Saturday, 28 Nov, 2026

అంత తొందరగా రిజల్ట్స్ కనపడదు

చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్ మజిల్ డెసినిషన్ వుంటుంది. ఇదో డిస్ అడ్వాన్ టేజ్. పురుషుల కంటే ఎక్కువ ఫ్యాట్ వుంటుంది కనుక అంత త్వరగా రిజల్ట్స్ కనిపించవు. పైగా మహిళలకు తెస్తోస్టిరాన్ చాలా తక్కువ స్థాయి లో వుంటాయి. ఈ హార్మోన్ పురుషులలో ఈకువ స్థాయి లో వుండి వాళ్ళు చాలా తేలికగా […]

నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి

ఐలైనర్ ను కళ్ళ ఇన్నర్ రిమ్స్ లో అప్లై చేస్తేనే కళ్ళు అందంగా వుంటాయి. ఈ ప్రోడక్ట్ ను ప్రోమోట్ చేసే సినీ తారలు ఇదే మాదిరి అప్లై చేస్తారు. ఇలా ఐ లైనర్ ను వాడటం కరక్టేనా, కళ్ళకేం ప్రాబ్లం కాదు కదా అని చాల మంది సందేహంలో పడుతుంటారు. ఎక్స్ పర్ట్స్  ఏం చెపుతారంటే పేరు పొందిన కంపెనీలు కళ్ళ పరిసర ప్రాంతాలకు సురక్షితమైన పరిక్షలు జరిపాకే, ఆ పదార్ధాల నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి. […]

ఆత్మీయి స్పర్శే మంచి మెడిసిన్

కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు ఉంటే ఎలాంటి వత్తిడినైనా ఇట్టే అధిగమించ వచ్చు. ఆలోచనలు అదుపు చేయవచ్చు. ఉద్వేగాలని అపవచ్చు, ఒత్తిడి అనిపిస్తే రెండు నిమిషాల ప్రాణాయామం చాలు. బ్లాక్ టీ తాగితే ఇది వత్తిడిని పెంచే కర్టసాల్ హార్మోన్ పైన ప్రభావం చూపెడుతుందిట. బ్లాక్ టీ రోజుకు ఒక్క సరైనా తాగాలి. అలంటి […]

సంతోషం మనం సృష్టించే అద్భుతమే

నీహారికా, ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది. మనం నవ్వినప్పుడు ఎండార్ఫిన్లుగా పిలవబడే న్యురోట్రాన్స్ మీటర్స్ విడుదలై సంతోషాన్ని ఇస్తాయి. ఒత్తిడి స్థాయిల్ని తగ్గిస్తాయి. సరదాగా వుండే అన్నింటి వైపు దృష్టి సారించడమే. మనం చుసేవే మన మనసు-ని ప్రభావితం చేస్తాయి. కామెడీ షోలు,ఫన్నీ వీడియోలు, కామిక్ స్ట్రిప్స్ వంటి తక్షణ సరదాలు జీవితం లోకి తెచ్చుకోవాలి. […]

సోయా వల్ల గుండెకు మేలు

సోయా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు ఖాయం చేశాక ఇందులో ఎన్నో వెరైటీలు మార్కెట్ లో వెలిశాయి. ఈ సోయాలో వుండే ఓ పోషక పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుందని నిపుణుల తాజా పరిశోధనల్లో తేలింది. ఇందులోని ఐసో ఫ్లెవోనిన్లు అనే పోషకాలు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఇందులో ఈక్వల్ అనే పదార్ధం ఉత్పత్తి అవుతుంది. దీని కారణం గానే హృద్రోగ సమస్యలు రావు. ఈ పదార్ధం కారణంగానే రక్తనాళాల్లో కాల్షియo […]

ఇవి నిజంగా క్యాబేజి పువ్వులు

ఇంటి ముందు పువ్వుల తోట బాగుంటుంది. అదే కూరగాయాల్ని పువ్వులుగా పండిస్తే……….. ఇలాంటివే క్యాబేజి పువ్వులు. అర్నమెంటల్ క్యాబేజిలుగా పిలిచే ఇవి తోట ఒక ప్రత్యేకమైన అందం. క్యాబేజిని తెలుపు, ఆకుపచ్చ, వంగపండు, గోధుమ, ఎన్ని రకాల వర్ణాలు వుంటాయి. క్యాబేజి మొక్కలో చుట్టూ ఆకులుండి మధ్యలో బంతి పువ్వు విచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అలా విచ్చుకునే రేఖలో మనం నాటిన రకాన్ని బట్టి వివిధ రంగుల్లో వస్తాయి. విచ్చుకున్నాక వరం రోజుల పాటు చెక్కగా ఉంటాయి. తోటలో […]

లాలీ పాట తల్లి బిడ్డలకు ఆరోగ్యం

బిడ్డ కోసం తల్లి పాడే లాలి పాట పైన మియామి యూనివర్సిటీ పరిశోధనలు చేసారు. ఈ పాట వల్ల ఎన్నో లాభాలున్నాయట. పసి పిల్లలకు పది రకాల గొంతులతో పాటలు, మాటలు వినిపించారట. అందులో తల్లి పాడే పాటకే బిడ్డ మెదడు స్పందించిందట. ఆ పాట వింటున్న పసి బిడ్డలో ఆ సమయం లో మెదడు చురుకుగా ఉంటుందిట. అలంటి లాలిపాట తల్లి లో కూడా ఆరోగ్యం అంటున్నారు. బిడ్డను తీరికగా లాలిస్తూ తన చేతుల్లోకి ప్రేమగా […]

ఈ అద్భుత సృజన ఎలా సాధ్యం

లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా మంది డిజైనర్లు వుండగా అన్నెట్టి గబేడే గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆమె చేతులకు వెళ్ళే లేవు.ఈ వైకల్యం ఆమె లోని సృజనకు అడ్డకట్ట వేయలేక పోయింది. వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్. సిల్వర్, గోల్డ్, డైమెండ్స్, ఎమరాల్డ్స్ వంటి ఎంతో ఖరీదైన స్టోన్స్ ఉపయోగించి ఆమె అద్భుత సృష్టి […]

ఇది ఆరోగ్య సౌందర్య ఫలం

ద్రాక్ష పండు మీద తెల్లని పూత చూసి అదేదో క్రిమి సంహారక మందు అనుకోవద్దు. ఇది సహజమైంది. దిన్ని బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా ఫంగస్ చేరకుండా ఈ బ్లూమ్ తోర్పడుతుంది. ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యం కోసం ద్రాక్ష ఎంతో మేలు. రోజు అందరిలో ద్రాక్ష తింటే చర్మం నిగారింపు తో ఎప్పటికి వృద్దాప్య ఛాయల్ని రానీయకుండా అడ్డుకుంటుందని సౌందర్య నిప్పునులు చెప్పారు. ద్రాక్ష గుజ్జు మొహం పైన రాస్తే, 20 నిమిషాల పాటు […]

రూపాన్ని మార్చేసే హెయిర్ కట్స్

బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్ , సౌకర్యం, అందం, అన్ని దక్కుతాయి. లాంగ్ గా అయితే పొడవ్వైన కురులని కట్ చేసి అలా దువ్వి వదిలేయడం ఇవాల్టి ట్రెండ్. లాంగ్ అంటే లగ్జరి కొంచం వంపు తిప్పి ఎలాగైనా వదిలేసే వీలుంది. పొడవాటి జుట్టు ఫేవ్ కట్ స్టైల్  స్టేట్మెంట్. అలాగే ప్రింజెన్ చెక్కగా […]

జీన్స్ కి తిరుగే లేదు

జీన్స్ ఎప్పుడు బాగుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త సన్నగా వుండే జీన్స్ కంటే బెస్ట్ డ్రెస్ ఇంకొకటి లేదు. స్కిన్ని  జీన్స్ బాగుంటాయి. బ్రైట్ కలర్స్ ఏవైనా సరే. అయితే నలుపు, డార్క్ ఇండిగో వేసుకుంటే కళ్ళు మరీ సన్నగా కనిపిస్తాయి. లైటర్ టోన్స్ చెక్కగా నప్పుతాయి. మోకాళ్ళ వద్ద ఫేడెడ్ గా, కాళ్ళ దగ్గర క్లావర్ గా వుండే జీన్స్ రకాలు అదనపు కర్వలు ఇవ్వడం తో ట్రెండో ఎఫెక్ట్ ఇస్తాయి. ప్లాప్ పాకెట్స్ ఏమ్బలిష్మేంట్ […]

జలుబుకు విటమిన్-డి

ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జలుబు సాధారణ సమస్యగా పైకి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రనంతకంగా మారే అవకాసం వుంది. జలుబు నుంచి విముక్తి కి విటమిన్-డి వాడండి అంటున్నారు. క్వీన్ యూనివర్సిటీ పరిశోధకులు 14 దేశాలల్లో 11 వేల మంది పైన ఈ పరిశోధన జరిగింది. తీవ్రమైన […]

బ్రాండ్ కంటే సౌకర్యం బట్టి ఎంచుకోవడం బెస్ట్

టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్  ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక ప్రత్యేకమైన బ్రాండు బాగుంటుంది అని చెప్పడం కష్టం. ఏది సౌకర్యంగా వుంటుంది అని, ఎవరికి వాళ్ళు కొన్ని రకాలు వాడి తలిసుకోవాలి. ఏ సానిటరీ ప్యాక్ మంచిదో, వాళ్ళ పీరియడ్ తీరు తెన్నులు బట్టి వుంటుంది. ఋతుస్రావం కొందరికి భారీగా కొందరికి తేలికగా వుంటుంది. కొందరికి తక్కువ రోజులు […]

ఆరోగ్యo జాగ్రత్తమ్మా – నిన్ను నువ్వయినా పట్టించుకో

నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ మూడు ప్రపంచాల పౌరురాలు. గడప దాటేదాక భర్త, ఇల్లు, పిల్లలు దాటాకా ఆఫీస్ కెరీర్ పోటీ ఇన్ని పాత్రలకు ఎంతో కష్టంతో న్యాయం చేస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా అది వైఫల్యమే. ఇన్ని బాధ్యతల మధ్య చిరునవ్వుతో తనకు తాను నిరూపించుకోవాలంటే ముందస్తుగా ఆరోగ్యంగా ఉండాలి. అoదుకే వేళకు […]

దేశ ఆరోగ్యం కోసం బయోకాన్

2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ […]

ట్రాక్టర్స్ రాణి మల్లికా

ట్రాక్టర్స్ రాణి  అంటారు  మల్లికా  శ్రీనివాసన్ ను . సాంప్రదాయ  తమిళ  కుటుంబంలో  పుట్టిన  మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా  , సిఇఓ గా  వ్యవరహిస్తూ దాన్ని లాభాల బాట లో  నడిపిస్తున్నారు. అమెరికాలోని విజిసిఓ సంస్థ బోర్డులో ఆమె సభ్యురాలు. టాటాస్టీల్ , టాటా గ్లోబల్ బెవరేజస్ లో మల్లికా డైరెక్టర్. అమెరికాలో బిజినెస్ స్కూల్ లో ఎం.బి.ఏ చేసిన మల్లిక పర్యవేక్షణ లో టుఫే అంటే ట్రాక్టర్ అండ్ ఫర్మా ఎక్విప్మెంట్ […]

పర్యావరణ పరిరక్షణ లక్ష్యం.

ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారియన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ల ను నడిపిస్తున్న పర్యావరణ వేత్త సునీతా నారియన్. బహుళ జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్ధాలు వున్నాయి అని లేబరేటరీ రిపోర్ట్స్ ద్వారా నిరూపించి కొక్, పెప్సీ, కోలా కంపెనీలకు హడలెత్తించారు […]

మీడియాలో తిరుగులేని శోభనా

హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన […]

ఐటీ లో తిరుగు లేని పద్మశ్రీవారియర్

ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ […]

ఒక ధిక్కారం నేహాసింగ్

టీ.వి దర్శకురాలిగా, పప్రోడ్యుసర్ గా , నటిగా, రచయిత్రి గా నేహాసింగ్ ముంబాయి మహిళలకే స్పూర్తి. ముంబాయిలో అమ్మాయిల స్వేచ్చ కోసం, రండి, గుంపులుగా రండి, కలసి కట్టుగా ముంబాయి వీధుల్లో నడవండి. ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగేట్టిద్దాం రండి అంటూ పిలుపునిచ్చిన నేహాసింగ్ సంకల్ప బలం తో ఆకతాయిలను లొంగ దీద్దాం అంది. పురుషులు ఎంత స్వేచ్చగా విహరిస్తున్నారు నాకూ అంతే స్వేచ్చ కావాలి మహిళలకు మాత్రం తక్కువ స్వేచ్చ, ఆంక్షలు ఎందుకు. ఇది అంగీకారం […]