• చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి చుండ్రు తగ్గిపోతుంది. టీ ట్రీ ఆయిల్ ను రాత్రి పడుకునే ముందర మాడుకు రాస్తే చుండ్రు సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ నూనెలో జోజోబా ఆయిల్ కలిపి రాసుకున్న చెక్కని ఫలితం వుంటుంది. కొబ్బరి నూనెను కాస్త వెచ్చ చేసి అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టించుకోవాలి. ఇలా వారంలో మూడు రోజులు చేస్తే చుండ్రు బెడద పోతుంది. మెంతుల్లో ప్రోటీన్లు, ఎమినో ఆసిడ్స్ అధికంగా వుంటాయి. కానీ మెంతులు నానానిచ్చి మెత్తగా రుబ్బి తలకు పెట్టుకున్న ఫలితం వుంటుంది. నిమ్మ ఆకులు, నీళ్ళు లో నాన నిచ్చి ఆ నీళ్ళతో సహా మెత్తగా గ్రఇండ్ చేసి, ఆ పేస్టు తలకు పట్టించిన చుండ్రు పోయింది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో నిలబడితే ఆ సూర్య కిరణాల వేడి కూడా జుట్టుకు మేలు చేస్తుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటూ వుంటే ఈ పోషకాలు కూడా జుట్టుకు మేలు చేస్తాయి.

    ఇలా చుండ్రు వదిలించుకోవచ్చు

    చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి…

  • తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . నానబెట్టిన మెంతులు ఉదయాన్నే పేస్ట్ లాగా రుబ్బి తలకు పెట్టేస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో ఉండే యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు కూడా ఫంగస్ ను తొలగిస్తాయి. నిమ్మరసం తేనె కలిపి పట్టించినా మంచిదే. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు తొలగిస్తుంది. తేనె జుట్టుకు కావలిసిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. రెండు స్పూన్ల సెనగపిండి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట ఆగాక కడిగేసినా సమస్య తీరిపోయినట్లే. వీటిల్లో కొన్నయినా ట్రై చేయండి. ఇవి ఇంటి చిట్కాలు గనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు.

    ఈ చిట్కాలతో చుండ్రు మాయం

    తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే  ఇలా చేసి చుస్తే ఫలితం…