ఆధ్యాత్మిక మార్గంలో తల్లి కూతుళ్లు
గురుగ్రామ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ 37 ఏళ్ల అక్షిత జైన్ ఐహిక సుఖాలను పరిత్యజించి 50 లక్షల వార్షిక వేతనం గల ఉద్యోగాన్ని వదిలి తన 61 ఏళ్ల తల్లి శిరోమణి బజాజ్ తో కలిసి సన్యాస దీక్ష ను తీసుకున్నారు. ఆటోమొబైల్ రంగంలో పనిచేసిన అక్షత ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు వెళ్లాయి.డేటా సెంటర్ల నిర్మాణం కోసం భూమిని తవ్వటం దానివల్ల సూక్ష్మజీవులకు కలిగే హాని పర్యావరణ విధ్వంసం ఆమెను ఆందోళనకు గురిచేసింది.అందుకే ఉద్యోగంతో పాటు సంపదను,సకల సౌఖ్యాలను తృణ ప్రాయంగా భావించి జైన మత సన్యాసిగా సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు అక్షిత తో పాటు ఆమె తల్లి శిరోమణి కూడా సన్యాసం తీసుకున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 37 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన శిరోమణి చీఫ్ మేనేజర్ గా పదవీ విరమణ పొందారు .కుటుంబ బాధ్యతలు అన్ని నెరవేర్చడంతో ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ వచ్చారు. జైన ఆధ్యాత్మిక గురువు సాద్వి పూర్ణ ప్రజ్ఞ శ్రీ బోధనలతో ప్రభావితులైన తల్లి కూతుళ్లు సన్యాస మార్గాన్ని అనుసరించారు. అక్షిత హర్యానా రాష్ట్రం గురు గ్రామ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. జైన సాధ్వి గా దీక్ష తీసుకున్నారు.
