Sunday, 28 Jun, 2026

చెప్పడం కాదు కాసేపు వినాలి కూడా

నీహారికా, నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం సమగ్రంగా ఉండదు. మన బాధలు, సంతోషాలు వాళ్ళతో పంచుకొంటేనే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ఎంత పని ఒత్తిడి వున్నా గంటో, అరగంటో వాళ్ళ కోసం కేటాయించి తీరాలి. స్నేహితులు చెప్పేది శ్రద్ధగా వినాలి. మొత్తం మనమే మాట్లాడాలని కూడా అనుకోకూడదు. వాళ్ళ మాటలకీ ప్రాధన్యం ఇవ్వాలి. […]

కుటుంబానికి నువ్వేదిస్తే అదే దొరుకుతుంది

ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందా కొచ్చార్, తన కుమార్తె ఆర్తి కొచ్చర్ కు రాసిన లేఖ ఇప్పుడో సంచలనం సుధామీనన్ రాసిన లెగసీ లెటర్స్ ఫ్రొం ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్ అన్న పుస్తకంలో ఈ లేఖ అచ్చయిది 13వ ఏటనే తండ్రిని పోగొట్టుకొన్న చందా కొబ్బరి తన తల్లి ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఈదడం నేర్చుకున్నారు. ఈ ఉత్తరంలో కొబ్బరి తన కూతురు ఆర్తికి కేవలం వర్కింగ్ ఉమెన్ గా వుంటే సరిపోదు […]

అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేసాకనే బయట కాలు పెట్టాలి. ఎండ తీవ్రతకు చర్మం కందిపొతే ఆ ప్రదేశంలో అలా వేరే లోషన్ అప్లయ్ చేయాలి. వేసవిలో ఒంటికి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. పొడి చర్మం అయినా ఆయిలీ స్కిన్ అయినా మాయిశ్చురైజర్ అవసరమే. ఎండలో తిరిగితే చర్మం కమిలినట్లు అవుతుంది. అప్పుడు, […]

చిన్న పలుకు తీసుకుంటే ఎంతో మేలు

కర్పూరపు చెట్టు నీలగిరి కొండల్లో పెరుగుతుంది చక్కని సువాసన గలిగిన బెరడు వుంటుంది. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచం మంచి గంధం, వెన్న కలిపి తమల పాకులోని వేసుకుని నమిలి రసం మింగితే కళ్ళు బైర్లు కమ్మడం, తలతిరగడం, కడుపులో వికారం, అతిగా చమటలు పట్టడం తగ్గిపోతాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది. ఈ వేసవి […]

తక్షణ శక్తికి చెరుకురసం

చెరుకు రసాన్ని వేసవి పానీయం అంటారు. డీ హైడ్రేషన్ కు గురైతే తక్షణ శక్తి ఇస్తుంది చెరుకురసం. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. అంచేత మధుమేహం వున్న వాళ్ళు కూడా ఈ రసం తాగొచ్చు. చెరుకురసంలోని ఫినాల్, ఫ్లేవనాయిడ్ లు శరీరంలోని చెడు బాక్టీరియా తొలగిస్తాయి. కాలేయ వ్యాధులు రాకుండా కామెర్లు రాకుండా కాపాడుతుంది. అలసట నివారించగల మెగ్నీషియం, పోటాషియం, పాస్పరస్, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ చెరుకురసం లో పుష్కలంగా ఉన్నాయి. దాహం తీర్చి బలాన్ని […]

కడిగితే క్రిములూ, క్రీములూ వదుల్తాయి

ఆరోగ్యం ముఖ్యం అనుకొన్నప్పుడు ప్రతి చిన్న విషయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేకప్ బ్రష్ లు పదే పదే వాడుతుంటారు. అవి రోజు క్లీన్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. కనీసం వారానికి ఒక రోజన్నా శుబ్రం చేయాలి. ఆలివ్ నూనె లో ముంచిన దూదితో బ్రష్లు తడుపుతూ వుంటే వాటి పైన పేరుకొన్న అలంకరణ సామాగ్రి తలూకు అవశేషాలు క్రిములు పోతాయి. బ్రష్ కుచ్చుళ్ళు ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి. కొబ్బరి నూనె లో యంటి […]

ఆహారం కాదు జీవన శైలి మార్చాలి

కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం రెండూ మెరుగవ్వుతాయి. కాఫీ, టీ లకు బదులు గ్రీన్ టీ, వైట్ బ్లాక్ టీ తాగితే మంచిదంటారు బ్రిటిష్ డైటింగ్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు. ఓపికగా వాళ్ళు సూచించిన పనులు చేయాలి. ఆలస్యంగా నిద్రపోవడం, తినడం ఏదీ మంచిది కాదు. ఇలాంటి జీవన శైలి ఊబకయానికి దరి […]

ఎప్పుడూ నేనింతే

ఈ పాత్రని నేను చేయక పొతే ఇంకెవరు చేస్తారనుకుంటాను. అందుకే ఆ ఆత్మవిశ్వాసంతోనే నా కెరీర్ ఆరంభం నుంచి ఫలానా పాత్ర చేయలేనని నేనే సినిమా వదులుకోలేదు అంటోంది కధానాయిక శృతి హాసన్. కాటమరాయుడు సక్సెస్ తర్వాత ఆమె తమిళ సినిమాలో బిజీగా వుంది. అసౌకర్యం అన్న పదం నానిఘంటువులో వుండదు. చిన్నప్పటి నుంచి నువ్వు చేయలేవని నాతో అన్న పనులని  చేసేందుకు సిద్ధ పడే దాన్ని స్కూల్ లో సంగీతం, ఆటలు లాంటి విషయాల పైన […]

ఎన్నో వన్నెల కలబోత ఈ చేనేత

ఎలాంటి వాతావరణంలోనైనా కంచి, నూలు చీరలు ఏ వయస్సు వారికైనా ఎప్పుడు బావుంటాయి. నిజానికి ఈ మధ్యకాలంలో చేనేతలు, పటోలా, పోచంపల్లి, ఇకత్ గద్వాల్ చీరలకు ఆదరణ పెరిగింది కూడా బావుంటుంది. అయితే అంచు లేని చీరలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఫ్యాషన్ కూడా అంచు లేకున్నా కొంగు భారీగానే ఉంటాయి చేనేత పట్టులో కనుక బ్లవుజ్ భారీ పనితనంతో వుండాలి. ఆధునిక డిజైన్లలో క్రాప్ టాప్ తరహ బావుంటాయి. పల్చగా తేలికగా ఉండే డాకా మన్లిన్ […]

నన్ను వైవిధ్యంగా చూడాలనుకొంటున్నారు

బాహుబలి లో అవంతిక పాత్రలో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తమన్నా, “నన్ను వైవిద్యభరితమైన పాత్రల్లో చూసేందుకు ఇష్టపడతారని తేలిపోయింది. ఈ సారి వషు భగ్నానీ చిత్రంలో బధరురాలి పాత్రలో నటిస్తున్నానన్నది. తన కొత్త సినిమా గురించి చెప్తు నాయనతార ప్రధాన పాత్రలో తమిళంలో విడుదలకు సిద్ధమైన ‘కొలైయ తూర్ కాలమ్’ సినిమాకు రీమేక్ ఇది ఈ సినిమాలో నాది చెమిటి, మూగ పాత్ర అంటూ చెప్పింది. తమన్నా కొత్త దారిలో నటించేందుకు సిద్ధంగా వుంది. ఇప్పుటి వరకు […]

నలుగిరికీ సాయ పడితే ముందు మనం బాగుంటాం

నీహారికా, కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం ఎంతో ప్రయోజనం అని కొన్ని నివేదికలు స్పష్టం చేసాయి. సామజానికి పనికి వచ్చే ఎదో ఒక్క పని లో భాగంగా వుంటే, అంటే అది నలుగు మొక్కలు పెంచే పని కావొచ్చు, నలుగురు పేద పిల్లలకు భోజనం పెటోచ్చు, చదువు చేపోచ్చు, పాత బట్టలు సేకరించి ఇవ్వోచ్చు. ఇలా […]

సినిమా ముందు కిక్ బాక్సింగ్ తేలిక

మూడు సంవత్సరాల వయస్సు నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది రితికా సింగ్ ముంబాయి కి చెందిన ఈ అమ్మాయిఇరుదు చుట్రు(చివరి రౌండ్) సినిమా తో సినీరంగ ప్రవేశం చేసి పెద్ద విజయం సాధించింది. గురు తో వెంకటేష్ తో నటించింది. ఆ సక్సెస్ లో మునిగి తేలుతుంది. ద్రుష్టి అంతా కిక్ బాక్సింగ్ పైనే వుండేది. పైగా కెరీర్ ప్రారంభంలోనే సీనియర్స్ తో నటించడం కకాస్త కష్టమే. గురులో నా పాత్రకు పెద్దగా మెకప్ లేదు. కానీ […]

గోళ్ళ పై మరకలకు నిమ్మరసం వాడండి

గోళ్ళ పై పసుపు పచ్చని మరకలు పడిపోతూ ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ సరిగా లేకపోయినా, లేదా తరచుగా నెయిల్ పెయింట్ వేస్తున్నా. నెయిల్ కలర్ సరిగా వదలదు. ఇలాంటి సమస్య ఎదురవ్వుతుంది. వీటిని సాదరంగా పాలిష్ తో కవర్ చేస్తారు. ఇవి ఎప్పటికీ పోకుండా అలాగే ఉంటాయి. తాజా నిమ్మ రసం ఒక్క బౌల్ లోకి తీసుకుని మరకలు పడ్డ గోళ్ళని కొద్ది నిమిషాలు అందులో ముంచి, తర్వాత పొడి గుడ్డతో తుడిచి కొద్ది చుక్కలు […]

ఆమె గురించి నిమిషం ఆలోచిస్తున్నారా?

ఇంట్లో అందరికీ తెల్లారేసరికి, అమ్మకి తెల్లారి మూడు గంటలు దాటిపోయి ఉంటాయి. ఆమె అంత ముందరగా లేస్తేనే అందరికి సకల సదుపాయాలు. ఆమె ఒక్క రోజు అనారోగ్యంతో మంచం ఎక్కితే ఇంట్లో అందరి అవసరాలు పాడుకుంటారు. ఇవ్వాల్టికి బయట నుంచి భోజనం, ఇవ్వాళ బట్టలు వుతకక పోయినా పర్లేదు, ఇల్లు చిమ్మక పొతే ఏం పోయింది? ఇది ఇంట్లో వాళ్ళ వరస ఇలా ఇంట్లో చిన్నా పెద్దాల గురించి పట్టించు కునే ఆమె ఇంకా పిల్లల్ని కూడా […]

ఈ రారజుకు మీ ఇంట్లో చోటుందా?

రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే రాగులు చాలా చవక కూడా. పాలిష్ చేసిన బియ్యం, గోధుమల వల్ల ఒరిగింది ఏమి లేదని తేలాక అందరి దృష్టి రగుల్లాంటి తృణ ధాన్యాల వైపు మళ్ళింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పళ్ళెంలో ముందుగా చోటు కల్పించ వలసింది రాగులకే అంటారు న్యుట్రీషనిష్టులు. రాగుల్లోని ట్రెపోఫాన్ అనే అమైనో […]

హీరోయిన్ల సమ్మర్ బ్యూటీ టిప్స్

ఎప్పుడో వైటెనింగ్ క్రీమ్ యాడ్ లో తెల్లని మోహనంతో మెరిసిపోతూ కనిపించే యామీ గౌతమ్ ఈ ఎండల్లో తేలికపాటి ఫ్యాబ్రిక్ లో లైట్ షేడ్స్ వున్న డ్రెస్ లో కంఫర్టబుల్ గా ఉంటానంటోంది. స్లీవ్ లెస్ లు వేసుకున్నా ఎండకి ఎక్స్ పోజ్ అయ్యే శారీరక భాగాలకు సన్ స్క్రీన్ రాసుకుంటాను. ఇక ఆహారం అయితే సీజనల్ ఫుడ్స్ . కొబ్బరి నీళ్ళు ఐస్ ట్రై లో పోసి ఆ ఐస్ ముక్కలతో ముఖం రుద్దుకుంటానంటోందీమె. ఇక […]

ఈ సమ్మర్ కూలింగ్ గాడ్జేస్

ఎండ తప్పించి ఇంకొక విషయం మాట్లాడుకోవడం లేదు కదా. సరే మరి ఈ ఎండాకాలంలో హాయిగా రోడ్డు పైన నడిచే అవకాశం వుంది తెలుసా. Rurudo Fan Shade కొనుక్కుంటే ఈ గొడుగు నీడనిస్తుంది, గాలినిస్తుంది, చల్లదనం ఇస్తుంది. ఈ గొడుగు లోపల చిన్న ఫ్యాన్ వుంటుంది. చల్లదనం ఇచ్చే ఏర్పాట్లు వున్నాయి. ఈ గొడుగేసుకుని బయటకు వెళితే అంతా కూల్ కూల్. అంతేనా Air conditioned work shirt వేసుకుంటే ఇంకా ఎండ చిరకులేవీ దగ్గరకు […]

సరిగా సర్దేస్తే ఓ దారికొస్తాయి

ఇప్పుడే కొంచెం తీరుబడిగా వుండే సెలవు రోజులు. ఇప్పుడే కొన్ని పనులు బుద్దిగా చేసుకోవాలి. షాపింగ్ కోసం వెళ్లి ఒక్కటే కొనాలని నిర్ణయించుకొని కూడా కంటికి బావున్నవన్ని కొనిపడేస్తారు. ఇంటికి తెచ్చుకొన్నాక కొన్న కాంబినేషన్స్ సరిపోవు. కొన్ని ఏ డ్రెస్ కి నప్పవు. ఇక అవన్నీ వార్డ్ రోబ్ నిండా కుక్కినట్లు పడివుంటాయి. వాటి పని పట్టండి ముందర. కొద్దిపాటి లోపాలుంటే వాటిని సరిచేసి, కొన్ని అస్సలు వద్దనుకొంటే వాటిని పక్కన పెట్టేస్తే అల్మారా సగం ఖాళీ […]

ఆహారాన్ని అలంకరించినా ఆరోగ్యమే

కంటికి నచ్చేలా ఉంటేనే మనసు మెచ్చుతుంది. అలా తిన్నాడే శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనేది పాత సామెత లాంటిదే అయినా ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు షెఫ్స్. తాజా కాయగూరలు, పండ్ల తోనే రకరకాల డిజర్ట్స్, సలాడ్స్ చేసే షెఫ్స్ నిండైన రంగుల్లో ఉండే కాయగూరలతో కనువిందుగా చేసే ఆహార పదార్ధాల్లో ఎన్నో ఆంతోసైనిన్లు, ఫైటో న్యూట్రియంట్లు అన్ని కలిపి యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయని చెపుతున్నారు. పండ్లు, డ్రై ఫ్రూట్లు, తేనే కలిపి అందమైన అమరికతో […]

పెరిగింది పాతిక శాతం మాత్రమే

మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్న పది దేశాల్లో ప్రముఖ వృత్తి నిపుణుల సామాజక అనుబంధ సంస్థ లింక్డ్ ఇన్ ఒక అధ్యయనం నిర్వహించింది. మన దేశంలోని పెద్ద కంపెనీల్లో మహిళలను ఉన్నత స్థానంలోకి తీసుకోవడం మునుపటి కంటే మెరుగుపడిందట. తరాల తరబడి ఎంతో వెనుకబడినా అత్యధికంగా, అతివేగంగా పాతిక శాతం వృద్ది సాధించిందని రిపోర్ట్. ఇటీవల కాలంలో ఇలాంటి నియామకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి కానీ మగవాళ్ళతో పోల్చితే ఉన్నత స్థానాల్లో స్త్రీల ఉనికి అంతంత మాత్రమే అంటోంది […]