ఇలా మిక్స్ చేసి చూడండి.
కొన్ని పదార్ధాలు పాలతో, పెరుగుతో, కూరగాయ ముక్కలతో కలిపి తింటూ వుంటాం. కాని కొన్నింటిని పద్దతిగా తింటే ఇంకా ప్రయోజనం. ఓట్స్ అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఇచ్చేవి వీటిని ఎలా తిన్నా శరీరానికి కావలసిన ప్రోటీన్లు, పీచు, మెగ్నీషియం, పొటాషియం అందుతాయి. వీటిని అప్పటికప్పుడు తినేకంటే పాలల్లోనో, పెరుగులోనో వీటిని రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే తింటే మంచి శక్తి లభిస్తుంది. అలాగే నానపెట్టేప్పుడు ఇందులో దానిమ్మ గింజలు, పండ్ల ముక్కలు లేదా డ్రైఫ్రూట్స్ వంటివి వేసేయవచ్చు. రాత్రంతా […]
కాంబినేషన్ కాస్త చూసుకుంటే……….
కుర్తీలు, చుడీదార్లు వేసుకుంటే ఆ డ్రెస్ డిజైన్లు మాత్రమే కాదు. అసలా దుస్తులు ఎలా వేసుకుంటే నప్పుతాయి అని ఆలోచించాలి. సాధారణంగా చక్కని రంగుల డిజైన్లు ఎంచుకుంటాం. కానీ శరీరం తీరుకూడా ద్రుష్టిలో వుంచుకోవాలి. కొందరికి చేతులు లావుగా ఉంటాయి అప్పుడు చేతుల్లేని కుర్తీలు ఎంచుకోవద్దు. అలాగే కాస్త బొద్దుగా వుండేవాళ్ళు మరీ బిగుతుగా వుండే కుర్తీలు వేసుకోవద్దు. బదులుగా కఫ్సాన్ తరహా లో వుండే టాప్స్, లెగ్గింగ్స్ ప్రయత్నిస్తే చూసేందుకు అందంగా వుంటుంది. కొందరికి నడుం […]
ఈ సమ్మర్ ఫుడ్స్ అత్యధిక ప్రయోజనం.
రాబోయే వారంలో పది రోజులు ఇంకా ఎండలు ఎక్కువవ్వుతాయి అంటున్నారు. ఎయిర్ కూలర్లు. ఎ సిల విషయం అలా వుంచి, సహజంగా శరీరం కూల్ గా ఉండాలంటే మూడు పూటలా మజ్జిగే ఆధారం. పెరుగు బదులు చిక్కని మజ్జిగ చాలా బెస్ట్. కొబ్బరి నీళ్ళు తాటి ముంజులు, పుచ్చకాయలు కూడా చాలా చలువ చేస్తాయి. తాటి ముంజుల రసం ముఖంపై రాస్తే చమటకాయలు రావు. కర్భూజా జ్యూస్ తో ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. కీరా, బత్తాయి, […]
మెరిసిపోతున్న సిల్క్ థ్రెడ్ నగలు.
మట్టి గాజుకు దారాన్ని చుట్టి ముచ్చటగా చేస్తే అది కాస్తా అప్ డేట్ అయి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీగా ఎన్నో డిజైన్లతో అమ్మాయిల మనస్సు దోచేస్తుంది. ఈ గాజులు దాదాపు అల్లిక నగల్లో జుంకాలు, దుద్దులు కలగలిసిన సెట్లు, ఫ్యాషన్ దుస్తుల పైకి సరిపోయేవి కూడా వస్తున్నాయి. రాళ్ళు, కుందన్లు, చిన్న చిన్న రాళ్ళ బిళ్ళలు, లేసులు, పూసలతో ఇష్టమైన డ్రెస్ మాచింగ్ గా వస్తున్నాయి. డ్రెస్ మాచింగ్ గా బాంద్ బాలీ, హాంగింగ్ బుట్టలు, గొలుసు […]
అనంతమైన ఆరోగ్యానిచ్చే ఆకు కూర ఇది.
Portulaca oleracea అంటే చెప్పలేరేమో గానీ గంగ పాయిల కూర అనండి తెలంగాణాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వారంలో రెండు రోజులైనా ఈ కూర వండుకోంటారక్కడ. వేసవిలో ఆకు కూరలు పెంచడం కష్టం. కానీ మండుటెండల్ని తట్టుకుని చుక్కనీరు లేకున్నా పెరిగే మహా గట్టి మొక్కగంగపాయి కూర. గడ్డి మొక్కలా కనిపిస్తుంది కానీ వేళ్ళ లోపలకంటుకెళ్ళి నీటిని పోషకాలను పిల్చుకుంటాయి. చిన్న పూలతో మందపాటి ఆకులతో వుండే ఈ గడ్డి మొక్క సలాడ్లు, ఆమ్లెట్లలో బావుంటుంది. […]
సముద్రపు ఉప్పు నీటితో ఈ మసాజ్.
వయస్సు పెరిగే కొద్దీ చర్మం సాగిపోతుంది. వృద్దాప్య ఛాయలు మొహం పై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మోచేతుల పై సాగి పోయి కనిపిస్తంది. శరీరం లో కొల్లాజెన్ ఉత్పత్తి నెమ్మదించినప్పుడే ఇలాంటి పరిస్థితి వుంటుంది. ఈ చర్మాన్ని మాములు స్థితికి తీసుకు రావాలంటే సముద్రపు ఉప్పును నీటిలో కరిగించి ఆ నీటిని స్కెచ్ పాడ్ పై ముఖం పైన మోచేతుల చర్మం పైన మృదువుగా రుద్ది చన్నీళ్ళుతో కదిగేయోచ్చు. చర్మం బిగుతు కోసం స్ట్రాబెర్రీ, తేనె మిశ్రమం […]
అరచేతిలో అచ్చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ లో పోర్ట్రయిట్ మెహందీ అని కొట్టి చుస్తే వచ్చిన ఇమేజస్ ఆశ్చర్యం కలిగిస్తాయి. పెళ్ళి సమయంలో పెట్టుకునే గోరింటాకులో దంపతుల బొమ్మలు వచ్చేలా చేసేదే ఈ పోర్ట్రయిట్ మెహందీ. బొమ్మ చుట్టూ వేరే డిజైన్ వస్తుంది కానీ అరచేతుల్లో మాత్రం వధూవరుల చిత్రాలోస్తాయి. కాబోయే దంపతుల ఫోటోలు పంపేస్తే వాటి స్కెచ్ గీసి, అదే ఆకృతి వచ్చేలా స్టెన్సిల్ తరహాలో స్టిక్కర్స్ రూపొందిస్తారు. మెహందీ పెట్టేటప్పుడు ఆ స్టిక్కర్ అరచేతిలో వుంచి దాని పైన గొరింటాకు […]
స్త్రీలకు పిల్లలే ముఖ్యం.
నీహారికా, చాలా కోపమేచ్చె రిపోర్ట్ ఒక్కటి వచ్చింది. ఈ అధ్యాయినం ఇరవై రెండు దేశాలకు చెందిన 18 వేలమందితో నిర్వహించారు. ఇందులో తమ అభిప్రాయం చెప్పిన వారిలో స్త్రీలు, పురుషులు కుడా సమానంగానే వున్నారట. మొత్తంగా తేల్చేది ఏమిటంటే స్త్రీలు ఎంత పెద్ద హోదాలో వున్నా సరే, ముందుగా ముందుగా పిల్లల్ని కనడం పెంచడం మాత్రమే ప్రధాన భాద్యత అని చెప్పారట. మిగతావన్నీ తర్వాత మాటే. మేనేజర్ కావచ్చు. చిరుద్యోగి కావచ్చు. వీటన్నింటి కన్నా పిల్లలు కనడానికే […]
పడుకునేందుకు పద్దతి ఒక్కటి వుంటుంది.
పాడుకొనే సమయంలో కూడా పద్దతిగా పడుకొవాలంటారు నిపుణులు. గట్టిగా వుండే దిండు కాకుండా తలకింద మెత్తని దిండు వుండాలి. ఒక్కోసారి మెడ నొప్పి బుజాల నొప్పి వస్తాయి. ఇలాంటప్పుడు బోర్లా పడుకోకుండా వెల్లకిల్లా లేదా పక్కకు తిరిగి పాడుకోవాలి. దిండు తప్పనిసరిగా వేసుకోవాలి. లేకపోతే భారం భుజాల పై పడుతుంది. నడుము నొప్పి అయితే వెల్లకిలా పడుకుని దిండుని మోకాళ్ళ కింద పెట్టుకుంటే ఉపసమనంగా వుంటుంది. తలనొప్పి, చెంపలు లాగడం వుంటే చేతులు తల కింద పెట్టుకోకూడదు. […]
చేనేతలో అందంగా సామంత.
తెలంగాణా హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించాక సామంత చాలా సిన్సియర్‌గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టుంది. తాజాగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతూ కూడా ఆమె చేనేత చీరలోనే మెరిసిపోయారు. చీర కట్టుకున్నా, చుడీదార్ వేసుకున్నా సామంత స్టయిల్ గా ఫ్యాషన్ ఐకాన్ గా వుండే వారు. ఇక చేనేతలను ప్రోత్సహించే పని పెట్టుకున్నాకా ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్సు చేనేత తో తయ్యారైందే అయినా ఒక్కసారి ఆ ఇమజస్ […]
సంవత్సరం పొడుగునా పాటించాలి.
అలంకరణ విషయంలో చాలా పద్ధతులు పాటించాలి. కొన్ని రొజూ చేసేవి, కొన్ని వారానికి ఒక రోజు చేసేవి. కొన్ని ఏడాది పొడుగునా చేసేట్టు అలవాటు పడవలసినవి వున్నాయి. ఆఫిస్ కు కాలేజీకు వెళుతుంటే ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం, నాణ్యమైన సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసుకోవటం తప్పని సరిగా చేయాలి. ఇంట్లో వుండే గృహిణి అయినా సరే. అలాగే పడుకునే ముందు, ముఖానికి రాసుకున్న ఏ మేకప్ అయినా శుబ్రంగా తొలగించాలి. మోచేతులు, మోకాళ్ళు, మెడ, పాదాలు ఇలా […]
అది వాకింగ్ కాదు.
ఇంట్లో ఎదో ఒక పని చేస్తూ విపరీతంగా తిరుగుతాం కదా ఇంకా వాకింగ్ ఎందుకు అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. ఇందువల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. వేగం దూరం పైన ఆధార పడి వుంటుందిట వాకింగ్ అన్నది. 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అప్పుడు శరీర రక్త ప్రసరణలో తేడా వచ్చి జీవక్రియలన్నీ చైతన్యవంతమై శరీరం శక్తిని పొందుతుంది. తప్పా అటూ ఇటూ తిరగడం వాకింగ్ కిందకు రాదు అంటారు. శ్వాస వేగం పెరిగేంతగా నడవాలి. […]
పొడవుగా ఎదగాలంటే ఐరన్ అవసరం.
యవ్వనంలో అడుగుపెడుతున్న పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సెక్స్ హీరోయిన్స్ విడుదల అవుతున్నకొద్దీ పెరుగుదల వేగం పెరుగుతుంది. ఒక్క సారి పది సెంటీ మీటర్లు కూడా హటాత్తుగా పెరిగిన పిల్లలున్నారు. తల్లిదండ్రులకే చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది.ఈ సమయంలో మాములు కంటే ఎక్కువ ఆహారం కావాలి. ప్రత్కేకమైన శ్రద్ధతో మంచి ఐరన్ కంటెంట్ వున్న ఆహారం ఇవ్వాలి. పొడుగ్గా వుండటం మనిషికి అందానిచ్చే విషయాల్లో ఒక్కటి. పాలు, గుడ్లు, ఐరన్ శాతం అధికంగా వుండే ఆకు కూరలు […]
బొమ్మలు సర్ధటంలో పిల్లల సాయం.
మరీ చిన్న పుల్లలున్న ఇంట్లో గృహిణి, వాళ్ళు ఆడుకుంటూ అటు ఇటు పారేసిన బొమ్మలు, పేపర్లు, పుస్తాకాలు సర్దటంతో నే టైమ్ మొత్తం సరిపోతుంది. ఇవి ఒక్క పద్దతిలో సర్దుకుంటే ఇలా రోజంతా శ్రమ పడటం తప్పుతుంది. పిల్లలకి లేగాన్,యాక్షన్ ఫిగర్స్, ఇతర బొమ్మలు ఎన్నో ఉంటాయి. కొత్త బొమ్మ పైన ఇష్టం కనీసం రెండు మూడు రోజులైనా వుంటుంది. అలాగే బొమ్మలను పారదర్శకంగా వుండే డబ్బాల్లో ఉంచితే వాళ్ళు ఏ బొమ్మ అడిగితె దాన్ని మాత్రం […]
చర్మానికి రక్షణ ఇచ్చే ఓట్ మీల్ ప్యాక్.
కొన్ని ఫేస్ ప్యాక్ లు సింపుల్ గా అనిపిస్తాయి కానీ చాలా చక్కగా పని చేస్తాయి. పైగా ఇందులో రసాయినాలు కలిసే అవకాశం లేదు. కనుక ముఖ చర్మానికి కలిగే నష్టం కూడా లేదు. ఓట్ మీల్ ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో తగినంత నీరు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమం ముఖం, మెడకి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేస్తే ఎండ వేడికి పగుళ్ళు బరుతున్న చర్మానికి మంచి పోషణగా […]
కాస్తయిన వెన్న తింటే మేలు.
గతంలో వెన్న వాడకం ఎక్కువే వుండేది. వెన్న వలన స్థూలకాయం వస్తుందనే అపూహా తో వెన్న నూనెల వాడకం తగ్గిపోతుంది. కానీ వెన్న వలన స్థూలకాయుల్లో కొవ్వు పాళ్ళు తగ్గిపోతాయని, వెన్న తిన్నాక కలిగే సంతృప్తి భావన మితి మీరి తినటాన్ని అవుతుంది. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందటమే కాక, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ A, D, E, K2 వంటివి చాలా ఎక్కువ. […]
స్ట్రెయిటనర్ల కంటే ఇలా చేయడం బెస్ట్.
జుట్టు స్ట్రెయిట్ గా వుంటే ఇలాంటి అలంకరణలైనా చేయొచ్చు. అలా స్ట్రెయిట్ గా వుంచడం కోసం, జుట్టు పెరుగుదల కోసం, ఆరోగ్యం కోసం కొబ్బరి పాలు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. కొబ్బరి పాలు తీసి దాన్ని జుట్టు కుదుళ్ళ వరకు పట్టించి ఓ అరగంట పాటు వదిలేసి ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో స్నానం చేస్తే జుట్టు స్ట్రెయిట్ గా మెరుపులీనుతూ కనిపిస్తుంది. రెండు చెంచాల బియ్యం పిండి, అరకప్పు ముల్తానీ మట్టి గుడ్డులో […]
పర్ఫెక్షన్ విషయంలో పట్టుదల వద్దు.
నీహారికా, అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేసే అలవాటు మంచిదే అయినా పర్ఫెక్షన్ కోసం అంతా గందరగోళం చేసుకోవడం మాత్రం తప్పే, ఏ పని చేసినా కరెక్ట్ గా ఉండాలనుకోవడం మంచి ధృక్పదమే. అయితే ఏమాత్రం తేడా వున్నా అంగీకరించలేని ధోరణి మాత్రం సబబు కాదు.అందుకే వీలయినంతవరకు పనిని సక్రమంగా ఎంత మాత్రం రాజీ లేకుండా చేయడానికే ప్రయత్నం చేయాలి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఎన్నో అనుభవాలు, తప్పులు, విజయాలు వికాసంలో సంభవించే చర్యలుగా తీసుకోవాలి. అభివృద్ధి […]
జీవన విధానాన్ని నిర్ణయించే అలవాట్లు
మన జీవన విధానంపైన మనం తీసుకునే ఆహరం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహరం అంటే రోజువారీ భోజనంతో పాటు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినడం, పూర్తిస్థాయి ధాన్యం, బీన్స్, మొలకలు, కూరగాయలు, పండ్లు, గింజలతో పాటు సోయా మిల్క్, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, పాలకూర వంటివి తినాలి. ఇవి వత్తిడిని తట్టుకునేందుకు, ఆరోగ్యవంతమైన సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు మంచి మూడ్ కోసం అవసరం అవుతాయి. ఆహరపు అలవాట్లు ఆలోచనా విధానం, దృక్పదాల పైన ఎక్కువ ప్రభావం చూపెడతాయి. […]
కొవ్వుని పసిగట్టే ముక్కు.
మన్యుషులకు వాసన పిల్చే సెన్సు చాలా ఎక్కువ. ఈ గుణం లో పదార్ధాల్లోని ఘుమఘుమల్ని ఆస్వాదించడమే కాకుండా ఆయా పదార్ధాల్లోని డైటరీ ఫ్యాట్ ని, అందులో కలిపిన ఎన్నో రుచుల్ని పసిగట్టగలరని అధ్యాయినాల రిపోర్ట్. ఈ మంచి లక్షణాలని ఉపయోగించుకుని సరైన భోజనం చేయమంటున్నారు డైటీషియన్లు. మనలోని ఈ గుణాలని మనం సరిగ్గా గుర్తించము ఒక వేళ గుర్తించినా పట్టించుకోము. ఫలానా పదార్ధలో ఫైబర్ ఎక్కువగా వుంటుందని ముక్కు చెప్పినప్పుడు దాన్నలా వదిలేయక ముక్కు చెప్పిన వస్తావాన్ని […]
