May 2017
ఎండల్లో చల్లగా ఉండాలంటే.
వేసవిలో ప్రధానంగా బాధించే సమస్య డీహైడ్రేషన్, ఎండ, చమట వల్ల అలసట, నీరసం కూడా తప్పదు. వీటిని తగ్గించుకోవడం కోసం జీవన శైలి లో మార్పులు తీసుకోవాలి. వ్యాయామాలు చేసే వాళ్ళు కేవళం మంచి నీళ్ళ పైనే దృష్టి పెడితే సరిపోదు. కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటూ వుండాలి. చమట వల్ల శరీరం మేలు చేసే ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. శరీరంలో ఖనిజాలు బయటకు వెళ్ళిపోతాయి. అందుకే నీరసం, అలసటా. అలాంటప్పుడు ఎక్కువ […]
మిరపండుతో దీర్ఘాయువు.
మిరపపండు చూస్తేనే కారం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ కారం ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంతో జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి. అందులో పండు మిరప తినేవాళ్ళు మిగతా తినని వాళ్ళతో పోలిస్తే అత్యధిక కాలం జీవిస్తున్నట్లు యునివర్సిటీ ఆఫ్ వెర్మాంట్ చేసిన పరిశోధనల్లో తేల్చింది. పూర్వ కాలంలో సుగంధ ద్రవ్యాలని, మిర్చిని కూడా రకరకాల వ్యాధుల చికిత్సలో భాగంగా ఉపయోగించే వాళ్ళు. ఒక ఇరవై ఏళ్ళ పాటు కొన్ని వందల మంది పైన ఈ పరిశోధన […]
ఇలా కలిపి తింటే మంచిది.
ఇప్పుడు వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు రకరకాల జ్యూస్ ల వైపు చూస్తారు పిల్లలు, పెద్దలు కూడా. కొన్ని జ్యూస్ లు యధావిధి గా తీసుకోవడం కన్నా కొన్నింటితో కలిపి తీసుకుంటే ఆరోగ్య పరంగా లాభం. పుచ్చకాయ రసానికి కీరాదోస, పుదీనా కలిపితే వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. గ్రీన్ టీలో పుదీనా, నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు వేగంగా తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. నారింజ లేదా కమలా పండ్ల రసం […]
బాంధవ్యాన్ని ధృడంగా వుంచేది నమ్మకం
వివాహబంధం తో ముడిపడ్డ భార్యాభర్తల స్నేహబంధం కలకాలం అలాగే వుండాలంటే ముందు దాన్ని కాపాడుకొనే ప్రయత్నo ఇరువైపుల నుంచి రావాలి. ఏ చిన్న సమస్యకైనా అవతల వాళ్ళను అర్ధం చేసుకొనే మాట్లాడుకోవాలి. ఇబ్బంది లేనంత వరకు చూసి చూడనట్లు వ్యవహరించడమే మంచిది. భాగస్వామి అంటే ఒకళ్ళకొకళ్ళు స్నేహితులమే. ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవడం, గౌరవించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నమ్మడం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు నమ్మటం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. […]
మెరిసే పువ్వుల టాప్సే బెస్ట్
ఎప్పుడూ ఒకే రకమైన శరీర లావణ్యం వుండదు. వయస్సు పెరుగుతున్నా, పిల్లలు పుట్టినా కొద్ది పాటి మార్పులు వస్తాయి. కాస్త పొట్ట ఉచ్చేత్తుగా కనబడటం ఇబ్బంది పెట్టే విషయాల్లో ఒక్కటి. కొద్ది జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు, పొట్ట కనిపించకుండా బెల్ట్ ఉపయోగించవచ్చు. దాన్ని పొట్ట పై భాగంలో, ఛాతీకి కిందగా వుంచుకోవాలి. అలాగే పెద్ద పువ్వులున్న టాప్ ఎంచుకోవాలి. బిగుతుగా వుండే దుస్తుల జోలికి వెళ్ళక పోవడం మంచిది. మంచి రంగులు ఎంచుకోవచ్చు. […]
ఇదీ మేకప్ స్పాంజే
కొన్ని వస్తువులు చూసేందుకు చాలా ముద్దుగా ఉంటాయి. అది ఫ్యాషన్ గా వుంటే, నలుగురి ద్రుష్టి పడేలా వుంటే, ఉపయోగంగా వుంటే ఇక దాని దారే వేరు. మనం పౌడర్ ను ముఖానికి సమంగా వేసుకోవాలంటే స్పాంజు లాంటి పఫ్ ని వాడతాం. అయితే వీటి స్థానంలో సిలికాన్ తో చేసిన, పారదర్శకంగా వుండే సిలీ స్పాంజులు వస్తున్నాయి. మాములు స్పాంజుతో సన్నని రంద్రాలు వుండటం వల్ల చాలా పౌడర్ వృధా అవుతుంది. అదే జారి పోయే […]
ఇలా వుండటం అమ్మాయిలకు నచ్చేసింది.
ఆఫీసుకీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫ్యాషన్ గా ఉంటుందని ఎత్తు మడమల చెప్పులేసుకుంటారు. కానీ ఎక్కువ సమయం నడవాల్సి వచ్చినా గబగబా ఏ మెట్లో ఎక్కవలసిన ఈ మడమలతో కష్టమే అయితే కావాలనుకోన్నప్పుడు ఎత్తుగా ఉండేలా, అవసరం లేనప్పుడు లోపలి ముడుచుకునేలా, రన్ వాకబుల్ హై హీల్ షూలు మార్కెట్ లోకి వచ్చాయి. కేలమిన్ హీల్స్, షీలాస్ హీల్స్ పేరుతో వస్తున్న ఈ చెప్పుల అడుగు భాగం, సగం వరకు లేదా, మొత్తం గా లోపలికి మడిచే వీలుంటుంది. […]
ఎక్కువ సార్లు తింటుంటేనే ఆరోగ్యం
చాలా మంది మూడు పూటలా భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు ఒక సారే తిని సరిపెట్టుకొంటారు. కొంత మంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.అయితే ఒకసారి ఎక్కువ తినే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ సార్లు కొద్ది కొద్దిగా తింటే ఆరోగ్యమని పరిశోధనల సారం. ఎందుకంటే తిన్న ప్రతిసారి కొంత బాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దానితో ఈ బాక్టీరియాను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. అది పనిచేయడానికి కొన్ని క్యాలరీలు కావాలి. అంటే తీసుకున్న […]
చీకు చింత లేని వాళ్ళకే సుఖ నిద్ర
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అన్న సామెత తెలిసిందే. గాఢ నిద్ర కోసం విలాసవంతమైన పరుపులు అక్కర్లేదు, కష్ట జీవి అలసిపోయి పడుకొంటే నిద్ర చెప్పా పెట్టకుండా వచ్చి సేదదీరుస్తుందని అర్ధం చేసుకొoటాం, కానీ నిద్రాదేవి ఎక్కువ సంపాదనా పరులను, జీవితంలో అన్ని ఐశ్వర్యాలను అనుభవించే వాళ్ళనే వరిస్తుందని ఇప్పటి రిపోర్ట్. మంచి జీతంతో పనిచేసే ఉద్యోగులు, బాగా ధనవంతులు ఏడెనిమిది గంటల నిద్ర పోగలిగితే ఆదాయం లేని, పేదరికంతో బాధపడేవాళ్ళు అంత సుఖంగా […]
సహజమైన అభారం శాంతం!
నీహారికా, సంతోషాన్ని నవ్వులతోనూ, పువ్వులతోనూ పోలుస్తారు. అలాగే కోపం, పగ, ప్రతీకారం వంటివి చీకటి తోనో, వడగాల్పు తోనో పోలిక తెస్తారు. ఎందుకంటే ఒక ఆనందం తో పాటు, మంచి ఆలోచన తో పాటు మనిషి ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ చెక్కారు కొడతాయో, కోపంతో పగ, ప్రతీకారం వంటి పదాలు మనస్సులో మెదులుతూ, వున్న కోపాన్ని రెచ్చగొడుతూ మనిషిని తల కిన్డులు చేస్తాయి. మన మనస్సులో ఎవరి పైన అయినా ద్వేషభావం పగ ఉన్నయనుకో అవి ముందు […]
నగల తయ్యారీకే ఏడాదిన్నర పట్టింది.
బాహుబలి-2 సక్సెస్ వెనుక ఎంతో మంది కష్టం వుంది. ముఖ్యంగా శివగామి రాజసం, దేవసేన అందం ఇవన్నీ వెండితెర పైన కనిపించాలంటే అందమైన దుస్తులు, వాటికి తగ్గ నగలు వుంచాలి. బాహుబలి సినిమా పాత్రలకు తగిన నగలు తయారు చేసింది. ఆమపాలి జ్యూయిలర్స్ మొత్తంగా 1500 పైగా నగలు తాయారు చేసారట. దేవసేన పాత్ర కోసం పాపిట బిళ్ళ దగ్గర నుంచి కాలి మెట్టెల వరకు నలుగు సెట్లు చేసారు. ఒక్కో నసెట్ లో యాబై వరకు […]
సేఫ్ స్విమ్మింగ్ కోసం ఈ జాగ్రత్తలు.
ఇప్పుడు ప్రతి అపార్ట్ మెంట్ లోనూ స్విమ్మింగ్ పూల్స్ కడుతున్నారు ఎండలు వచ్చాయంటే స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు, పెద్దలు దుకేందుకు సిద్దంగా ఉంటారు. తగిన జాగ్రత్తలు పాటించకుండా స్విమ్మింగ్ పూల్ లో దుకేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. సేఫ్ స్విమ్మింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు దృష్టిలో వుంచుకోవాలి. ఉదయం పది గంటల తర్వాత, సాయంత్రం 4 గంటలకు ముందు స్విమ్మింగ్ చేయక పోవడం మంచిది. స్విమ్మింగ్ కు ముందు స్నానం తర్వాత సన్ స్క్రీన్ తప్పనిసరిగా […]
వేసవి తాపం హరించే పోషక రసాలు.
ఈ మండే ఎండల్లో వడగాల్పులతో దాహం తో గొంతు ఎండకు పోతుంటే పండ్లు, కూరగాయలు,రసాలు తిసుకోమంటున్నారు న్యూట్రిషనిస్టులు. క్యారెట్ తియ్యని రుచితోనే వుంటుంది. ఈ జ్యూస్ తో గుండె జబ్బులు నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ది చేయడంలో తోదపడుతుంది. వేసవికి దేహ శాంతి కూడా. అలాగే బీట్ రూట్ రసం కాలేయాన్ని రక్షిస్తుంది. వయామం చేసినప్పుడు దానికి అనుగుణంగా శరీరం స్పందించే తీరును కూడా మెరుగు పరుస్తుంది. బీట్ రూట్. ఇందులో వుండే ఫైటో న్యుట్రీయంట్లు రక్తం […]
మిస్ టీన్ యునివర్స్ గా సృష్టీ కౌర్.
నోయిడాకు చెందిన సృష్టీ కౌర్ మిస్ టీన్ యునివర్స్ గా పాతిక దేశాలకు చెందిన అందమైన అమ్మాయిలను ఓడించి కిరీటం దక్కించుకొంది. నికారాగువ లోని మనుషుల తో జరిగింది పోటి భారత దేశంలో పుట్టినందుకు గర్వ పడుతున్న నాదేశానికి నావంతు ఎదో ఒక కోణంలో మంచి పేరు తెచ్చేందుకే ప్రయత్నిస్తుంటాను అని 2017 మిన్ టౌన్ యూనివర్సిటీ గెలుచుకున్న సంతోషంతో ఆనంద భాష్పాలతో చెప్పింది సృష్టీ కౌర్. మిస్ టీన్ పోటీలను గత ఆరేళ్ళుగా నిర్వహిస్తున్నారు. 15 […]
జైపూర్ లో మహిళా పొలీస్ పెట్రోల్ యూనిట్.
జైపూర్ లో తోలి మహిళా పెట్రోల్ యూనిట్ రంగం లోకి దిగింది. ఈ యూనిట్ లో మొత్తం 52 మంది పోలీసులు వున్నారు. వీరు జైపూర్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల పై తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తారు. వీళ్ళ పనితనం తో జైపూర్ మహిళలు ఎంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగాలరనే ఆశతో ఈ మహిళలు ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగలరనే ఆశతో ఈ మహిళా పెట్రోలింగ్ యూనిట్ ని పోలీసులు ఏర్పాటు చేసారు. పింక్ […]
బడలిక పోయేందుకు పరిమళస్నానం.
శరీరపు బడలిక వదిలి హాయిగా ఉండాలంటే స్నానం ఒక్కటే దారి. అది పరిమళ ద్రవ్యాలతో అయితే ఆ ఘుమఘుమల వాసన తో మనస్సు తేలికైపోతుంది. వేడి నీళ్ళ స్నానం బావుందంటారు. కానీ వేడి నీళ్ళతో చర్మం, జుట్టు పై వుండే సహజమైన తేమ మాయమైపోతుంది. తేమ తగ్గి చర్మం వెంట్రుకలు పోడిబారిపోతాయి. అంచేత గోరు వెచ్చని నీళ్ళలో గుప్పెడు గులాబీ రేకులు, రెండు చుక్కల లవెందర్ నూనె కలపాలి. అంతకంటే ముందు ఒక కప్పు గులాబీ రేకుల్ని […]
ప్రపంచంలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోట్.
న్యూయార్కలో జరిగిన మెట్గలా 2017 లో ప్రియాంకా చోప్రా ధరించిన పొడవాటి ఫ్రెంచ్ కోట్ ఇప్పుడు హాట్ టాపిక్. బహుశా ప్రపంచలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోటు కావొచ్చని ఫ్యాషన్ ప్రియులు అంటున్నారు. ప్రియాంక ఈ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే, ఆ వేదిక వద్ద ఫోటో క్లిక్కుల వర్షం కురిసింది. ఈ కోట్ ధరించిన ప్రియాంకాను వేదిక దగ్గర ప్రత్యేక వాహనంలో తీసుకు వచ్చారు. ఈ కోటే పెద్ద మైదానం అంత వుందనీ, […]
గుంజీళ్ళ తో నడుముకు బలం.
ఆఫీసులో కంప్యుటర్ ముందు అత్యధిక సమయం గడిపేవారు నడుం కింద భాగం లో నొప్పి అంటూ ఉంటారు. సరైన భంగిమలో కూర్చోకపోవడం, అదనపు వత్తిడి, నడుం పైన పెట్టడం ఇందుకు ముఖ్య కారణం ఇందుకోసం చిన్న చిన్న వ్యయామాలు చేయొచ్చు. పాదాలు నేలకు తాకిస్తూ కుర్చీలో కూర్చోవాలి. చేతులను మోకాళ్ళ పైన వుంచి వీపు, మెడను సాగదీసి నెమ్మదిగా ముందుకు వంగుతూ మోకాళ్ళ పైన వున్న చేతులను కింది నేలకు తాకే ప్రయత్నం చేస్తూ చతీని మోకాళ్ళకు […]
పోషక పదార్ధాలు నిండిన స్పినాక్.
https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-12.html
పిల్లలకు వంటిళ్ళు పరిచయం చేయడం అవసరం
నీహారికా, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళెంతటి వాల్లె అన్ని నేర్చుకుంటారు అనుకొంటారు కానీ వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే కొన్ని నైపుణ్యాలు పరిచయం చేయడం చాలా మంచిది. ఉదాహరణకు పిల్లలు వంట గదిలోకి వస్తే చాలు ఏం కావాలి, ఎందుకొచ్చావు పోయి చదువుకోమంటూ తల్లులు తరిమేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్లనే అటు ఏ పై చదువులకు వేరే ఊరులో వుంది చాడుకోవాల్సి వచ్చినా , లేదా పెళ్లి అయ్యిపోయినా, ఇటు అబ్బాయికీ, అమ్మాయికీ వంటే రాదు. అదేదో పెద్ద […]
