్బరి నూనెను కాస్త వెచ్చ చేసి అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టించుకోవాలి. ఇలా వారంలో […]

గర్భం దాల్చితే కానుక

ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఫిన్లాండ్ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. 1949 నుంచి పేద మహిలళ కోసం మెటర్నటీ ప్యాకేజీ ఇస్తుంది. దీని కోసం గర్బం దాల్చిన మొదటి నాలుగు  నెలలలోని ఆసుపత్రి కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. పేదరికం, అపరిసుబ్రత వాతావరణం కారణంగా చాలా మంది పిల్లలు పుట్టిన ఏడాది లోపే ఎన్నో వ్యదులోస్తాయి. అలా తమ దేశంలో పిల్లలకు జరగకుండదనే ఉద్దేశ్యంతో ఈ మెటర్నటీ […]