Saturday, 28 Nov, 2026

అందం కోసం ఇంత చేయాలి.

ఏ దంగల్ సినిమానో, బాహుబలి సినిమానో చూసినప్పుడు హీరో, హీరోయిన్ లు కరక్ట్ ఫిట్నెస్ ప్లాన్ చేసారనిపిస్తుంది. అంటే పూర్తి శరీరాన్ని పరిగణలోకి తిసుకుని ఎక్సర్సైజులు చేయడం అన్నమాట. రన్నింగ్ లేదా బ్రిస్క్ వాక్ శరీరాన్ని కండీషన్ చేస్తాయి. క్యాలరీలు కరిగించి మేతబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. స్కిప్పింగ్, జుంపింగ్, జాక్స్ , స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటి వార్మింగ్ ఎక్సర్సైజులు కొన్ని ఆసనాలు కండరాళ్ళకు టోనింగ్ ఇస్తాయి. జీర్ణ వ్యవస్థకు సహకరిస్తాయి. రోజు సూర్య నమస్కారాలు […]

ఫంక్షనల్ ఫుడ్ తీసుకుంటున్నారా?

ఫంక్షనల్ పదార్ధాలు తీసుకోవాలి అని అని చెప్పుతూ ఉంటారు డైటీషియన్లు. సాధారణంగా వ్యాధుల రిస్క్ ను తగ్గించడానికి లేదా ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు పునరోగించే ఆహారం అని అర్ధం. ఆధునిక కాలంలో ముందస్తు జాగ్రత్త కోసం మంచి ఆరోగ్యంకోసం తీసుకోవలసిన ఆహార పదార్ధాల లిస్టులో వీట్ గ్రస్ జ్యూస్ ముందుంటుంది. ఇది మెగ్నీషియం, పొటాషియంలకు మంచి ఆధారం. ఈ రెండు ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. వెల్లుల్లిలో రక్తాన్ని పల్చ బడెందుకు సహకరించే గుణాలుంన్నాయి. ఇక ఓట్స్ లోని […]

ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం.

చాలా మంది ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే వాళ్ళు కూడా గింజల్ని పట్టించుకోరు. ఉదాహరణకు అవిసె గింజల్లో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. వీటిని షేక్స్ లో కలుపుకొవచ్చు. ఇక పొద్దు తిరుగుడు గింజల్లో జింక్, ఐరన్ పుష్కలంగా దొరుకుతాయి. జొన్నల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ. కర్భూజా గింజల్లో ఇతర మసాలా ద్రవ్యాలతో కలిపితే మంచి మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తాయి. పుచ్చ గింజల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో […]

ఇవాల్టి నయా ట్రెండ్ ఇదే.

ఫ్యాషన్ అన్నది ఎప్పుడూ కొత్త పోకడలకు పోతూనే వుంటుంది. ఫ్యాషన్ డిజైనర్స్ సారి కొత్తగా కనిపిస్తుంది అనుకున్న ప్రతి దాని ఫ్యాషన్ స్టేట్మెంట్స్ కింద మార్చేయగలరు. అలా వచ్చిన నయా సంచలనం బ్రష్ స్ట్రోక్ కలర్ ప్రింట్ డ్రెస్సెస్. పేరు కొత్తగా ఇంత పొడుగ్గా వుంది కానీ డ్రెస్ డిజైన్ మాత్రం బ్రష్ ని రంగుల్లో ముంచి దుస్తుల్లో చిలకరిస్తే ఎలా వుంటుందో అలాగన్నమాట. అంత దాకా ఎందుకు ఒక సాదా బట్ట పరిచేసి, చిన్నపిల్లలా చేతికి […]

జీన్స్ పై హస్త ‘కళ’ కళ.

జీన్స్ ని కనిపెట్టాక వాటిని దాటిఫ్యాషన్ ఎన్నో అడుగులు వేసిందే లేదు. ఏదైనా జీన్స్ చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటికీ అమ్మాయిల ఫ్యాషన్ జీన్స్ పాంట్లు, షర్టులే. అయితే సాధారణ జీన్స్ ని కాన్వాస్ గా తీసుకుని రంగురంగుల చిత్రాలు సృష్టించి దాన్ని బోహా బిక డెనిమ్ జాకెట్ అన్నారు ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించింది. బొహిమియిన్ నేపాల్ హస్తకళల మేళవింపు తో వినూత్న ఆకృతులను సృజించి, వాటికి పూసలు రాళ్ళు పొదిగి అందంగా తయ్యారు చేసారు. […]

సెక్విన్స్ ఈవినింగ్ స్పెషల్.

sequin dress ఎప్పుడూ నైట్ పార్టీలకే ప్రాధాన్యం. సాయంత్రం వేళ మెరిసిపోయే ఆ దుస్తులు పగటి వేళా బాగానే ఉంటాయి. అంతే కాదు మెరిసి పోయే సెక్విన్ బ్యాగ్స్, షూస్ఎప్పుడూ రాత్రి పార్టీ లకు ఎంచుకోవడం లో సీక్రెట్ కేవలం ఆమెరుపుల కోసమే. అయితే పుర్తిగా సెక్విన్ డ్రెస్ లు, బ్యాగ్ లు, షూస్ అన్ని కలిపి మాత్రం అందమైన ఎంపిక కానేకాదు. పగటివేళ ట్రాన్స్ పోర్ట్ సెక్విన్ లు ఉపయోగించుకోవచ్చుస్పోర్ట్స్ సెక్విన్స్ టీన్ లేదా జిమ్ […]

ఆరోగ్యం, సౌందర్యం కోసం పల్లీ నూనె.

ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల నునెల ఇవ్వాళ వాడకం లోకి వచ్చాయి కానీ పిండి వంటలైనా రొజువారీ వంటలైనా పల్లీ నూనె తో చేస్తేనే రుచిగా వుంటాయి. ఈ వేరుసెనగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వుపదార్ధాల తో పాటు మినరల్స్, ADE విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇది అధిక సంఖ్యలో శరీరానికి క్యాలరీలు అందిస్తుంది. సౌందర్య సాధనలోనూ పల్లి నూనె ఉపయోగాలు ఎక్కువే. బాడీ మసాజ్ కు ఉపయోగించే నూనె లో ఇది […]

ఇచ్చుటలో ఉన్న హాయీ…

నీహారికా, మనం నిముష నిముషం గుర్తు తెచ్చుకోవలసిన విషయం ఒకటుంది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, మనిషి జీవితం సంతోషమయం కావాలంటే ఏం చేయాలి. మనిషి ముందర సంతృప్తిగా జీవించాలి. ఆ సంతృప్తి ఎక్కడ దొరుకుతుందీ అని అన్వేషిస్తే ఇవ్వడంలో అని తేలిందట. అవును ఎవరో సినిమా కవి చెప్పినట్లు “ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని” మనకున్నదానిలో ఎదుటి మనిషికి ఏదైనా ఇవ్వడం, సాయం చేయడంలో కలిగే తృప్తి వర్ణించతరం కాదని తేలింది. నిజమే మనకి సంతృప్తి […]

సప్లిమెంట్ల కంటే సమతుల్యాహారం బెస్ట్.

మల్టీ విటమిన్లు, సప్లిమెంట్లు తీసుకోవటం ఇవాల్టి యువత ఆదర్శం వీటి ద్వారా తమకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయనే బ్రమలోనే వారున్నారు. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పప్పులు వంటి ఆరోగ్యకరమైన ఆహారానికి మంచి ఉత్తమమైనది ఇంకొకటి ఖచ్చితంగా లేదు సుప్లిమెంట్లు శారీరక కణాల్ని డామేజ్ చేయకుండా కాపాతాయని గతంలో పరిశోధనలు చెప్పాయి కానీ ఎవరైతే సమతుల్యాహారం తీసుకొంటారు. ఆరోగ్యవంతమైన వివిధ పదార్ధాలు ఎంత ఎక్కువగా తీసుకుంటారు. వారికీ వైద్యుల సిఫార్స్ చేస్తే తప్పా సుప్ప్లిమెంట్స్ […]

ఆమెను కించ పరిస్తే సహించదు.

వివాహ బంధానికి సంబందించి సెవెన్ ఇయర్స్ ఇచ్ అన్న పదం ఇప్పుడు మూడేళ్ళకే పరిమితం అవుతుంది. కొత్త తరం మహిళలు సమస్యలు ఫేసు చేయడానికి, అసౌకర్యాన్ని ఒర్చుకోవడానికి సిద్దంగా లేరు. పరస్పర అవగాహన లేకపోవడం వైవాహిక బంధం బ్రేక్ అవ్వడానికి కారణం అవుతుంది. వారిని నొప్పించే అంశాల గురించి మగవాళ్ళు సమిక్షించుకోవలసిన సమయం ఇది. తమ భావాల్ని ఎంత గౌరవిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల ముందు పిల్లల ముందు వారిని కించ పరచనే కూడదు. […]

నా ఆత్మ విశ్వాసాన్ని గర్వం కింద తేల్చారు.

కంగనా రనౌత్ ను క్వీన్ అంటారు. జీవితంలో కొన్ని విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత నిజం అవుతుంది అంటుంది కంగనా. ‘ నేను పుట్టినప్పుడు మళ్ళీ అమ్మయేనా అని మా అమ్మ చాలా నీరస పడిందట. సినిమాలను కెరీర్ గా చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి నచ్చాక్ పోయే సరికి ఇల్లు వదిలి వచ్చేసాను. నన్ను డాక్టర్ ను చేద్దాం అనుకున్నారు. వాళ్ళు. కానీ జబ్బు పడిన వాళ్ళకి చికిత్స […]

వేసవిలో పానకం బెస్ట్.

ఈ ఎండల్లో చల్లగా ఎనర్జీ ఇచ్చే పానీయం పానకం ఒక్కటే శ్రీరామ నవమికి చేసే పానకం ఈ వేసవి రోజుల్లో ప్రతి రోజు తాగినా ఏ ప్రాబ్లం రాదు. ఒక్క గిన్నెలో బెల్లం కొట్టి పడేసి కాసిన్ని నీళ్ళు పోసి పెడితే కరిగిపోతుంది. కరిగాక కావలసినన్ని బెల్లం తీయదనం సరిపోయే వరకు కలపాలి. ఆ నీళ్ళను వడపోస్తే నలకలు పోతాయి. వడకట్టిన నీళ్ళల్లో  నిమ్మరసం, శొంటి పొడి, యాలుకల పొడి, నల్ల మిరియాల పొడి ఉప్పు వేసి […]

అమ్మ అన్నది ఒక్క తియ్యని మాట.

అమ్మ అన్న రెండక్షరాల తీయదనం ఎన్నో సార్లు నోరారా పిలిచినా తగ్గదు. ఆమె సాంప్రదాయపు అమ్మ మాత్రమే కాదు. ఇప్పుడు యూత్ అంటే మదర్ టాటూ అరాధకులు మారారు. అమ్మలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో ఈ మదర్ టాటూ లో అన్ని రంగులున్నాయి. వర్ణ శోభితమైన అమ్మ టాటు ఇప్పుడు స్టైల్ ఐకాన్. సాంప్రదాయ సింబల్స్ తో కూడిన క్లాసిక్  మాంమ్ టాటు డిజైన్లు వేయించుకుంటున్నారు. హార్ట్స్, బర్త్ స్పాట్స్ లాంటి క్లాసిక్ సింబల్స్ వుంటే కొందరు […]

హెయిర్ బాండ్స్ స్టయిల్ స్టేట్మెంట్స్.

హెయిర్ యాక్సిసరీలు ఫ్యాషన్ స్టయిల్ లో ముందే ఉంటాయి. హెయిర్ స్టయిల్ కు కొత్త అందం తెస్తాయి. సాధారణ హెయిర్ బ్యాండ్స్ కూడా స్టయిల్ స్టేట్మెంట్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడివి ఎక్స్టెన్ షన్ లకు అవసరం అవుతున్నాయి. సాదా కలర్ లో లేదా ప్రింటెడ్ బ్యాండ్స్ పగటి వేళలకు బావుంటాయి. ఫెదర్లు, సెక్విన్లు, జ్యూయిల్డ్ బ్రాండ్స్ ప్రత్యేక సందర్భాలకు నప్పుతాయి. అలాగే చిన్నా పెద్దా హెయిర్ క్లిప్స్ రకరకాల ప్రింట్స్ ఆకృతుల్లో రొజువారీ దుస్తులకు చక్కగా మ్యాచ్ […]

భాషానైపున్యాలను పెంచే తల్లి పాలు.

పాపాయికి తల్లి పాలు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమో ఎప్పటి నుంచో తెలిసిన సంగతే ఎప్పుడూ తల్లి పాల అధ్యాయినాలు సాగుతూనే ఉంటాయి. ఈ ప్రయోజనానికి కొత్త జోడింపులు ఇలాగే తెలుస్తాయి. పిల్లలకు ఆరు నెలలకు పైగా పాలు ఇస్తే వాళ్ళల్లో జ్ఞాపక శక్తి సంబందించిన అంశాలు, భాషా నైపుణ్యాలు బాగా పెరుగుతాయట. పిల్లలు తొమ్మిది నెలలు వచ్చినా తల్లిపాలు తాగుతూ వుంటే వారిలో శీఘ్రంగా గ్రహించే శక్తి కమ్యునికేషన్, చటుక్కున అందుకోవడం వంటి మంచి లక్షణాలు డెవలప్ […]

మొబైల్ తడిసి పొతే.

అదిరిపోయే ఎండలు ఆఖరయ్యే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా గబుక్కున నాలుగు చినుకులు రాలోచ్చు. అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న ఫోన్ కాస్త తడిసిపోతే వెంటనే తీసుకునే చార్యలతో మొబైల్ ఫోన్ కాపాడుకోవచ్చు. ముందుగా వర్షం మొదలవ్వుతూనే ఫోన్ వెంటనే హ్యాండ్ బాగ్ లుతడవకుండా పెట్టుకోవాలి. ఒక వేళ అప్పటికే తడిస్తే ముందుగా అందులో వున్న బ్యాటరీ తీసి బయట ఆరబెట్టాలి. లోపల సిం కార్డ్ కూడా తీసేయాలి. సెల్ ఫోన్ పైన వున్న తడి మొత్తని […]

కేన్స్ ఉత్సవంలో మెరిసిన క్వీన్స్.

ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవం మొదలైంది. ఈ వేడుకలు విదేశీ తారలతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ కుడా మెరిసిపోయారు. దీపికా పడుకొనే, మల్లికా షెరావత్ రెడ్ కార్పెట్ పై అందంగా నడిచారు. వయోలెట్ మార్టేసా గౌన్ లో దీపికా పడుకొనే అందరి ద్రుష్టి ని ఆకర్షిచింది. కేన్స్ ఫోటో షూట్ లోనే అందాల తార ఐశ్వర్యా రాయ్ ధరించిన ఆకు పచ్చని గౌన్ సోషల్ మీడియాలో వేల కొద్దీ లైక్స్ సంపాదించింది. కూతురు అరధ్యలు కలిసి ఈ చిత్రోత్సవానికి […]

నిజాయితీ అన్నది ఒక పరిమళం

నీహారికా, ఎవరిరైనా సరే చిన్నపాటి తప్పు చేయకుండా రోజు గడవదు. కానీ అలాంటి చిన్న తప్పు చేశామని తెలిసీ ఎవరికైనా ఎలా తెలుస్తుందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ ఇదే అలవాటైపోతే ఇదే ఒక ఆఫీస్ అయితే, ఆ ఆఫీస్ జీవితం మన కెరీర్ అయితే, ఒక తప్పు జరిగితే దాన్ని పై అధికారికి వెంటనే చెప్పటం వల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు. మనం మన బాస్ కంటే తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ బాస్ స్థానంలో […]

కర్పూరం వెలిగిస్తే వాసన పరార్.

వేసవి సెలవులకు పిల్లలు అందరు ఊరు వెళతారు. అయితే ఊరికి వెళ్ళే ముందర, ఫ్రిజ్ లో కిచెన్ లో అన్నీ ఖాళీ  చేసి మిగిలినవి అవతల పారేసి ఇంటి తలుపులు జాగ్రత్తగా వేస్తే చాలు…. అదోరకమైన  వాసన వస్తుంది. ఇల్లు వాకిలి క్లీన్ చేసుకున్నా రెండు రోజుల పాటు ఆ వాసన వదలదు. ఇక ఏదన్నా అలర్జీ వుంటే వాసన నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మరి ఆ ఇబ్బంది నుంచి బయట పడాలంటే ఇంటికి తాళం […]

మేకప్ తో మాయ చేయొచ్చు.

పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఎక్కువగా వుండే సీజన్ ఇదే. అంతు లేని వేడి కళ్ళ కింద వలయాలు అలసట సృష్టిస్తూ వుంటుంది. ఏదైనా మేకప్ తో ఈ వలయాలని దాచేయటం చాలా కష్టం. కన్సీలర్ తో ముఖం పైన ముడతలు, మచ్చలు, చర్మం సాగి పోవడం కవర్ చేయడం కష్ట కష్టమే యవ్వనపు ఛాయలు పరిరక్షించుకోవడం కోసం నల్లని వలయాలు కనబడనీయకుండా చేసేందుకు చర్మం కోసం డిజైన్ చేసిన మాయిశ్చురైజర్ ఎంపిక చేసుకోవాలి. కన్సీలర్ అప్లయ్ చేసే ముందర […]