• ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో బి.పీ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే చెర్రి పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిదని చెపుతున్నారు పోషక నిపుణులు. ఈ స్టడీలో భాగంగా బిపీ, టెన్షన్లతో బాధ పడుతున్న వారికి 60 మిల్లీ లీటర్ల చెర్రీ జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తీసుకున్న తర్వాత బిపి తో ఉత్సాహం స్పష్టంగా నమోదైనదని పరిశోధకులు చెప్పుతున్నారు. జ్యూస్ తీసుకున్న మూడు గంటల తర్వాత కూడా బి.పి కంట్రోల్ లో ఉన్నట్లు ఈ పరిశోధన రుజువు చేసింది. అధిక రక్త పోటు, గుండెకు సంబందించిన రుగ్మతకు కారణం అవుతుంది. అందువల్ల టెన్షన్ తగ్గించు కునే సాధనాల్లో ఈ చెర్రీ జ్యూస్ చేర్చుకోమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

    టెన్షనా? చెర్రీ జ్యూస్ తాగి చూడండి

    ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో…

  • కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు ఉంటే ఎలాంటి వత్తిడినైనా ఇట్టే అధిగమించ వచ్చు. ఆలోచనలు అదుపు చేయవచ్చు. ఉద్వేగాలని అపవచ్చు, ఒత్తిడి అనిపిస్తే రెండు నిమిషాల ప్రాణాయామం చాలు. బ్లాక్ టీ తాగితే ఇది వత్తిడిని పెంచే కర్టసాల్ హార్మోన్ పైన ప్రభావం చూపెడుతుందిట. బ్లాక్ టీ రోజుకు ఒక్క సరైనా తాగాలి. అలంటి నవ్వుకి ఏర్పడే ఎండార్ఫిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. నవ్వుకోసం నవోచ్చే పుస్తకాలు చుసినా సినిమా చూసినా, ఫ్రెండ్స్ తో నవ్వులలో మునిగి తేలిన ఎలాగైనా నవ్వాలి. అలాగే ఒక ఆత్మీయి స్పర్శే ఎంతో సేద తీరుస్తుంది. ఒక్క కౌగిలింత రక్త పోతూ ను తగ్గిస్తుంది, హార్మోన్ల హెచ్చు తగ్గులను అదుపు చేస్తుంది. కార్టిసాల్ ని నియంత్రిస్తుంది.

    ఆత్మీయి స్పర్శే మంచి మెడిసిన్

    కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు…

  • మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప సంగీతం వినటం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుందని లయబద్దమైన సంగీత సుస్వరాలకు మనసు స్వాంతన చెందటం ద్వారా వత్తిడులకు దూరంగా ఉండచ్చని పరిశోధన వెల్లడైంది. రోజుకో అరగంట పాటు సంగీతం వినాలని దానితో మానసిక ప్రశాంతత తో పాటు రక్త నాళాలు సాఫీగా మారతాయని పరిశోధనల సారాంశం. 200 మంది గుండె జబ్బున్న రోగులకు లీనులవిందైన సంగీతాన్ని వినిపించి తర్వాత వారి రక్త ప్రసరణ తీరు పరిశీలించారు . మంచి సంగీతం విన్నాక రక్త ప్రసారణా తీరు మెరుగుపడగా రక్త ప్రసరణ లో విడుదల అయ్యే నైట్రిక్ యాసిడ్ రక్తనాళాల్లో గడ్డలను అవరోధాలను తగ్గిస్తోందన్న విషయం గమనించారు. అయితే ప్రశాంతమైన సంగీతం మాత్రమే వినాలనీ హోరు వాయిద్యాల ద్వారా సంగీత ధ్వని వింటే ఒత్తిడి మరింత పెరిగే అవకాశం వుందన్న విషయం కూడా గుర్తించారు. మంద్ర స్థాయిలు సాగే సంగీతం ఆరిథమ్ లో మంచి ఫలితం పొందవచ్చునని చెపుతున్నారు.

    సంగీతంతో గుండె పదిలం

    మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప…

  • రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు 10 గ్రాములు తీసుకొంటున్నారని తేలింది. ఇలా ఉప్పు పైన నియంత్రణ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ వంటకాల్లో ఎన్నో దినుసులు, పులుపులు, కారాలు ఎక్కువే. వండే కూరల్లో, పులుసుల్లో టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వీటికి తోడుగా ఉప్పు వాడటం తప్పదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆహారం వండే సమయంలో ఉప్పు వేయకండి. సహజంగా అన్నీ ఉడికాక రుచి చూసుకొని కావలసినంత ఉప్పు జోడించమంటున్నారు. సహజంగా కూరగాయల్లో వుండే ఉప్పు సరిపోతుందంటారు. ఉడికించకుండా, ఆవిరిపైన ఉడకబెట్టి గ్రిల్లింగ్, మైక్రోవేవ్ చేయటం బెస్ట్ అంటారు. రోజుకి ఐదు గ్రాములకు మించి ఉప్పు వాడద్దని WHO హెచ్చరిస్తుంది.

    ఉప్పు వాడటం తగ్గిస్తే బెటర్

    రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు…