• ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి తీరాలి. ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగించాలో ముందే నిర్ణయిచుకోవాలి. పని త్వరగా పూర్తి అయ్యే చోట ఆరంభిస్తే ముగిసిన పని ఇచ్చే ప్రోత్సాహం తో మిగతావి త్వరగా పూర్తి చేసే వీలుంటుంది. ఒక ప్రదేశం, వార్డ్ రోబ్ గది ఇలా వరుసగా ఒక దాని తర్వాత మరొకటే ఒకటి తర్వాత ఒకటిగా ముగించాలి. పెద్దగా వాడని అవసరం లేని వస్తువుల్ని తీసేయడం ఉత్తమం. ఇది బయట పడేద్దాం ఎవరికీ ఉపయోగ పడవు అని కొన్నింటిని ఇవి ఎవరికైనా పనికొస్తాయి. డొనేట్ చేద్దాం అని విభజించుకోవాలి. కొన్ని వస్తువులతో ఎమోషనల్ గా అనుభందం వుంటుంది. వాటిని సురక్షితంగా స్టోరేజ్ లో ఉంచాలి. ఇంట్లో అనవసరాలన్నీ తొలగించు కుంటే బుర్ర లోని వేస్టేల్ కూడా తొలగించినట్లే.

    చిందర వందరగా వుంటే చాలా కష్టం

    ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి …

  • ఇప్పుడే కొంచెం తీరుబడిగా వుండే సెలవు రోజులు. ఇప్పుడే కొన్ని పనులు బుద్దిగా చేసుకోవాలి. షాపింగ్ కోసం వెళ్లి ఒక్కటే కొనాలని నిర్ణయించుకొని కూడా కంటికి బావున్నవన్ని కొనిపడేస్తారు. ఇంటికి తెచ్చుకొన్నాక కొన్న కాంబినేషన్స్ సరిపోవు. కొన్ని ఏ డ్రెస్ కి నప్పవు. ఇక అవన్నీ వార్డ్ రోబ్ నిండా కుక్కినట్లు పడివుంటాయి. వాటి పని పట్టండి ముందర. కొద్దిపాటి లోపాలుంటే వాటిని సరిచేసి, కొన్ని అస్సలు వద్దనుకొంటే వాటిని పక్కన పెట్టేస్తే అల్మారా సగం ఖాళీ అవుతుంది. వదులైనవి, ఎంతో ఖరీదు పెట్టి కొన్నాక ఎందుకు నచ్చకుండా పోయినవి ఇతరులకు పనికి వస్తయనుకొంటే వాటిని చక్కగా ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఇలా అవసరం లేనివన్నీ తీసేస్తే అవసరం ఉన్న వాటి లెక్క తేలుతుంది. నలుపు, తెలుపులు, కొన్ని లేత రంగులవి ఎప్పుడూ బావుంటాయి. కొట్టచ్చే రంగుల జీన్స్ పాంట్స్ పైకి ఈ లేత రంగులు ఎప్పుడూ బావుంటాయి. అలాంటివి ఎన్నున్నాయో లెక్క తేల్చుకొంటే అసలు షాపింగ్ చేసి కొత్తవి కొనలో వద్దో ఓ నిర్ణయానికి రావచ్చు. అలాగే కొన్ని హీల్స్, ప్లాట్స్ బావున్నవన్నీ ఓ పక్కన పెట్టేసుకొంటే ఇక సెలవులయ్యాక విదుల్లోనో లేదా కాలేజీకో వెళ్ళాలంటే అసలు మన దగ్గర మిగిలిన డ్రెస్సులు, చెప్పులు, లోదుస్తులూ సరిగ్గా లెక్కలు తెలిసి ప్లానింగ్ కు ఓదారి తెలిసిపోతుంది.

    సరిగా సర్దేస్తే ఓ దారికొస్తాయి

    ఇప్పుడే కొంచెం తీరుబడిగా వుండే సెలవు రోజులు. ఇప్పుడే కొన్ని పనులు బుద్దిగా చేసుకోవాలి. షాపింగ్ కోసం వెళ్లి ఒక్కటే కొనాలని నిర్ణయించుకొని కూడా కంటికి బావున్నవన్ని…