• వివాహబంధం తో ముడిపడ్డ భార్యాభర్తల స్నేహబంధం కలకాలం అలాగే వుండాలంటే ముందు దాన్ని కాపాడుకొనే ప్రయత్నo ఇరువైపుల నుంచి రావాలి. ఏ చిన్న సమస్యకైనా అవతల వాళ్ళను అర్ధం చేసుకొనే మాట్లాడుకోవాలి. ఇబ్బంది లేనంత వరకు చూసి చూడనట్లు వ్యవహరించడమే మంచిది. భాగస్వామి అంటే ఒకళ్ళకొకళ్ళు స్నేహితులమే. ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవడం, గౌరవించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నమ్మడం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు నమ్మటం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఇరువైపుల కుటుంబాలను గౌరవించాలి. పెళ్ళికి ముందు ఎలా వున్నారు పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలి. ఆలోచన, ఆసక్తులు, అభిరుచులు దేన్నీ పోగొట్టుకోవద్దు. ఇద్దరికీ ఎవరికివారికి ప్రైవసీ ఉండాలి. ఈ ప్రపంచంలో లోపాలు లేని వాళ్ళెవరూ వుండరు. పొరపాట్లు జరిగితే అందరి ముందు కించపరచటం, ఎత్తి చూపటం చాలా తప్పు. ఒంటరిగా ఉన్నప్పుడే ఎలాంటి విషయమైనా మాట్లాడుకొని మనసు విప్పి చెప్పుకోవాలి. ప్రేమ ఎప్పుడూ బంధాన్ని ధృడంగా ఉంచుతుంది. క్షమా గుణాన్ని పెంచుతుంది. అందుకే ప్రేమతో మెలిగితే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు.

    బాంధవ్యాన్ని ధృడంగా వుంచేది నమ్మకం

    వివాహబంధం తో ముడిపడ్డ భార్యాభర్తల స్నేహబంధం కలకాలం అలాగే వుండాలంటే ముందు దాన్ని కాపాడుకొనే ప్రయత్నo ఇరువైపుల నుంచి రావాలి. ఏ చిన్న సమస్యకైనా అవతల వాళ్ళను…

  • కోపతాపాలు మంచివే

    దంపతుల మధ్య స్నేహ సంబంధాలు ఎలా వుండాలి. కోపతాపాలు ఉండవచ్చా? గట్టిగా అరుచుకుని కోపం వ్యక్తం చేయొచ్చు అనే విషయం పైన తాజాగా చేసిన పరిశోధనలో కోపాలు…

  • భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాంధవ్యం కలకాలం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనుకోవలసిన పనిలేదు. ఈ రోజుల్లో గ్లోబల్ కెరీర్ పుణ్యమో, చదువుల కోసమో, ఇతరత్రా మరే కారణం వల్లనో నేటి జంటలు విడివిడిగా వుంటున్నారు. అయితే ఈ భౌగోళిక దూరాల వల్ల బాంధవ్యం వాడిపోదు. నిజానికి ఇంత దూరంగా ఉండే వారిలోనే నిరంతరం లోతైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఫలితంగా ధృఢమైన బాంధవ్యం ఉంటుందని తాజా అధ్యయనం సాగింది. ఫోన్ కాల్స్, వీడియో చాట్స్, టెక్స్ట్ మెస్సేజుల నడుమ మామూలుగా కలిసి వుండేవారికంటే ఎక్కువ కబుర్లు దొర్లుతున్నాయట. చాలా విషయాలు ఓపెన్ గా షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ నడుమ సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. వాళ్ళ మధ్య కోపతాపాలు, విసుర్లు, కసుర్లకు తావులేదు. అంటే దూరంగా ఉన్నంత మాత్రాన ఆప్యాయతలు, అనురాగాలు పెరుగుతాయే తప్ప తరగవన్నమాట.

    దూరంగా ఉన్నా ప్రేమ తగ్గదు

    భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాంధవ్యం కలకాలం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనుకోవలసిన పనిలేదు. ఈ రోజుల్లో గ్లోబల్ కెరీర్ పుణ్యమో, చదువుల కోసమో, ఇతరత్రా మరే కారణం…

  • ఆలు మగలు మధ్య బంధం గట్టిగా ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన కౌన్సిలింగ్ ఇస్తే వారిలో విడిపోవాలన్న కోరిక తగ్గటానికి రెండు మూడేళ్లు పడుతోందిట. దీనికంటే సినిమాలు చూపిస్తే బెస్ట్ కదా అంటున్నారు న్యూయార్క్ లోని బింగ్ టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాధ్యు జాన్సన్. సాధారణంగా మనుషులు సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకుని చూస్తుంటారు కనుకే చాలా సినిమాలు హిట్ అవుతుంటాయంటారు. జీవితంలో కలతలను సెంటిమెంట్ సినిమాల్లో సంఘటనలకు అవ్యయించుకుని వాటని తుడిచేసుకునే అవకాశం ఉందంటున్నారు. అసలు కలతలు రావటానికి ముఖ్యకారణం భార్య భర్తా ఎవరైనా సరే వారికి కొన్ని సొంత ఆలోచనలు ఆశయాలు కోరికలు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయం లో పరిధిదాటి అవతలివాళ్ళను నొప్పిస్తేనే బంధాలు బలహీనపడతాయి. అలాగే ఇద్దరిమధ్య దాపరికాలు కూడా విభేదాలకు కారణం దాపరికాలు ఉండటం. అందుకే భార్యాభర్తలు స్నేహితులు ప్రేమికులు ఎవరైనా సరే బంధంలో వీలైనంత స్వచ్ఛత పారదర్శకత ఉండటం చాలా అవసరం.

    సెంటిమెంట్ సినిమాలు చూపించండి

    ఆలు మగలు మధ్య బంధం గట్టిగా  ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన…