Friday, 14 Aug, 2026

టీ లో వేసుకొనే తేనె గోలీలు

గ్రీన్ టీ ఎంతో మంచిదంటారు. అలా చెప్పటం ఈజీనే కానీ ఏ రుచి లేకుండా వట్టి నీళ్ళలాంటి గ్రీన్ టీ రుచిగా వుండాలంటే దానికి కాస్త తియ్యదనం కావాలి. అలా అని పంచదార వేస్తే గ్రీన్ టీ ఉపయోగమే పోతుంది. అందువల్ల గ్రీన్ టీ లో తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యం అని తేల్చారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. అయితే ఏ ఆఫీస్ లాంటి చోటుకో లేదా ప్రయనాల్లోనో తేనె సీసా పట్టుకుపోవడం కష్టం. కాస్త జిగురుగా వుండే […]

నాణ్యత విషయంలో బ్యాంక్ ని నమ్మోచ్చు

బంగారం కొనడం అన్ని విధాలా మంచిదే. పొదుపు చేసిన డబ్బుతో చాలా మంది బంగారం కొనుక్కునేందుకే ఇష్టపడతారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోక పొతే డబ్బు నష్ట పోవడం ఖాయం. 916 క్యారెట్ బంగారం లో 99 శాతం స్వచ్చత వుంటుంది. ఇలా వున్న వాటి పైన హాల్ మార్క్ గుర్తు వుంటుంది. దీన్ని బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిర్ణయిస్తుంది. దీన్నీ  గమనించుకోవాలి. కంప్యుటర్ బిల్లు అయినా పర్వాలేదు. చిన్న ముక్కు పుడక కొన్నా సరే […]

జీన్స్ లెగ్గింగ్స్ కు బ్యాలేతరహా చెప్పులు అందం

ఫ్యాషన్ అంటే ఇప్పుడు అనేక వస్తు సముదాయం అనచ్చు. ఎలాంటి దుస్తులు అలాంటి మాచింగ్ నగలు, గాజులు, లిప్స్ టిక్, బొట్టు, చెప్పులు అన్నీ కాలన్ ఉంటాయి. లేకపోతె తన ఒక దానికొక్కటి పొంతన వుండదు. ఇప్పుడు జీన్స్ టీషర్ట్స్ లేదంటే కప్తాన్ మీదకు ఎత్తు చెప్పులు బావుంటాయి. ఆఫీసు కు వెళ్తుంటే స్టిలెట్టూన్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు కుర్తిలకు జతగా జీన్స్ లెగ్గిన్స్తోడయ్యాయి. కాళ్ళకు బ్యాలే తరహా చెప్పులు అందమే కాదు సౌకర్యంగా ఉంటాయి. ఇప్పటి ఫ్యాషన్ […]

ఇందులో కొంత మంచీ చెడూ రెండూ

కొందరికి కోపం వస్తే చుట్టూ భూకంపం తెచ్చేస్తారు. ఉచితానుచిత జ్ఞానం పోతుంది వాళ్లకి, దీనికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడమే. ఎప్పుడూ అవతలి వాళ్లలో లోపాలు వెతుక్కుంటూ ఉండడమే కారణం. పోనీ అలా విరుచుకుపడే ముందర నేను ఎన్నో తప్పులు చేశాను కాబట్టి, ఇతరులపైన కోపం తెచ్చుకునేందుకు నాకేమి అధికారం ఉంది..నేనూ ఏదైనా తప్పు చేశానా అన్న ప్రశ్నలు వేసుకుంటే ముందర  కోపం రాదు. ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఏదో ఒక విషయంపైన కోపం వస్తుంది. […]

ఎండ వేడి కూడా తోడైతే ప్రమాదం

గర్భిణులు ఈ ఎండలకు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణి శరీర ఉష్ణోగ్రత మామూలు కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. బయట ఎండ తగిలితే తీవ్ర అస్వస్థతకు లోనయ్యే ప్రమాదం ఉంది. దాహం వేయడం, నోరు ఎండిపోవడం, ఆకలి లేకపోవడం., చర్మం ఎర్రబారడం, అలసిపోవడం, చలిగా అనిపించడం  వంటివి ఉంటే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని గ్రహించాలి. అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరం ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పేతే కండరాలు తిమ్మిరెక్కుతాయి. నొప్పులు పుడతాయి. […]

పళ్లు తెల్లగా మెరుస్తాయి

తెల్లగా మిలమిలలాడే పళ్లు ముచ్చటగా ఆరోగ్యంగా  కనిపిస్తాయి. పళ్లపై పసుపు రంగు మరకలు రావడం మామూలే. ఈ పసుపురంగు వదలాలంటే నెలలో ఒకసారైనా  బేకింగ్ సోడా, నీరు కలిపి పేస్ట్‌గా చేసి దాంతో బ్రెష్ చేసుకోవాలి. ఇది మరకల్ని తొలగించే చిట్కా. ఎనామిల్‌కు ఎలాంటి హానీ కలగదు. అయితే తరుచూనో, ప్రతీరోజూ ఇది కుదరదు. అలాగే యాపిల్స్, చెరుకు గడలు సహజంగా డిటాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా కోలా, బ్లాక్ టీ, కాఫీ వంటివి పళ్లపై మరకలు పడేలా […]

లేత రంగు పరదాలు వాడి చూడండి

ఈ ఎండల్లో ఇంట్లో ఉన్నా ఉక్కగానే ఉంటుంది . పెరుగుతున్న ఎండలో ఉదయం ఏడు గంటలనుంచే వేడిగా అనిపిస్తోంది . అందుకే ఇంట్లోకి వేడి రాకుండా కిటికీలకు తప్పనిసరిగా పరదాలు వేయాలి . అవి లేత రంగుల్లో ఉంటే బయట వేడి ఇంట్లోకి రాకుండా ఉంటుంది.సాయంత్రం అవుతుండగానే గుమ్మం కిటికీ తలుపులను తెరచి ఉంచాలి .దీని వల్ల వేడిగాలులు బయటకుపోయి చల్లగాలి వస్తుంది . కిటికీ లోపల పరదా కట్టిన చోట వట్టి వేళ్ళ చాపలు వేలాడదీయాలి […]

అరటి కూరతోనూ ఎన్నో ఉపయోగాలు

అరటి పండ్లే కాదు పచ్చి అరటికాయలు  కూడా చాలా మేలు చేసే  కూరగాయ . విటమిన్‌ బి,సి అధికంగా లభించే వాటిలో ఇదీ ఒకటి . హిమోగ్లోబిన్‌ శాతాన్ని వృద్ధి చేసి  రక్తంలో చక్కెర  స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది . రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఎన్నో ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది . బరువు తగ్గాలనుకొనే వాళ్లకి మేలు  చేస్తోంది . ఇందులో సమృద్ధిగా ఉండే  పీచు  వల్ల  త్వరగా  పొట్టనిండిన భావన కలుగుతుంది . […]